Skip to main content

APPSC Group 1: సివిల్స్‌లో విజయమే లక్ష్యం: జయశ్రీ

Jayashree: Victory in Civil is the goal

రాజంపేట రూరల్‌: సివిల్స్‌ రాసి ఐఏఎస్‌ కావడమే తన లక్ష్యమని గ్రూప్‌ 1 విజేత పోతుగుంట జయశ్రీ అన్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్‌ 1 ఫలితాల్లో ఎంపీడీఓగా ఎంపికయ్యారు. పట్టణ పరిధిలోని ఎగువ బసినాయుడుగారిపల్లికి చెందిన పోతుగుంట నాగేశ్వరనాయుడు, నాగలక్ష్మిల ఏకైక కుమార్తె జయశ్రీ. ఈమె 1నుంచి10వ తరగతి వరకు రాజు హైస్కూల్‌లో, ఇంటర్‌ హైదరాబాదులోని శ్రీచైతన్య ఐఏఎస్‌ అకాడమిలో, డిగ్రీ ఢిల్లీలోని శ్రీరామ్‌ కాలేజీలో, ఎంఏ హైదరాబాదులోని సెంట్రల్‌ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. మొదటి పర్యాయం గ్రూప్‌–1 పరీక్షలు రాసినట్లు శుక్రవారం ఇక్కడి విలేకర్లకు తెలియజేశారు. ఐఏఎస్‌ కావటం తన ఆశయం అని ఆమె వెల్లడించారు. జయశ్రీ ఎంపీడీఓగా ఎంపిక కావడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు హర్షం వ్యక్తం చేశారు.

డీటీ నుంచి గ్రూప్‌ 1 ఆఫీసర్‌గా!
సిద్దవటం: మండలంలోని బొగ్గిడివారిపల్లె గ్రామానికి చెందిన గజ్జల సురేంద్రారెడ్డి గ్రూప్‌–1 పాసై వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమీషనర్‌గా ఎంపికయ్యారు. ఈయన ఎమ్మె స్సీ పూర్తి చేసి 2018లో గ్రూప్‌–2 విభాగంలో డిప్యూటీ తహసీల్దారుగా ఎంపికయ్యారు. తా జాగా గ్రూప్‌–1 ఫలితాల్లో వాణిజ్య పన్నుల శా ఖ సహాయ కమీషనర్‌గా ఎంపిక కావంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

చదవండి: APPSC Group 1: గ్రూప్ 1లో స‌త్తాచాటిన ప్ర‌కాశం జిల్లా అమ్మాయిలు

అసిస్టెంట్‌ ట్రెజరీ అధికారిగా హరిత
రాయచోటి: గ్రూప్‌–1 ఫలితాల్లో రాయచోటికి చెందిన రామాపురం హరిత అసిస్టెంట్‌ ట్రెజరీ అధికారిగా ఎంపికయ్యారు. పట్టణంలో నివాసముంటున్న టీచర్‌ జయరామరాజు, భారతిల కుమార్తె హరిత. ఈమె టెన్త్‌ వరకు పట్టణంలోని రాజుస్కూల్‌లో విద్యాభ్యాసం చేసింది. సచివాలయ సెక్రెటరీగా ఎంపికై ఏడాది పాటు ఆమె ఉద్యోగం చేసింది. ప్రస్తుతం గ్రూప్‌–1లో విజయం సాధించింది. సివిల్స్‌లో రాణించడమే తన లక్ష్యమంటోంది. హరితకు తోటి మిత్రులు, బంధువులు, స్థానికులు అభినందనలు తెలిపారు.

వ్యవసాయ కుటుంబంలో మెరిసిన పవిత్ర
మదనపల్లె సిటీ: అన్న ప్రోత్సాహంతో తాను గ్రూప్‌–1 ఫలితాల్లో ప్రతిభ చాటినట్లు మదనపల్లె పట్టణం ప్రశాంత్‌నగర్‌కు చెందిన మాకినేని పవిత్ర తెలిపారు. గ్రూప్‌–1 ఫలితాల్లో అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ (ఏటిఓ)గా ఎంపికయ్యారు. తండ్రి ప్రభాకర్‌నాయుడు వ్యవసాయం చేస్తున్నాడు. తల్లి లక్ష్మిదేవి గృహిణి. అన్న పురుషోత్తం సూచన మేరకు ఆన్‌లైన్‌లో ప్రిపేరై మొదటి ప్రయత్నంలోనే విజేతగా నిలిచింది. పదో తరగతి స్థానిక జ్ఞానోదయ పాఠశాల, ఇంటర్మీడియట్‌ సిద్దార్థ కాలేజీ, బిటెక్‌ మిట్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఈసీఈ చేసింది. కలెక్టర్‌ కావాలన్నదే తన ధ్యేయమని పవిత్ర తెలిపింది.

చదవండి: APPSC Group 1: గ్రూప్ 1లో ర్యాంకు సాధించిన కూలీ బిడ్డ మడక కృష్ణమూర్తి

Published date : 19 Aug 2023 05:09PM

Photo Stories