Skip to main content

Madhavi Latha, IAS : ఎలాంటి కోచింగ్ లేకుండానే తొలి ప్రయత్నంలోనే..గ్రూప్‌–1 టాపర్‌గా నిలిచానిలా..

సైంటిస్టుగా ఉద్యోగంలో చేరి, గ్రూప్‌–1 అధికారిగా ఎంపికై, అంచెలంచెలుగా ఐఏఎస్‌కు ఎదిగిన కె.మాధవీలత విజయ ప్రస్థానం ఆమె మాటల్లోనే ఇలా...
Dr.K. Madhavi Latha, IAS
Dr.K. Madhavi Latha, IAS

ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి నెలలు, సంవత్సరాల తరబడి కోచింగ్‌ తీసుకుంటారు. రెండు మూడు పర్యాయాలు ప్రయత్నిస్తే గాని ఎంపిక కాలేరు. కానీ ఆమె మాత్రం ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదు. పైగా తొలి ప్రయత్నంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ టాపర్‌ (మహిళా విభాగంలో)గా నిలిచి గ్రూప్‌–1కు సెలెక్టయ్యారు. సైంటిస్టుగా ఉద్యోగంలో చేరి, గ్రూప్‌–1 అధికారిగా ఎంపికై, అంచెలంచెలుగా ఐఏఎస్‌కు స్థాయికి చేరిన‌ కె.మాధవీలత విజయ ప్రస్థానం ఆమె మాటల్లోనే..

కుటుంబ నేప‌థ్యం : 
వైఎస్సార్‌ జిల్లా ఒంటిమిట్ట సమీపంలోని మలకాటపల్లెకు చెందిన కేవీ కృష్ణారెడ్డి, రామలక్ష్మమ్మ దంపతులకు తొలి సంతానం మాధవీలత. నాన్న మా నాన్న కృష్ణారెడ్డి రిటైర్డ్‌ బ్యాంకు మేనేజర్‌. అమ్మ రామలక్ష్మి గృహిణి. అమ్మా, నాన్నలకు ముగ్గురూ ఆడపిల్లలమే. నేను పెద్దదాన్ని. పెద్ద చెల్లెలు రాధిక అమెరికా స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జన్‌. చిన్న చెల్లెలు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. 

ఎడ్యుకేష‌న్‌..
నా ప్రాథమిక విద్య కడపలో, ఇంటర్మీడియట్‌ మహబూబ్‌నగర్‌లో చదివాను. అనంతరం ఎంసెట్‌ ద్వారా వ్యవసాయ విద్యలో సీటు సంపాదించాను. తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చర్‌ కళాశాలలో వ్యవసాయ విద్యలో డిగ్రీ, పీజీ పూర్తి చేశాను. ఆపై కంది పంటపై పరిశోధన పూర్తి చేసి, డాక్టరేట్‌ పొందారు. ఆమె చేసిన పరిశోధనల కారణంగా ప్రముఖ ఇక్రిశాట్‌ సంస్థలో శాస్త్రవేత్తగా అవకాశం కల్పించింది.

నాలుగు గోల్డ్‌మెడల్స్ సాధించానిలా..
చిన్నప్పట్నుంచి అమ్మానాన్నలు బాగా చదువుకోవాలని, ప్రయోజకురాలివి కావాలని చెప్పేవారు. వారి మాటలు నాలో పట్టుదలను పెంచాయి. నేను అగ్రికల్చర్‌లో పీహెచ్‌డీ చేశాను. కందులపై ప్రపంచంలోనే తొలిసారిగా పరిశోధనలు చేసి నాలుగు గోల్డ్‌మెడల్స్‌ సాధించాను. ఇక్రిసాట్‌లో సైంటిస్టుగా చేరాను. 

భ‌ర్త ప్రొత్సాహాం..

Family


మా వారు పి.రామమునిరెడ్డి ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సైంటిస్టు (ప్రస్తుతం పంచాయతీరాజ్‌లో వాటర్‌షెడ్స్‌ డైరెక్టర్‌). నువ్వు ప్రతిభావంతురాలివి. గ్రూప్‌–1కు ప్రిపేర్‌ అయితే బాగుంటుంది కదా? అని నా భర్త సూచించారు. అందుకు అంగీకరించి గ్రూప్‌–1కి ప్రిపేరయ్యాను. దీనికి అవసరమైన స్టడీ మెటీరియల్‌ను అంతా ఆయనే సమకూర్చారు. 

