Skip to main content

2021 జాబ్‌ క్యాలెండర్‌ విడుదల: ఈ ఏడాది భర్తీ చేయనున్న ప్రభుత్వ కొలువులివే...

సాక్షి, అమరావతి : దేశంలో ఎక్కడా, ఎవరూ చేపట్టని రీతిలో గత రెండేళ్లలో 6,03,756 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. తాజాగా 10,143 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, నిరుద్యోగ యువత ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ను శుక్రవారం (నేడు) ఆయన విడుదల చేయనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్న సీఎం.. నిరుద్యోగులకు అండగా ఉండేలా మరిన్ని ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుడుతున్నారు. 2021–22లో భర్తీకి నిర్ణయించిన పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చే నెల నుంచే విడుదల కానున్నాయి. విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. ఏపీపీఎస్సీ, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, డీఎస్సీ తదితర నియామక సంస్థల ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. అత్యంత పారదర్శకంగా, అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్‌ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయనుంది.

అత్యంత పారదర్శకంగా భర్తీకి ఏర్పాట్లు
ప్రభుత్వ పోస్టులను ఎలాంటి అవినీతి, అక్రమాలకు, లంచాలకు తావు లేకుండా అత్యంత పారదర్శక విధానంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందులో బాగంగా విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. గ్రూప్‌–1, గ్రూప్‌–2తో సహా అన్ని ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలను రద్దు చేయాలని నిర్ణయించారు. రాత పరీక్షల్లో అభ్యర్థులు సాధించే మెరిట్‌ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పరీక్షల నిర్వహణకు ఐఐటీ, ఐఐఎంల సహకారంతో విప్లవాత్మక విధానాన్ని రూపొందించనున్నారు.

పోస్టుల భర్తీలో కొత్త చరిత్ర
దేశ చరిత్రలో ఎక్కడా, ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 నుంచి ఇప్పటి వరకు 6,03,756 పోస్టులు భర్తీ చేశారు. ఇందులో రెగ్యులర్‌ పోస్టులు 1,84,264, కాంట్రాక్టు పోస్టులు 19,701, అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులు 3,99,791 ఉన్నాయి. కేవలం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఇన్ని పోస్టులు భర్తీ చేయించిన ఘనత వైఎస్‌ జగన్‌దే. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టి ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు.

2019 నుంచి ఇప్పటి వరకు భర్తీ చేసిన ఉద్యోగాలు

శాఖ

పోస్టులు

గ్రామ, వార్డుల వలంటీర్లు (గౌరవ వేతనం):

2,59,565

గ్రామ, వార్డు సచివాలయాల అసిస్టెంట్లు:

1,21,518

వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమం:

13,987

ఆర్‌ అండ్‌ బీ, ఆర్టీసీ ఉద్యోగులు:

58,388

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు (ఆప్కాస్‌):

95,212

ఏపీపీఎస్సీ:

2,497

పశుసంవర్ధక, మత్స్య శాఖలు:

372

వ్యవసాయ, సహకార శాఖలు:

175

ఆహార, పౌర సరఫరాల శాఖ:

237

పాఠశాల విద్య:

4,758

ఉన్నత విద్య:

1,054

గిరిజన సంక్షేమం:

1,175

సాంఘిక సంక్షేమం:

669

మహిళా, శిశు అభివృద్ధి, వయోజన శాఖ:

3,500

నైపుణ్యాభివృద్ధి:

1,283

విద్యుత్‌ శాఖ:

8,333

జల వనరుల శాఖ:

177

ఇతర శాఖలు:

4,531

కోవిడ్‌ సమయంలో అత్యవసర సేవలకునియమితులైన
తాత్కాలిక సిబ్బంది:

26,325

మొత్తం:

6,03,756



భర్తీ చేయనున్న పోస్టులు

కేటగిరీ

పోస్టుల సంఖ్య

నోటిఫికేషన్‌

ఎస్సీ, ఎస్టీ, డీఏ బ్యాక్‌లాగ్‌ పోస్టులు

1,238

జూలై 2021

ఏపీపీఎస్సీ గ్రూప్‌–1, గ్రూప్‌–2

36

ఆగస్టు 2021

పోలీసు

450

సెప్టెంబర్‌ 2021

డాక్టర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు (వైద్య శాఖ)

451

అక్టోబర్‌ 2021

పారామెడికల్, ఫార్మాసిస్టు, టెక్నీషియన్లు

5,251

నవంబర్‌ 2021

నర్సులు

441

డిసెంబర్‌ 2021

డిగ్రీ కాలేజీ లెక్చరర్లు

240

జనవరి 2022

వర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

2,000

ఫిబ్రవరి 2022

ఇతర శాఖల పోస్టులు

36

మార్చి 2022

మొత్తం

10,143

 

Published date : 18 Jun 2021 01:35PM

Photo Stories