Skip to main content

ADCET 2022 Notification: ఈ కోర్సులతో ఉజ్వల కెరీర్‌ అవకాశాలు

ap adcet 2022 notification, Test procedure and career opportunities
ap adcet 2022 notification, Test procedure and career opportunities

సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యాలు కలిగిన వారికి చక్కటి అవకాశం..ఫైన్‌ ఆర్ట్స్‌. ఇంటర్‌ తర్వాత ఆర్ట్స్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ వంటి డిజైన్, ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సులతోనూ ఉజ్వల కెరీర్‌ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (డా.వైఎస్‌ఆర్‌ఏఎఫ్‌యూ).. పలు ఫైన్‌ ఆర్ట్స్, డిజైన్‌ కోర్సులను అందిస్తోంది. 2022–23 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు ఏపీ ఉన్నత విద్యామండలి ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏడీసెట్‌)–2022 నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. ఏడీసెట్‌ పరీక్ష స్వరూపం, ప్రవేశ విధానం, ఆయా కోర్సులతో ఉద్యోగ అవకాశాలపై ప్రత్యేక కథనం...  
– ఏఎఫ్‌యూ (వైఎస్‌ఆర్‌ జిల్లా)

డా.వైఎస్‌ఆర్‌ఏఎఫ్‌యూలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌  కామన్‌  ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏడీసెట్‌)–2022 ద్వారా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ(డా.వైఎస్‌ఆర్‌ఏఎఫ్‌యూ)లో నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌(బీఎఫ్‌ఏ), బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బి.డిజైన్‌ ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 

కోర్సుల వివరాలు

బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఇంటీరియర్‌ డిజైన్‌ ), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌(బీఎఫ్‌ఏ) ఇన్‌ పెయింటింగ్‌/స్కల్ప్‌చర్‌/యానిమేషన్‌/అప్లయిడ్‌ ఆర్ట్స్‌/ఫోటోగ్రఫీ. 

అర్హతలు

ఇంటర్మీడియెట్‌ (ఎంపీసీ/ ఎంఈసీ/ బైపీసీ/ఎంబైపీసీ /సీఈసీ/హెచ్‌ఈసీ) లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.

చ‌ద‌వండి: After Inter Jobs: ఇంటర్‌తోనే సాఫ్ట్‌వేర్‌ కొలువు

పరీక్షా విధానం

  • బీఎఫ్‌ఏ, బి.డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఒకే ఉమ్మడి ప్రశ్నపత్రం ఉంటుంది. ఆన్‌లైన్‌(సీబీటీ) విధానంలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 100. పరీక్ష సమయం 120 నిమిషాలు. నెగిటివ్‌ మార్కులు లేవు. తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో ప్రశ్నలు ఇస్తారు. 
  • ప్రశ్నలన్నీ జనరల్‌ నాలెడ్జ్, ఆర్ట్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్, అప్లయిడ్‌ ఆర్ట్స్‌లో టెక్నికల్‌ డీటైల్స్, పెయిటింగ్, స్కల్ప్‌చర్, యానిమేషన్, ఫొటోగ్రఫీ, డిజైన్‌ స్కిల్స్‌ నుంచి అడుగుతారు.

చ‌ద‌వండి: Jobs After 10th & Inter: పది, ఇంటర్‌తోనే... కొలువుల దిశగా!

