APPSC Group 4 Exams for 730 Posts: సిలబస్ + సమకాలీనంతో... సక్సెస్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).. 730 పోస్ట్‌లతో ప్రకటించిన.. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (రెవెన్యూ డిపార్ట్‌మెంట్), ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3(ఎండోమెంట్ సబ్ సర్వీస్)పోస్ట్‌లకు ప్రిపరేషన్ ముమ్మరం చేయాల్సిన సమయం ఆసన్నమైంది! ఈ రెండు పోస్ట్‌లకు సంబంధించిన తొలిదశ స్క్రీనింగ్ టెస్ట్ తేదీలను ఏపీపీఎస్సీ తాజాగా ప్రకటించింది!! ఈఓ–గ్రేడ్–3 స్క్రీనింగ్ టెస్ట్ జూలై 24న; జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ స్క్రీనింగ్ టెస్ట్‌ను జూలై 31న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో స్క్రీనింగ్ టెస్ట్‌లో విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్..
- జూలై 24న ఈఓ(ఎండోమెంట్స్), జూలై 31 జూనియర్ అసిస్టెంట్(రెవెన్యూ) పరీక్షలు
- సిలబస్, సమకాలీన అంశాల సమ్మేళనంతోనే విజయం
- అభ్యర్థులు ప్రిపరేషన్ ముమ్మరం చేయాల్సిన ఆవశ్యకత
ప్రభుత్వ ఉద్యోగం అంటేనే వేల సంఖ్యలో పోటీ. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు తొలి దశలోనే తమ సత్తా చాటితే.. మలి దశలో విజయం సాధించడం తేలికవుతుంది. కాబట్టి ఏపీపీఎస్సీ ప్రకటించిన జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, ఎండోమెంట్స్ ఈఓ–గ్రేడ్–3 తొలిదశ స్క్రీనింగ్ టెస్ట్‌లో విజయం, మెరిట్ లిస్ట్‌లో చోటు సాధించడమే లక్ష్యంగా కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
APPSC Group-1 & 2 Posts: ఆగస్టులో గ్రూప్–1 & 2 నోటిఫికేషన్లు.. మొత్తం ఎన్ని పోస్టులకు అంటే..?
స్క్రీనింగ్ టెస్ట్
ఏపీ రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ 670 పోస్ట్‌లు, దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3.. 60 పోస్ట్‌లతో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక్కో పోస్ట్‌కు 200 దరఖాస్తులు దాటితే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని నోటిఫికేషన్ సమయంలోనే పేర్కొంది. ఈ పోస్ట్‌లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. దీంతో స్క్రీనింగ్ టెస్ట్ అనివార్యంగా మారింది. ఈ స్క్రీనింగ్ టెస్ట్‌లను జూలై 24, జూలై 31 తేదీల్లో నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటించింది. స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు 50 మంది చొప్పున(1:50 నిష్పత్తిలో) ఎంపిక చేసి.. మలి దశలో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్‌లో సాధించిన మార్కులు, కటాఫ్, ఇతర రిజర్వేషన్ నిబంధనలను అనుసరించి తుదిగా ఎంపిక జరుగుతుంది.
సిలబస్ సమన్వయం
రెండు శాఖల్లోని పోస్ట్‌లకు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్‌లో పేర్కొన్న సబ్జెక్ట్‌లనే మలిదశలో మెయిన్ ఎగ్జామినేషన్ సిలబస్ అంశాలుగా పేర్కొన్నారు. కాబట్టి అభ్యర్థులు మొదటి నుంచే మెయిన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ సాగిస్తే.. స్క్రీనింగ్ టెస్ట్‌లో సులభంగా విజయం సాధించొచ్చు. స్క్రీనింగ్, మెయిన్ పరీక్షలకు ఒకే సిలబస్ అంశాలను నిర్దేశించినా.. మెయిన్‌లో ప్రశ్నలు లోతైన అవగాహన పరీక్షించేలా ఉంటాయి. ప్రస్తుత సమయంలో పూర్తిగా స్క్రీనింగ్ టెస్ట్‌లో విజయానికే సమయం కేటాయించాలి.
APPSC 730 Posts Notification : ఏం చదవాలి.. ఎలా చదవాలి..?
