AP TET 2021 Telugu Practice Test-3
1. కింది అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
బ్రతికే ప్రతి జీవిలోనూ తనను చూసుకోవడానికి మానవుడు గోవును పూజించాలని పెద్దల ఆదేశం. సనాతన ఋషులుగోవునుదైవసమానంగా భావించడం సహజమే! భారతదేశంలో మనిషికి ఆవు మంచి తోడు. అది సర్వసంపత్ర్పదాత్రి. అది పాలివ్వడమే కాకుండా సేద్యానికి కూడా ఉపయోగపడుతుంది. గోవు కరుణరసాత్మక కావ్యం. ఆ సాధుజంతువులో కరుణే కళ్ళకు కడుతుంది. మానవజాతిలో లక్షల మందికి రెండోతల్లి అది.
సనాతన ఋషులు గోవును గౌరవించిన విధం
a) రెండో తల్లిగా
b) పాలిచ్చే జంతువుగా
c) సేద్యానికి ఉపయోగపడే జంతువుగా
d) దైవ సమానంగా
- View Answer
- సమాధానం: d
2. 'వారిధులింకిన వజ్రాయుధంబు
ధారతప్పిన మాటతప్పడారాజు
పై పద్యపాదాలలో ఉన్న ఉత్యసంధి పదం
a) వజ్రాయుధంబు
b) వారిధులింకిన
c) మాటతప్పడు
d) ధారతప్పిన
- View Answer
- సమాధానం: b
3. కింది వాక్యాల్లో సంక్లిష్టవాక్యం
a) రమేష్ ఆడుతూ కిందపడిపోయాడు.
b) అమ్మ వంట చేసింది.
c) గణపతిని వేదవ్యాసుడు లేఖకునిగా రమ్మన్నాడు.
d) వివేకవంతుడే సక్రమంగా ప్రవర్తించగలడు.
- View Answer
- సమాధానం: a
4. "రాబోయేది వానాకాలం కదా! ముందుచూపుతో తిండి సంపాదించుకొని తెస్తున్నాం' అని బుజ్జి మామిడి చెట్టుకు చెప్పినవి
a) పక్షులు
b) కోతులు
c) ఎలుకలు
d) చీమలు
- View Answer
- సమాధానం: d
5. ఉత్పలమాలలోని గణాలు
a) న, జ, భ, జ, జ, జ, ర
b) మ, స, జ, స, త, త, గ
c) భ, ర, న, భ, భ, ర, వ
d) స, భ, ర, న, మ, య, వ
- View Answer
- సమాధానం: c
6. కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
ధనమును, విద్యయు, వంశం
బును దుర్మతులకు, మదంబు బొనరించును స
జ్జనులైన వారి కడకువ
యును వినయము నివియ దెచ్చు నుర్వీనాథా!
'ధనం, విద్య, వంశం' అనేవి వీరికి గర్వాన్ని కలిగిస్తాయి
a) సజ్జనులకు
b) దుర్మతులకు
c) శిష్టులకు
d) ఉర్వీనాధులకు
- View Answer
- సమాధానం: b
7. ‘మానవుడే నా సందేశం – మనుష్యుడే నా సంగీతం’ అని చాటి చెప్పిన కవి ఎవరు?
a) గురజాడ
b) శ్రీశ్రీ
c) డాక్టర్ సినారె
d) ఆరుద్ర
- View Answer
- సమాధానం: b
8. “అతని ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి సింహమేమోనని భయపడ్డాను”
ఈ వాక్యంలోని అలంకారం
a) ఉపమాలంకారం
b) ఉత్ప్రేక్షాలంకారం
c) రూపకాలంకారం
d) అర్థాంతరన్యాసాలంకారం
- View Answer
- సమాధానం: b
9. ప్రకృతి ఒడిలో” అనే తాత్త్విక వ్యాసాన్ని రచించినది.