కెరీర్‌ అవకాశాలు

  • సృజనాత్మక నైపుణ్యాలు ఉన్నవారు ఫైన్‌ ఆర్ట్స్‌ యూజీ కోర్సులతోనే ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఆసక్తి ఉంటే.. సంబంధిత విభాగాల్లో ఉన్నత విద్య కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. 
  • ప్రస్తుతం నగరాల్లోని ప్రజలు నాణ్యమైన, ఆహ్లాదకరమైన జీవితం గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా ఇంటీరియర్‌ డిజైనింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. డిమాండ్‌కు తగ్గస్థాయిలో ఇంటీరియర్‌ డిజైనింగ్‌ నిపుణులు అందుబాటులో లేరు. దేశంలో ప్రస్తుతం లక్షమందికిపైగా ఇంటీరియర్‌ డిజైనింగ్‌ నిపుణుల కొరత ఉందని అంచనా. కాబట్టి బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఇంటీరియర్‌ డిజైన్‌ ) కోర్సులు పూర్తిచేస్తే ఫర్నీచర్‌ డిజైనింగ్, ఎగ్జిబిషన్‌ డిజైనర్, లైటింVŠ æడిజైనర్, కిచెన్‌ డిజైనర్, ఆర్కిటెక్ట్, ఆర్కిటెక్చురల్‌ టెక్నాలజిస్టు, ప్రాడక్ట్‌ డిజైనర్, టెక్స్‌టైల్‌ డిజైనర్‌ వంటి కొలువుల్లో స్థిరపడవచ్చు.
  • శిల్పకళ అత్యంత ప్రాచీనమైనది. ఆకారం, విలువ లేని సామగ్రికి శిల్పకారుడు రూపం ఇస్తాడు. ప్రస్తుతం బీఎఫ్‌ఏ స్కల్పచర్‌ కోర్సు చేసిన యువతకు విస్తృత ఉపాధి అవకాశాలున్నాయి. చక్కటి పరిశీలనా నైపుణ్యాలు, భావోద్వేగాలు, ఆలోచనలకు సమర్థరూపం ఇవ్వగలిగే నేర్పు ఉన్నవారికి ఈ కోర్సు చక్కగా సరిపోతుంది.
  • ఆర్ట్‌ డైరెక్టర్‌ కావాలనుకునేవారికి చక్కటి కోర్సు.. అప్లైయిడ్‌ ఆర్ట్‌. ఈ కోర్సుల్లో చేరి గ్రాఫిక్‌ డిజైన్, అడ్వర్‌టైజింగ్, లోగో డిజైనింగ్‌ అంశాల్లో ప్రావీణ్యత సాధించడం ద్వారా సినిమా రంగంలో ఆర్ట్‌డైరెక్టర్‌గా,సెట్‌డిజైనర్‌గా,విజువలైజర్‌గా అవకాశాలు అందుకోవచ్చు. వస్త్ర పరిశ్రమ, ఆభరణాల డిజైనింగ్, కలినరీ ఆర్ట్, గేమ్‌ డిజైనర్, యాడ్‌ ఫిలిం ఏజన్సీలలో స్టోరీ బోర్డ్‌ ఆర్టిస్ట్స్‌గా, క్రియేటివ్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా ఉపాధి పొందొచ్చు. 
  • ప్రస్తుతం యానిమేషన్‌ రంగం వేగంగా విస్తరిస్తోంది. ఎంటర్‌టైన్‌ మెంట్, గేమింగ్‌ రంగాలు విస్తరిస్తుండటంతో యానిమేషన్‌ కోర్సులు పూర్తి చేసిన వారికి కెరీర్‌ అవకాశాలకు కొదవలేదు. యానిమేషన్‌ కు సంబంధించి చలన చిత్ర రంగం, టెలివిజన్, అడ్వర్‌టైజింగ్‌ విభాగాలు ప్రధాన ఉపాధి వేదికలు.
  • చిత్రలేఖనం పురాతన కళ. చిత్రకారుడు ప్రకృతి అందాలను మనసులో నిక్షిప్తం చేసుకుని, సృజనాత్మకతను జోడించి కుంచెతో అద్భుతంగా ఆవిష్కరిస్తాడు. ప్రస్తుతం సమాజంలో కళాభిలాష పెరిగిన నేపథ్యంలో పెయింటింగ్‌ యువతకు మంచి కెరీర్‌ మార్గంగా నిలుస్తోంది. పెయింటింగ్‌లో ఆయిల్‌పెయింట్, వాటర్‌కలర్‌ పెయింట్, ఆక్రిలిక్‌ పెయింట్, టెంపెరా పెయింట్‌ వంటి రకాలు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ కోర్పు పూర్తిచేసిన వారికి ఫ్రీలాన్స్‌ ఆర్టిస్ట్, సెట్‌ డిజైనర్, కేంద్రీయ విద్యాలయ, నవోదయ, సైనిక్‌స్కూల్‌ తదితర ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో చక్కటి అవకాశాలు ఉన్నాయి.
  • ఫొటోగ్రఫీ కోర్సులు పూర్తిచేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రైవేట్‌ రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కోర్సు అభ్యసించే సమయంలో ఫొటోగ్రఫీలో మెలకువలతోపాటు డిజిటల్‌ ల్యాబ్‌లు, గ్రీన్‌ మ్యాట్‌ స్టూడియోలను ఏర్పాటు చేస్తారు. ఫ్యాషన్‌ ఫొటోగ్రఫీ, ఆటోమొబైల్‌ ఫొటోగ్రఫీ, కార్పొరేట్‌ ఫొటోగ్రఫీ, వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ రంగాల్లోనూ మంచి అవకాశాలున్నాయి.

