APPSC Group 1: గ్రూప్–1లో బొగ్గరం యువకుడి సత్తా
ఈపూరు: పేదరికం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించాడు బొగ్గరం యువకుడు. గ్రూప్–1 పరీక్ష ఫలితాల్లో సత్తాచాటాడు. పల్నాడు జిల్లాలోని ఈపూరు మండలం బొగ్గరం గ్రామానికి చెందిన కోటా సుబ్బారావు–నాగమల్లేశ్వరీ దంపతుల రెండో కొడుకు కోటా నాగ సతీష్ గ్రూప్–1కు ఎంపికయ్యాడు. తండ్రి కోట సుబ్బారావు గ్రామంలో చిన్నపాటి చిల్లర దుకాణం నిర్వహిస్తుంటారు. ఇద్దరు కుమారులను తన రెక్కల కష్టంతో చదివించారు. ప్రాథమిక దశ నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించిన సతీష్ ఇంటర్ నుంచి ప్రైవేటు కళాశాలల్లో చదివాడు. బీకాం పూర్తిచేసిన తర్వాత హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ లక్ష్మణారావు ఇనిస్టిట్యూట్‌లో నాలుగేళ్లు గ్రూప్–1కు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఈసందర్భంగా నాగసతీష్ మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, తనకు విద్య నేర్పిన ఉపాధ్యాయుల సహకారంతో తాను ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నాడు. తాను గ్రూప్–1లో ఆదాయ పన్ను విభాగ అధికారి పోస్టును ఎంచుకున్నట్టు వివరించాడు.
ఇవీ చదవండి: APPSC Group 1 Second Ranker 2023 Pavani Success Story
ఇవీ చదవండి: APPSC Group-1 First Ranker Bhanusri Lakshmi Success Story