APPSC Group 1: గ్రూప్ 1లో ర్యాంకు సాధించిన కూలీ బిడ్డ మడక కృష్ణమూర్తి
రామభద్రపురం: రామభద్రపురం మండలంలోని బూసాయవలస గ్రామానికి చెందిన మడక కృష్ణమూర్తి గ్రూప్–1 ఫలితాల్లో ప్రతిభ చూపి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యా రు. ఆయన ప్రస్తుతం విశాఖపట్టణంలో గ్రేహౌండ్స్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. తండ్రి రామారా వు వ్యవసాయ కూలీకాగా, తల్లి గృహిణి. 1 నుంచి 10వ తరగతి వరకు బొబ్బిలి మండలం రంగరాయపురంలో ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఇంటర్మీడియట్ విద్యను బొబ్బిలి సత్యసాయి జూనియర్ కళాఽశాలలోను, బీటెక్, ఎంటెక్ విద్యను విజయనగరం ఎంవీజీఆర్‌లో పూర్తిచేశారు. కొడుకు విజయంపై తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు.
ఇవీ చదవండి: APPSC Group 1లో బొగ్గరం యువకుడి సత్తా
ఇవీ చదవండి: APPSC Group 1 Second Ranker 2023 Pavani Success Story
ఇవీ చదవండి: APPSC Group-1 First Ranker Bhanusri Lakshmi Success Story
ఇవీ చదవండి: APPSC Group 1: స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా భార్గవ్