Bank of Baroda Recruitment: బీఓబీలో స్పెషలిస్ట్ ఐటీ ఆఫీసర్ పోస్టులు.. పరీక్షా విధానం ఇలా..
ముంబయి ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వరంగ బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ).. స్పెషలిస్ట్ ఐటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 52 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో రెగ్యులర్ పోస్టులతోపాటు ఒప్పంద ప్రాతిపదికన నియామకం జరిపే పోస్టులు సైతం ఉన్నాయి. డిసెంబర్ 28వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
- మొత్తం పోస్టుల సంఖ్య: 52(రెగ్యులర్ పోస్టులు–40, ఒప్పంద ఖాళీలు–12)
విభాగాల వారీగా పోస్టులు
- రెగ్యులర్ పోస్టులు: క్వాలిటీ అష్యూరెన్స్ లీడ్–2, క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్లు–12, డెవలపర్(ఫుల్‌స్టాక్ జావా, మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్)–24, యూఐ/యూఎక్స్ డిజైనర్–02.
- కాంట్రాక్ట్: క్లౌడ్ ఇంజనీర్–02, అప్లికేషన్ ఆర్కిటెక్ట్–02, ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్ట్–02, టెక్నాలజీ ఆర్కిటెక్ట్–02, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్–02, ఇంటిగ్రేషన్ ఎక్స్‌పర్ట్–02.
విద్యార్హతలు
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్ మినహ మిగతా అన్ని పోస్టులకు కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్‌కు మాత్రం కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ/బీటెక్‌తోపాటు ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ కోర్సులైన ఓఎస్(యూనిక్స్/లినిక్స్), మిడిల్‌వేర్, స్టోరేజ్, లోడ్‌బ్యాలెన్సర్ వంటివి పూర్తిచేసి ఉండాలి.
- అనుభవం: ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో కనీసం ఒక ఏడాది నుంచి పదేళ్ల వరకూ పని అనుభవం ఉండాలి.
- వయసు: ఆయా పోస్టులను అనుసరించి 23–45 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లవరకు వయోసడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం
- ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్/ఇతర టెస్ట్‌లు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి తొలుత ముంబయి/హైదరాబాద్‌ల్లో పోస్టింగ్ ఇస్తారు. అయితే బ్యాంక్ అవసరాలకు తగ్గట్టు దేశంలో ఎక్కడికైనా బదిలే చేసే అవకాశం ఉంటుంది.
చదవండి: Banks - Guidance
పరీక్ష విధానం
- ఆన్‌లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్– సీబీటీ) విధానంలో నిర్వహించే ఈ పరీక్ష మొత్తం 225 మార్కులకు ఉంటుంది. నాలుగు సెక్షన్‌ల నుంచి 150 ప్రశ్నలకు గాను 225 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- రీజనింగ్ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు–25 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 25 ప్రశ్నలు–25 మార్కులు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 75 ప్రశ్నలు–150 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
- పరీక్ష సమయం 150 నిమిషాలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీల్లో ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 శాతం మార్కులను తగ్గిస్తారు.
- ప్రతి విభాగంలో జనరల్ అభ్యర్థులకు కనీసం 40 శాతం మార్కులు, రిజర్వేషన్ వర్గాలకు కనీసం 35 శాతం మార్కులను అర్హత మార్కులుగా పేర్కొన్నారు.
ఎస్‌ఓ వేతనాలు
- జేఎమ్‌జీ/స్కేల్–1 స్థాయి వారికి రూ.36,000–63,840, ఎమ్‌ఎమ్‌జీ/స్కేల్–2 స్థాయి వారికి రూ.48,170 – 69,180, ఎమ్‌ఎమ్‌జీ/స్కేల్–3 వారు రూ.63,840–78,230 వరకు వేతనం అందుతుంది.
ముఖ్యమైన సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: 28.12.2021
- పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం
- వెబ్‌సైట్: https://www.bankofbaroda.in
చదవండి: SBI Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1226 పోస్టులు.. పరీక్షా విధానం ఇలా..