a) యస్. టి. జ్ఞానానందకవి
b) కొడవటిగంటి కుటుంబరావు
c) సి. నారాయణరెడ్డి
d) నార్ల వేంకటేశ్వరరావు
- View Answer
- సమాధానం: b
10. “సువర్ణాధ్యాయం” అను పదంలోని సంధి
a) గుణ సంధి
b) ఉత్య సంధి
c) వృద్ధి సంధి
d) సవర్ణదీర్ఘ సంధి
- View Answer
- సమాధానం: d
11. గానం, కథాసంవిధానంతోకూడినదై ప్రధాన కథకునికిప్రక్కన ఇద్దరు సహాయకులు కల్గిన కళారూపం
a) యక్షగానం
b) హరికథ
c) బుర్రకథ
d) తోలుబొమ్మలాట
- View Answer
- సమాధానం: c
12. అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటం
a) అలంకారం
b) ఛందస్సు
c) సమాసం
d) వాక్యం
- View Answer
- సమాధానం: c
13. “పిల్లలు అరుస్తున్నారు” ఈ వాక్యానికి సరైన వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
a) పిల్లలు అరిచారు
b) పిల్లలు అరుస్తారు
c) పిల్లలు అరవబోతున్నారు
d) పిల్లలు అరవడం లేదు.
- View Answer
- సమాధానం: d
14. “మాతౄణం” పదాన్ని విడదీయగా వచ్చిన రూపం
a) మాతౄ + ఋణం
b) మాతౄ + బుణం
c) మాతౄ + రుణం
d) మాతృ + ఋణం
- View Answer
- సమాధానం: d
15. లయకు ప్రాధాన్యం ఇస్తూ మాత్రా ఛందస్సులో సాగే రచన
a) గీతం
b) పద్యం
c) జానపదం
d) పల్లెపదాలు
- View Answer
- సమాధానం: a
16. 'నవగ్రహాలు' సమాసం పేరు
a) ద్వంద్వ సమాసం
b) తత్పురుష సమాసం
c) బహువ్రీహి సమాసం
d) ద్విగు సమాసం
- View Answer
- సమాధానం: d
17. 'ధాత్రి' అను పదానికి పర్యాయపదాలు
a) పుష్పం, పూవు
b) భూమి, పుడమి
c) విరి, సుమం
d) రాత్రి, చీకటి
- View Answer
- సమాధానం: b
18. కింది అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
బ్రతికే ప్రతి జీవిలోనూ తనను చూసుకోవడానికి మానవుడు గోవును పూజించాలని పెద్దల ఆదేశం. సనాతన ఋషులుగోవునుదైవసమానంగా భావించడం సహజమే! భారతదేశంలో మనిషికి ఆవు మంచి తోడు. అది సర్వసంపత్ర్పదాత్రి. అది పాలివ్వడమే కాకుండా సేద్యానికి కూడా ఉపయోగపడుతుంది. గోవు కరుణరసాత్మక కావ్యం. ఆ సాధుజంతువులో కరుణే కళ్ళకు కడుతుంది. మానవజాతిలో లక్షల మందికి రెండోతల్లి అది.
“మంచి పుస్తకాలు చదివితే అజ్ఞానం తొలుగుతుంది.” ఈ వాక్యం
a) క్యార్థక వాక్యం
b) శత్రర్థక వాక్యం
c) చేదర్థక వాక్యం
d) ఆశ్చర్యార్థక వాక్యం
- View Answer
- సమాధానం: c
19. మన జాతీయ జెండా పొడవు వెడల్పుల నిష్పత్తి
a) 3 : 2
b) 2 : 3
c) 7 : 2
d) 9 : 1
- View Answer
- సమాధానం: a
20. సుమతీ శతక కర్త
a) వేమన
b) బద్దెన
c) కరుణశ్రీ
d) మధుసూదనశాస్త్రి
- View Answer
- సమాధానం: b
21. కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
సద్గురులు చేయు నుపదేశసారములునునెంతయజ్ఞానమైననునిట్టైపోవు మంచి వైద్యుడిచ్చెడిచిన్నిమాత్రచేత దారుణంబగురోగంబుతోలగునట్లు
పై పద్యంలో గురువును వీరితో పోల్చారు.
a) అజ్ఞాని
b) ఉపదేశి
c) వైద్యునితో
d) చిన్నమాత్రతో
- View Answer
- సమాధానం: c
22. ఎలుక కన్నం నుంచి బయటకు వచ్చి తొంగి చూసింది. గీతగీసిన పదానికి పర్యాయపదాలు
a) స్నేహం, నెయ్యం
b) కొలను, సరస్సు
c) చెట్టు, వృక్షం
d) రంధ్రం, బిలం
- View Answer
- సమాధానం: d
23. "ఆవంతైనా విశ్రమించక
చంచలమై కదలాడునునింగిని!