తొలి ప్రయత్నంలోనే..స్టేట్‌ ఫస్ట్ : 
రోజుకు 12 గంటలు కష్టపడి చదివి పరీక్ష రాశాను. తొలి ప్రయత్నంలోనే (2007లో) మహిళా విభాగంలో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధించాను. తొలుత డిప్యూటి కలెక్టర్‌గా, ఆ తర్వాత నంద్యాల, నెల్లూరు ఆర్డీవోగా, తిరుపతి 'తుడా' కార్యదర్శిగాను పనిచేశాను. నేను ఉద్యోగంలో చేరకముందు ఎప్పుడూ ఐఏఎస్‌ కావాలనుకోలేదు.. ఆ దిశగా ప్రయత్నమూ చేయలేదు. గ్రూప్‌–1 అధికారి నుంచి 2014లో ఐఏఎస్‌ అయ్యాను. లేదంటే నేను శాస్త్రవేత్తగా నా పరిశోధనలు కొనసాగించేదాన్ని.

ఐఏఎస్‌గా..

Madhavi IAS


జాయింట్‌ కలెక్టర్‌గా నా తొలి పోస్టింగ్‌ కృష్ణా జిల్లాలోనే. గత ఏడాది జూన్‌లో ఇక్కడ చేరాను. సైంటిస్ట్‌గా కొనసాగలేదన్న ఫీలింగ్‌ లేదు. ఎందుకంటే ఐఏఎస్‌గా నాకు ఎంతో సంతృప్తి ఉంది. ప్రజలకు నిత్యం సేవ చేసే అవకాశం దక్కిందన్న ఆనందం ఉంది. పురుషుడి విజయం వెనక మహిళ ఉంటుందంటారు. కానీ నా విజయం వెనక ' మా ఆయన' ఉన్నారు. నాలో ఉన్న ప్రతిభను ప్రోత్సహించారు. ఆయన ఆశలకనుగుణంగానే గ్రూప్‌–1కు ఎంపికయ్యాను. క్రమంగా ఐఏఎస్‌గా పదోన్నతి పొందాను.

పిల్ల‌లు..
మాకు ఇద్దరు పిల్లలు. బాబు కౌషిక్‌రెడ్డి ఇంటర్, పాప హర్షిత ఏడో తరగతి చదువుతున్నారు.

మరింత సేవచేసే అవకాశం
వ్యవసాయ విద్య ద్వారా రైతుకు అండగా నిలిచి సేవ చేయాలను కున్నా. గ్రూప్‌ వన్‌ రాయడంతో రాష్ట్ర మొదటి ర్యాంక్‌ వచ్చింది. దీంతో వ్యవసాయ రంగాన్ని వదులుకుని అడ్మినిష్ట్రేషన్‌ రంగంలోకి వచ్చాను. అయితే ఈ రంగం ద్వారా రైతులకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు మరింగా సేవ చేయవచ్చు. ఐఏఎస్‌గా మరింతగా ప్రజలకు దగ్గరై మెరుగైన సేవ‌లందించే అవకాశం లభించింది.    

                                                                                            – డాక్టర్‌ కె. మాధవీలత, ఐఏఎస్‌

DSP Snehitha : గ్రూప్‌–1కు సెలక్టయ్యానిలా...ముగ్గురం ఆడపిల్లలమే..అయినా

Y.Obulesh, Group 1 Ranker : ప్ర‌భుత్వ స్కూల్‌లో చ‌దివా...ప్ర‌భుత్వ ఉద్యోగం కొట్టానిలా..

గ్రూప్‌–1 కిరీటం.. రాష్ట్రస్థాయిలో ఫ‌స్ట్ ర్యాంక్‌.. ఆర్‌టీఓగా ఉద్యోగం

Group-2 Job:మొదటి ప్రయత్నంలోనే విజయం..గ్రూపు–2లో ఉద్యోగం..ఎలా అంటే..

గ్రూప్‌–1 కిరీటం.. రాష్ట్రస్థాయిలో ఫ‌స్ట్ ర్యాంక్‌.. ఆర్‌టీఓగా ఉద్యోగం

గ్రూప్‌–1 లో విజ‌యం సాధించానిలా..: హరిత, ఆర్డీఓ

Group 1 Ranker: ఆన్‌లైన్‌ కోచింగ్‌..గ్రూప్‌–1 ఉద్యోగం

Published date : 20 Dec 2021 01:44PM

Photo Stories