Indian Navy Jobs: ఇంటర్‌తోనే నేవీ కొలువు... ప్రయోజనాలు, అర్హతలు, పరీక్ష విధానం ఇలా..
నేవీ 10+2(బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్
ఇంటర్ ఎంపీసీ విద్యార్థుల కోసం ఇండియన్ నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీం పేరుతో ప్రతి ఏటా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ప్రస్తుతం 2022లో ప్రారంభమయ్యే కోర్సుకు సంబంధించి ప్రకటన విడుదలైంది. ఈ విధానంలో ఎంపికైన వారు కేరళలలోని నేవల్ అకాడమీ ఎజిమలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లేదా మెకానికల్ బ్రాంచ్‌ల్లో నాలుగేళ్లపాటు ఇంజనీరింగ్ విద్యను ఉచితంగా చదివే అవకాశం లభిస్తుంది. విజయవంతంగా కోర్సును పూర్తిచేసుకున్న వారికి జేఎన్‌యూ డిగ్రీ ప్రధానం చేస్తారు. అనంతరం సబ్‌లెఫ్టినెంట్ హోదాతో నేవీలో ఉద్యోగావకాశాన్ని పొందవచ్చు.
- మొత్తం పోస్టుల సంఖ్య: 35(ఎడ్యుకేషన్ బ్రాంచ్ –05, ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్–30)
- అర్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఫిజక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యలో కనీసం 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే 10వ తరగతి లేదా 12వ తరగతి స్థాయిలో ఇంగ్లీష్ సబ్జెక్టులో కనీసం 50శాతం మార్కులను సోర్క్ చేయాలి. దీంతో పాటు జేఈఈ మెయిన్ 2021(బీఈ/బీటెక్)కి హాజరై ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
- వయసు: 02 జనవరి 2003 నుంచి 01 జులై 2005 మ«ధ్య జన్మించి ఉండాలి.
చదవండి: After Class 10+2
ఎంపిక ప్రక్రియ
- ఎన్‌టీఏ విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా కామన్ ర్యాంక్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇది రెండు దశల్లో ఉంటుంది.
ఇంటర్వ్యూలు జరిగే ప్రాంతాలు
షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు మెయిల్ లేదా ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా సమాచారం అందిస్తారు. వీరికి బెంగళూర్/భోపాల్/కోల్‌కత్తా/విశాఖపట్నంలలో మార్చి–ఏప్రిల్ 2022 మధ్య ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
శిక్షణ ఇలా
ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన వారిని క్యాడెట్‌లుగా తీసుకుని కేరళ రాష్ట్రం ఎజిమళలోని నేవల్ అకాడమీలో నేవీ అవసరాలకు అనుగుణంగా నాలుగేళ్ల బీటెక్(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్) కోర్సుల్లో శిక్షణను ఇస్తారు. కోర్సును విజయవంతంగా పూర్తిచేసుకున్న అభ్యర్థులకు జేఎన్‌యూ బీటెక్ డిగ్రీ పట్టాను ప్రధానం చేస్తుంది. శిక్షణను పూర్తిచేసుకున్న వారిని నేవీ ఎగ్జిక్యూటీవ్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ (టెక్నికల్ బ్రాంచ్)లలో ప్రస్తుతం ఉన్న నేవల్ పాలసీకి అనుగుణంగా క్యాడెట్ల పంపిణి ఉంటుంది.
ముఖ్యమైన సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 27.01.2022
- దరఖాస్తులకు చివరి తేదీ: 08.02.2022
- వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/