Skip to main content

Posts at IBPS-RRB: ఐబీపీఎస్‌–ఆర్‌ఆర్‌బీల్లో ఈ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..!

Replacement vacancy announcement  CRP Common Recruitment Process GIII  Group B Office Assistant   Group A Officer  IBPS Apply now  Various posts at Institute of Banking Personnel Selection and Regional Rural Bank

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌).. రీజనల్‌ రూరల్‌ బ్యాంక్‌(ఆర్‌ఆర్‌బీ)ల్లో కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌–గీఐఐఐ(సీఆర్‌పీ) ద్వారా గ్రూప్‌ ఎ–ఆఫీసర్‌(స్కేల్‌–1, 2, 3), గ్రూప్‌ బి–ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీ పర్పస్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»    గ్రామీణ బ్యాంక్‌లు: ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, కర్ణాటక గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, విదర్భ కొంకణ్‌ గ్రామీణ బ్యాంక్‌ తదితరాలు.
»    మొత్తం పోస్టుల సంఖ్య: 9,995.
»    పోస్టుల వివరాలు: ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీపర్పస్‌)–5,585, ఆఫీసర్‌ స్కేల్‌ 1–3499, ఆఫీసర్‌ స్కేల్‌ 2(అగ్రికల్చర్‌ ఆఫీసర్‌)–70, ఆఫీసర్‌ స్కేల్‌ 2(లా)–30, ఆఫీసర్‌ స్కేల్‌ 2(సీఏ)–60, ఆఫీసర్‌ స్కేల్‌ 2(ఐటీ)–94, ఆఫీసర్‌ స్కేల్‌ 2(జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌)–496, ఆఫీసర్‌ స్కేల్‌ 2(మార్కెటింగ్‌ ఆఫీసర్‌)–11, ఆఫీసర్‌ స్కేల్‌ 2(ట్రెజరీ మేనేజర్‌)–21, ఆఫీసర్‌ స్కేల్‌ 3–129.

BSF Direct Recruitment: బీఎస్‌ఎఫ్‌లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు..

»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 01.06.2024 నాటికి ఆఫీసర్‌ స్కేల్‌–1(అసిస్టెంట్‌ మేనేజర్‌) 18 నుంచి 30 ఏళ్లు, ఆఫీసర్‌ స్కేల్‌–2(మేనేజర్‌) 21 నుంచి 32 ఏళ్లు, ఆఫీసర్‌ స్కేల్‌–3(సీనియర్‌ మేనేజర్‌) 21 నుంచి 40 ఏళ్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీపర్పస్‌) 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: పోçస్టును అనుసరించి ప్రిలిమ్స్‌ రాత పరీక్ష, మెయిన్స్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: 07.06.2024 నుంచి 27.06.2024 వరకు.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు చెల్లింపు తేదీలు: 07.06.2024 నుంచి 27.06.2024 వరకు.
»    ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష కాల్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌: జూలై/ఆగస్ట్‌ 2024.
»    ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష తేది: ఆగస్ట్, 2024.
»    ఆన్‌లైన్‌ మెయిన్స్‌/సింగిల్‌ పరీక్ష తేది: సెప్టెంబర్‌/అక్టోబర్‌ 2024.
»    ఇంటర్వ్యూ తేదీలు(ఆఫీసర్స్‌ స్కేల్‌ 1, 2, 3): నవంబర్, 2024.
»    ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌: జనవరి, 2025.
»    వెబ్‌సైట్‌: https://www.ibps.in

SBI Recruitment: ఎస్‌బీఐలో రెగ్యులర్‌ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ పోస్టులు..

Published date : 12 Jun 2024 03:42PM

Photo Stories