సీతమ్మనె అవి వెదకుచుండెనో” - అనిఆవంత్స సోమసుందర్ వర్ణించినది
a) చిలుకలు
b) సీతాకోక చిలుకలు
c) తేనెటీగలు
d) నెమళ్ళు
- View Answer
- సమాధానం: b
24. రాయప్రోలు సుబ్బారావు రాసిన ఖండకావ్యం
a) తృణకంకణం
b) స్నేహలత
c) ఆంధ్రావని
d) కష్టకమల
- View Answer
- సమాధానం: c
25. జతపర్చండి.
(అ) తిన్నాడు (క) భవిష్యత్ కాలం
(ఆ) చేస్తున్నాడు (గ) భూతకాలం
(ఇ) వస్తాడు (చ) వర్తమానకాలం
a) అ - క; ఆ - గ; ఇ - చ
b) అ - గ; ఆ - క; ఇ - చ
c) అ - చ; ఆ - గ; ఇ - క
d) అ - గ; ఆ - చ; ఇ - క
- View Answer
- సమాధానం: d
26. ‘వికాలంగుల ఆత్మవిశ్వాసం’ ఇతివృత్తంగా ఉన్న పాఠ్యభాగం?
a) మనభాషలు
b) అతిథి మర్యాద
c) ఆలోచనం
d) కళ్లుండిచూడలేక
- View Answer
- సమాధానం: d
27. తెలుగు తల్లి తోటలోని
వెలుగులీనుపువ్వులం...
అని జంధ్యాల వెంకటేశ్వరశాస్త్రిగారు రచించిన గేయం పేరు
a) ఏమవుతుందో
b) ఆణిముత్యాలు
c) నీతిపద్యాలు
d) తొలకరి చిరుజల్లులు
- View Answer
- సమాధానం: d
28. కింది వాటిని జతపర్చండి
(అ) పళ్లు (క) రిక్కించు
(ఆ) ముఖం (ఖ) కొరుకు
(ఇ) చెవులు (గ) చిట్లించు
a) అ - క; ఆ - ఖ; ఇ - గ
b) అ - గ; ఆ - ఖ; ఇ - క;
c) ఇ - ఖ; అ – క; ఆ - గ;
d) అ - ఖ; ఆ-గ; ఇ - క
- View Answer
- సమాధానం: d
29. “నెత్తురు లోడ్చిన సత్తువ లూడ్చిన
పిశాచ దాస్యం నశించిందని
ప్రపంచమంతా ప్రతిధ్వనించగ
స్వతంత్ర శంఖాలూదండి'' అని పాడిన గౌతమీ కోకిల
a) శ్రీనాధుడు
b) చేమకూర వేంకట కవి
c) వేదుల సత్యనారాయణశాస్త్రి
d) శ్రీకృష్ణదేవరాయలు
- View Answer
- సమాధానం: c
30. ప్రజా పారావార తరంగం. ఈ వాక్యంలో “పారావారం” అర్థం
a) సముద్రం
b) పావురం
c) శాంతి
d) రాత్రి
- View Answer
- సమాధానం: a
31. “భ్రమరం” అనగా
a) గొంగళిపురుగు
b) తుమ్మెద
c) బొద్దింక
d) ఈగ
- View Answer
- సమాధానం: b
32. ‘మ్రోగిన గంటలు’ పాఠ్యభాగం కరుణశ్రీ రచించిన ఏ గ్రంథంలోనిది?
a) విజయశ్రీ
b) ఉదయశ్రీ
c) కరుణశ్రీ
d) కళ్యాణ కల్పవల్లి
- View Answer
- సమాధానం: b
33. కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి.
