Skip to main content

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో సీనియర్ మేనేజర్ పోస్టులు.. ఎంపికైతే జీతం ఎంత ఉంటుందంటే..

బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంఎస్‌ఎంఈ విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన కింది ఖాళీల భ‌ర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
250 Vacancies in Bank of Baroda

సీనియర్ మేనేజర్-ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్‌ (ఎంఎంజీ/ఎస్‌-III)లో 250 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా బ్యాంక్ ఆఫ్ బరోడా కార్యాలయాలు, శాఖల్లో పని ప్రదేశం ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు రూ.100 ఉంటుంది.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ, ఎంబీఏ(మార్కెటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  
వయసు: 01-12-2023 నాటికి 28 నుంచి 37 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.63,840 నుంచి రూ.78,230 వ‌రకు ఉంటుంది.
ఎంపిక విధానం : ఆన్‌లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష, ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26-12-2023.

Railway Jobs: రాత పరీక్ష లేకుండానే రైల్వేలో కొన్ని వేల ఉద్యోగాలు.. ఉండాల్సిన అర్హ‌త‌లివే..

Published date : 08 Dec 2023 08:15AM
PDF

Photo Stories