ఎండోమెంట్ ఈఓ ప్రత్యేకంగా
ఎండోమెంట్ ఈఓ గ్రేడ్–3 పోస్ట్‌ల అభ్యర్థులు మరింత ప్రత్యేక దృష్టితో ప్రిపరేషన్ సాగించాలి. ముఖ్యంగా ఈ పోస్ట్‌లకు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ పరీక్షలో ఉన్న హైందవత్వం, దేవాలయ వ్యవస్థ పేపర్‌కు సంబంధించి ప్రత్యేకంగా చదవాలి. పురాణాలు, ఇతిహాసాలు, వేద సంస్కృతి, కళలు,ఉపనిషత్తులు,కుటుంబ వ్యవస్థ, దేవాలయాలకు ఆదాయ మార్గాలు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విధులు,ఎండోమెంట్ భూములకు సంబంధించిన చట్టా లు, భూ రికార్డులపై అవగాహన పెంచుకోవాలి.
జనరల్ స్టడీస్‌కు ఇలా
- రెండు పోస్ట్‌లకు సంబంధించి.. మొదటి పేపర్‌గా ఉన్న జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ విషయంలో.. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్య అంశాలు; భారత, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆర్థికాభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, పునర్విభజన సమస్యల గురించి అధ్యయనం చేయాలి.
- అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, లక్షిత వర్గాలు, లబ్ధిదారులు, బడ్జెట్ కేటాయింపుల గురించి తెలుసుకోవాలి.
- మెంటల్ ఎబిలిటీ విభాగంలో రాణించేందుకు టాబ్యులేషన్, డేటా సమీకరణ, డేటా విశ్లేషణలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
- రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్ట్‌లకు పేర్కొన్న జనరల్ ఇంగ్లిష్, జనరల్ తెలుగు పేపర్ కోసం ఈ రెండు భాషలకు సంబంధించి బేసిక్ గ్రామర్ అంశాలు, యాంటానిమ్స్, సినానిమ్స్, ఫ్రేజెస్‌లపై పట్టు సాధించాలి.
- రెండు పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. కామన్ పేపర్‌గా ఉన్న జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పేపర్‌కు ఉమ్మడి ప్రిపరేషన్ సాగిస్తూనే.. వేర్వేరు సబ్జెక్ట్‌లలో జరగనున్న రెండో పేపర్‌కు ప్రత్యేక సమయం కేటాయించుకుని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
APPSC&TSPSC: గ్రూప్స్‌కు సొంతంగా నోట్స్ రాసుకుని.. గుర్తు పెట్టుకోవడం ఎలా..?
ప్రతి రోజు చదివేలా
ప్రస్తుత సమయంలో అభ్యర్థులు ప్రతి పేపర్‌లోని సిలబస్ అంశాలను ప్రతి రోజు చదివేలా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి. ఒక టాపిక్ పూర్తవగానే దానికి సంబంధించి ముఖ్యాంశాలతో నోట్స్ రాసుకోవాలి. ఫలితంగా పరీక్షకు వారం రోజుల ముందు పునశ్చరణకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
మాక్ టెస్ట్‌లు.. ప్రాక్టీస్
- అభ్యర్థులు ప్రస్తుత సమయంలో మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లు రాయాలి. ప్రతి పేపర్‌కు సంబంధించి కనీసం అయిదు మాక్ లేదా మోడల్ టెస్ట్‌లకు హాజరవడం ద్వారా తమ సామర్థ్యాలపై, సబ్జెక్ట్ నైపుణ్యంపై అవగాహన పెంచుకోవచ్చు.
- అభ్యర్థులు ప్రాక్టీస్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా మెంటల్ ఎబిలిటీ విషయంలో డేటా విశ్లేషణ, ఫ్లో చార్ట్స్‌కు సంబంధించి ఈ ప్రాక్టీస్ వ్యూహాన్ని కచ్చితంగా పాటించాలి. జనరల్ ఇంగ్లిష్, తెలుగు సబ్జెక్ట్‌లకు సంబంధించి ట్రాన్స్‌లేషన్, ప్యాసేజ్ రైటింగ్, లెటర్ రైటింగ్ వంటి అంశాలపై ప్రాక్టీస్ చేయడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
- ఇలా ప్రతి దశలోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే.. అందుబాటులో ఉన్న సమయంలో స్క్రీనింగ్ టెస్ట్‌లో విజయావకాశాలను పెంచుకోవచ్చు..
APPSC Groups Practice Tests
రాత పరీక్ష దశలు
- జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (రెవెన్యూ శాఖ) (గ్రూప్–4 సర్వీసెస్)లో 670 పోస్ట్‌లు
- ఏపీ ఎండోమెంట్ సబ్ సర్వీస్‌లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3 హోదాలో 60 పోస్ట్‌లు
- మొత్తం రెండు దశల్లో రాత పరీక్ష నిర్వహిస్తారు.
- మొదటి దశలో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది.
- స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి.. వారికి మలి దశలో మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.