పడమటి కొండ కొనకొమ్ముమీద బంతిలా వెలిగిపోతున్నాడు, సూర్యుడు. మరి కాసేపటిలో కాలపురుషుడి కాలితన్నుతో కొండ కావలపడి లోకాన్ని నిండుచీకటితో నింపేవాడు - చావుతెలివి అన్నట్లుగా మబ్బుతునకలకు చుట్టూ జరీఅంచు చుట్టాడు. ముగ్ధమనోహరంగా ఉంది పడమటి దిశ. అప్పుడప్పుడే అక్కడి చెట్లమీద చేరుతున్న పక్షులు అరుస్తున్నాయి. ప్రార్థనాలయంలోనేమోతంబుర శ్రుతి సవరింపు సన్నగా వినిపిస్తూ ఉంది.
పై పేరాలో రచయిత సూర్యుణ్ణిదీనితో పోల్చారు
a) మబ్బు తునకలు
b) కాలపురుషుడు
c) జరీఅంచు
d) బంతి
- View Answer
- సమాధానం: d
34. కంచర్ల గోపన్న రచించిన శతకం
a) దాశరథీ శతకం
b) కాళహస్తీశ్వర శతకం
c) భాస్కర శతకం
d) సుమతీ శతకం
- View Answer
- సమాధానం: a
35. “మాటరాని ముసలి అవ్వ నోట నీరు పోసినారు” - ఈ వాక్యాలు సూచించే ఇతివృత్తం
a) పఠనాభిరుచి
b) కుహనా విలువలు
c) భాషాభిరుచి
d) మానవత్వపు విలువలు
- View Answer
- సమాధానం: d
36. “అర్థమత్తులహంకృతులు, అంధమతులురాని” కొత్త జగం ఏర్పడాలని కోరుకున్న భావకవి
a) ఉషశ్రీ
b) గుర్రం జాషువా
c) దేవులపల్లి కృష్ణశాస్త్రి
d) ఆరుద్ర
- View Answer
- సమాధానం: c
37. పాడు కరవులకు బాణాలు మా పంట చేలకివి ప్రాణాలు .... ఈ గేయం వీటిని ఉద్దేశించబడింది.
a) మయూరాలు
b) చిలుకలు
c) వర్షాలు
d) సీతాకోక చిలుకలు
- View Answer
- సమాధానం: c
38. “చెట్టు కోరిక” పాఠంలో మామిడి చెట్టు తొర్రలో కాపురం ఉంటున్నవి
a) పక్షులు
b) కోతులు
c) చీమలు
d) పాములు
- View Answer
- సమాధానం: c
39. హరిశ్చంద్రుడు ఈయన కుమారుడు
a) విశ్వామిత్రుని
b) పురుహూతుని
c) వశిష్టుని
d) త్రిశంకుని
- View Answer
- సమాధానం: d
40. పత్రికొకటియున్న పదివేల సైన్యము పత్రికొక్కటున్నమిత్రకోటి... తరువాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి.
a) పరుల పుస్తకము నెరువుతెచ్చితివేని
b) స్తవనీయ, దేవు, శ్రుతులన్
c) ప్రజకు రక్షలేదు పత్రిక లేకున్న
d) పేదవాని యింటపెండైనయెరుగరు
- View Answer
- సమాధానం: c
41. రైతు తన కళ్ళల్లోదుమ్ముకొట్టాడని ఎలుగుబంటి అనుకొంది. “కళ్ళలోదుమ్ముకొట్టు” ఈ జాతీయానికి అర్థం
a) నమ్మకం పెంచు
b) అనుగ్రహించు
c) తెలివైనది
d) మోసంచేయు
- View Answer
- సమాధానం: d
42. “పల్స్ పోలియో కార్యక్రమంలో వైద్య సిబ్బందికి సహకరించడం, నిరక్షరాస్యులైన పెద్దలకు చదువు నేర్పించడం” వంటివి ఈ స్పృహకు చెందుతాయి
a) నైతికస్పృహ
b) సామాజికస్పృహ
c) భాషాస్పృహ
d) ఆధ్యాత్మికస్పృహ
- View Answer
- సమాధానం: b
43. మా ఇంట్లో చీమలు కొల్లలుగా ఉన్నాయి.
