Skip to main content

SBI PO Results 2023 : పీవో మెయిన్స్‌ ఫలితాలు విడుదల.. మొత్తం ఎంత మంది పాస్ అయ్యారంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శాఖల్లో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ల భర్తీ కోసం నిర్వహించిన మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు మార్చి 10వ తేదీన (శుక్ర‌వారం) విడుద‌ల‌ చేశారు.
sbi po results
sbi po results 2023

ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి  జనవరి 30న మెయిన్స్‌ పరీక్షను నిర్వహించారు . ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల జాబితాను ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. 

చ‌ద‌వండి: Competitive Exams: సివిల్స్, బ్యాంక్స్.. ఇలా.. ప‌రీక్షలు ఏవైనా.. జనరల్‌ స్టడీస్‌లో రాణిస్తేనే విజయం..

Exams: ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌..13 ప్రాంతీయ భాషల్లో పరీక్షలు!

ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలకు..
ఫేజ్ 3లో భాగంగా నిర్వహించే సైకోమెట్రిక్ పరీక్షకు షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల వివరాలను సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్ అండ్‌ ప్రొమోషన్‌ విభాగం ప్రకటించింది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులు గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలకు ప్రిపేర్‌ కావాల్సి ఉంటుంది. గతేడాది సెప్టెంబర్‌లో ఎస్‌బీఐ ఈ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. 

Banks Study Material

Banks Exam Previous Papers

మొత్తం మూడు దశల్లో ఎంపిక..
మొత్తం 1673 పోస్టుల్లో 1600 రెగ్యులర్‌ కాగా.. 73 బ్యాక్‌లాగ్‌ ఖాళీలు. డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులను  మొత్తం మూడు దశల్లో ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్‌ పరీక్ష పూర్తి చేసిన అధికారులు.. మూడో దశలో నిర్వహించేందుకు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఫలితాలను ఈ కింది పీడీఎఫ్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

Bank Exam Preparation Tips: అవుతారా.. బ్యాంక్‌ పీవో!

SBI పీవో మెయిన్స్‌ ఫలితాల పూర్తి వివ‌రాలు ఇవే..
 

Published date : 10 Mar 2023 07:54PM
PDF

Photo Stories