ముఖ్య తేదీలు

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • దరఖాస్తులకు చివరి తేది: 03.08.2022
  • ఆలస్య రుసంతో దరఖాస్తులకు చివరి తేది: 10.08.2022
  • హాల్‌ టికెట్‌లు డౌన్‌ లోడింగ్‌: 13.08.2022
  • ఏడీసెట్‌ పరీక్ష తేదీ: 20.08.2022
  • పరీక్షా కేంద్రాలు: అనంతపురం, కడప, కర్నూలు, తిరుపతి,నెల్లూరు,రాజమహేంద్రవరం,గుంటూ రు, విజయవాడ, ఒంగోలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు, హైదరాబాద్‌.
  • వెబ్‌సైట్‌: http://www.ysrafu.ac.in/ లేదా https://cets.apsche.ap.gov.in/ADCET

చ‌ద‌వండి: Jobs After 10th & Inter: పది, ఇంటర్‌తోనే... కొలువుల దిశగా!

తెలంగాణలో ఎఫ్‌ఏడీఈఈ ద్వారా ప్రవేశాలు

తెలంగాణలో హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ(జేఎన్‌ఏఎఫ్‌ఏయూ).. ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(ఎఫ్‌ఏడీఈఈ) ద్వారా ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తోంది. బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో.. బీఎఫ్‌ఏ–పెయింటింగ్, బీఎఫ్‌ఏ–స్కల్ప్‌చర్, బీఎఫ్‌ఏ–యానిమేషన్, బీఎఫ్‌ఏ–అప్లయిడ్‌ ఆర్ట్, బీఎఫ్‌ఏ–ఫొటోగ్రఫీ, బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌–ఇంటీరియర్‌ డిజైన్‌ కోర్సులను అందిస్తోంది. ఆయా కోర్సుల కాలవ్యవధి నాలుగేళ్లు. విద్యార్హత: ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. వివరాలకు https://www.jnafau.ac.in/ లేదా https://jnafauadmissions.com చూడొచ్చు.

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగిన కోర్సులు

స్పెషలైజ్డ్‌ కోర్సులతో ఏర్పాటైన డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏడీ సెట్‌)–2022లో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తాం. ఉభయ తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సద్వి నియోగం చేసుకునేలా హైదరాబాద్‌లో సైతం పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. విద్యార్థులు ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. 
–ప్రొఫెసర్‌ ఇ.సి.సురేంద్రనాథ్‌రెడ్డి, కన్వీనర్, ఏడీసెట్‌–2022, రిజిస్ట్రార్, డా.వైఎస్‌ఆర్‌ఏఎఫ్‌యూ, కడప

Published date : 21 Jul 2022 04:07PM

Photo Stories