ఈ వాక్యంలో “కొల్లలు” అనే పదానికి అర్థం
a) తక్కువ
b) కొద్దిగ
c) శూన్యం
d) ఎక్కువ
- View Answer
- సమాధానం: d
44. 'గజల్' ప్రక్రియలో కవి నామముద్రకు పేరు
a) మక్తా
b) మక్లా
c) తఖల్లస్
d) హైకూ
- View Answer
- సమాధానం: c
45. కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
'చదువు జీర్ణమైన స్వాంతంబు పండును
తిండి జీర్ణమైన నిండు బలము
చెఱుపు గూర్చు రెండు జీర్ణముల్గాకున్న
విశ్వహితచరిత్రవినర మిత్ర'
మనసు పరిపక్వమగు కాలము
a) చదివిన చదువును అర్థంచేసుకున్నప్పుడు
b) అర్థంచేసుకోకుండా చదివినప్పుడు
c) అర్థంలేకుండా చదివినప్పుడు
d) చదువు అర్థం కాకపోయినప్పుడు
- View Answer
- సమాధానం: a
46. ప్రజ్ఞ చిరునవ్వు నవ్వి “నేను నీకు మాట ఇస్తున్నాను. ప్లాస్టిక్ వినియోగం
తగ్గించి మీ కాగితంతో తయారయిన వస్తువులనే వినియోగిస్తాను”
పై వాక్యం వలన మనకు కలిగే స్పృహ
a) పర్యావరణ స్పృహ
b) రాజకీయ స్పృహ
c) ఆధ్యాత్మిక స్పృహ
d) కళాత్మక స్పృహ
- View Answer
- సమాధానం: a
47. కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి.
పడమటి కొండ కొనకొమ్ముమీద బంతిలా వెలిగిపోతున్నాడు, సూర్యుడు. మరి కాసేపటిలో కాలపురుషుడి కాలితన్నుతో కొండ కావలపడి లోకాన్ని నిండుచీకటితో నింపేవాడు - చావుతెలివి అన్నట్లుగా మబ్బుతునకలకు చుట్టూ జరీఅంచు చుట్టాడు. ముగ్ధమనోహరంగా ఉంది పడమటి దిశ. అప్పుడప్పుడే అక్కడి చెట్లమీద చేరుతున్న పక్షులు అరుస్తున్నాయి. ప్రార్థనాలయంలోనేమోతంబుర శ్రుతి సవరింపు సన్నగా వినిపిస్తూ ఉంది.
పై పేరాలో రచయిత 'చావుతెలివి' అనే పదప్రయోగం ఈ అర్థంలో ఉపయోగించారు
a) మొండిగా ఉండడం
b) చనిపోవడానికి ఉపయోగించే తెలివితేటలు
c) ఆఖరి ప్రయత్నం
d) చంపేందుకు చూపే తెలివితేటలు
- View Answer
- సమాధానం: c
48. పసిడి ఛాయలో మిసమిసలాడే పేరు వినగానే నోరూరించే ఏడుపు నవ్వుగా ఇట్టే మార్చే పిల్లలు మెచ్చేది ..........
a) గాలిపటం
b) బెల్లం లడ్డూ
c) నేరేడు పండు
d) కాకరకాయ
- View Answer
- సమాధానం:b
49. 'అణ్వస్త్రం' అను పదాన్ని విడదీసిన రూపం
a) అణ్వ + అస్త్రం
b) అణువు + అస్త్రం
c) అణు + అస్త్రం
d) అణు + యస్త్రం
- View Answer
- సమాధానం: c
50. ‘ఆకలితో చచ్చే పేదల/ శోకంలో కోపం ఎంతో’ ఈ కవితా వాక్యం దాశరథి రచించిన ఏ గ్రంథం లోనిది?
a) అమృతాభిషేకం
b) అగ్నిధార
c) రుద్రవీణ
d) కవితా పుష్పకం
- View Answer
- సమాధానం: b