APPSC: జేఏ పోస్టుల స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదల
Sakshi Education
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను Andhra Pradesh Public Service Commission (APPSC) అక్టోబర్ 12న వెల్లడించింది.
జేఏ పోస్టుల స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదల
670 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా 2,11,341 మంది స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరయ్యారు. మెయిన్ పరీక్షలకు 11,574 మంది ఎంపికయ్యారు.
ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ https://psc.ap.gov.inలో పొందుపరిచారు. స్క్రీనింగ్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారికి మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తారు.