AP TET 2021: Telugu Practice Test-7
1) గజల్ అను సాహిత్య ప్రక్రియ గల భాష
a) హిందీ
b) అరబిక్
c) ఉర్దూ
d) బెంగాలీ
- View Answer
- సమాధానం: c
2) కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
ఆ కాలంలో జాతీయోత్సవాన్ని “ఫాల్గుణోత్సవం” అనే వారు. హలపూజ చేసిన రైతులు ఆనందించే రోజు అదీ. వ్యావసాయిక దేశమైన ఆంధ్రలో ఇది ముఖ్యమైన పండుగ. ఎఱ్ఱగుడ్డలు కట్టి హాలికమహోత్సవం జరపడం కూడా నాడు ముఖ్యమైనదే! 'గులాము' అనే వర్ల చూర్ణాన్ని వాడటమూ “గుడయంత్రము' అనే చెరుకురసం పిండే కర్రయంత్రాన్ని వినియోగించడం ఈ పండుగలో ముఖ్యమైనది.
'హలపూజ' వేటికి చేస్తారు
a) నాగళ్ళకు
b) పశువులకు
c) చెరకు కర్రలకు
d) యంత్రాలకు
- View Answer
- సమాధానం: a
3) మన జాతీయ జెండా పొడవు, వెడల్పుల నిష్పత్తి
a) 1: 3
b) 3 : 4
c) 3 : 2
d) 3 : 1
- View Answer
- సమాధానం: c
4) కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
ఈ నదీ తీరమే యాంధ్రుల ఆర్థిక రాజకీయ సాంఘిక జీవనమునకు జీవగడ్డ. ఆంధ్రుల దృష్టిని నందికొండ నుండి హంసలదీవి వరకు సాగించి వారి చరిత్రకొక విశిష్టత నెలకొల్పినది. పరరాజన్యుల సేనావాహినికి చెలియలికట్టయై తన ప్రభావము ప్రకటించుకున్నదీ నదీమతల్లి. బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనంద గోత్రజులు, వెలనాటికోట సామంత రాజులు ఈ నదీతట రాజవల్లభులు.
పై గద్యంలో ఉన్న జాతీయం
a) జీవగడ్డ
b) సాగించు
c) తటరాజం
d) ప్రభావం
- View Answer
- సమాధానం: a
5) కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి
కొడవటిగంటి కుటుంబరావు “చదువు” నవల 1952లో పుస్తక రూపంలో వచ్చింది. అంతకుముందు ఆంధ్రజ్యోతి మాసపత్రికలో ధారావాహికగా వచ్చింది. ఈ నవలలో రచయిత “విద్య అంటే జ్ఞానం సంపాదించడం. జ్ఞానం రెండు రకాలు. పుస్తక జ్ఞానమూ, అనుభవ జ్ఞానమూ, ఈ రెండు రకాల జ్ఞానాలూ విద్య ద్వారా లభ్యంకావాలి” అన్నారు.
విద్య ద్వారా లభించాల్సిన జ్ఞానం
a) ధారావాహిక జ్ఞానం
b) పుస్తక జ్ఞానం
c) పుస్తక జ్ఞానం, అనుభవ జ్ఞానం
d) నవలారూప జ్ఞానం
- View Answer
- సమాధానం: c
6) 'మన జెండా మనదే వీరుల నెత్తురు పంట' - దీనిలో వీరులంటే
a) ధైర్యవంతులు
b) కత్తియుద్ధం చేసేవారు
c) స్వాతంత్ర్య సమరయోధులు
d) భారతీయులు
- View Answer
- సమాధానం: c
7) కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
'చదువు జీర్ణమైన స్వాంతంబు పండును
తిండి జీర్ణమైన నిండు బలము
చెఱుపు గూర్చు రెండు జీర్ణముల్గాకున్న
విశ్వహితచరిత్ర వినర మిత్ర'
“చెలుపు గూర్చు” పదానికి అర్థం
a) చెఱువు దగ్గరకి
b) కీడుకలిగించు
c) మేలుకలిగించు
d) చెఱువుకు దూరంగా
- View Answer
- సమాధానం: b
8) 'శక్తి' అను పదానికి నానార్థాలు
a) పార్వతీదేవి, బలము
b) పార్వతీదేవి, పర్వతరాజపుత్రి
c) బలము, సత్తువ
d) సత్యము, సత్తెము
- View Answer
- సమాధానం: a
9) కరుణశ్రీ అసలు పేరు ఏమిటి?
a) జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి
b) జంధ్యాల జయకృష్ణ శాస్త్రి
c) జంధ్యాల శంకర శాస్త్రి
d) జంధ్యాల పాపయ్యశాస్త్రి
- View Answer
- సమాధానం: d
10) 'నారాయణా!' అనే మకుటంతో శతకం రాసిన కవి
a) బమ్మెర పోతన
b) సత్యవోలు సుందరకవి
c) కాకుత్సం శేషప్ప కవి
d) ధూర్జటి
- View Answer
- సమాధానం: a
11) 'అపారకృపా తరంగితాలైన నయనాంచలాలు ఆనందం జాలు వారే సిగ్గ పరిమళాలు' అని తిలక్ సంబోధించినది
a) శాంతిని
b) రాణిని
c) గులాబీని
d) కాలుష్య నగరాన్ని
- View Answer
- సమాధానం: a
12) కింది వాటిలో బద్దెన రచించిన ‘నీతిశాస్త్ర ముక్తావళి’లో అంశం ఏది?
a) రాజనీతి పద్ధతి
b) మంత్రి పద్ధతి
c) ఉపాయ పద్ధతి
d) పైవన్నీ
- View Answer
- సమాధానం: d
13) పోతన భాగవత కావ్యం రచించాడు - గీతగీసిన పదానికి వికృతి
a) కర్జం
b) కావ్యము
c) కబ్బం
d) కబ్బు
- View Answer
- సమాధానం: c
14) “భూతకాలిక అసమాపక క్రియస’’కు మరో వ్యవహారం
a) శత్రర్థకం
b) చేదర్థకం
c) తుమున్నర్థకం
d) క్వార్థం
- View Answer
- సమాధానం: d
15) మన జాతీయపతాక రూపశిల్చి.
a) పింగళి వెంకయ్య
b) భోగరాజు పట్టాభిసీతారామయ్య
c) పొట్టి శ్రీరాములు
d) స్వామి సీతారాం
- View Answer
- సమాధానం: a
16) కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
శ్రీనాథుడు భీమఖండం గురించి ఆశ్వాసాంతగద్యాల్లో ‘భీమేశ్వరపురాణం'గా సూచించినా “ప్రబంధం”గానే పేర్కొన్నాడు. శ్రీ పింగళి లక్ష్మీకాంతంగారు భీమఖండం గురించి పరామర్శిస్తూ “ప్రబంధమున నుండ దగిన అష్టాదశవర్ణనలలో కొన్నింటికి అవకాశం కల్పించి, ఈ ఉపపురాణమును ప్రబంధప్రాయకముగా సంతరించెనని తోచును” అని కృతి రచనా తత్త్యం ఉటంకించారు.
ప్రబంధములో ఉండదగిన వర్ణనలు
a) ఇరవై ఎనిమిది
b) ఏభై ఎనిమిది
c) పదహారు
d) పద్దెనిమిది
- View Answer
- సమాధానం: d
17) సప్తవర్ణాలు” సమాసం పేరు
a) ద్వంద్వ సమాసం
b) షష్ఠీ తత్పురుష సమాసం
c) బహువ్రీహి సమాసం
d) ద్విగు సమాసం
- View Answer
- సమాధానం: d
18) 'పరికించు' పదానికి పర్యాయపదాలు
a) నైపుణ్యం, సామర్థ్యం
b) గౌరవం, విలువ
c) పౌరుషం, ప్రతిజ్ఞ
d) పరిశీలించు, చూచు
- View Answer
- సమాధానం: d
19) శ్రీశైలం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.
ఈ వాక్యంలో 'శక్తి' అనే పదానికి వికృతి
a) శత్తి
b) సత్తి
c) సుత్తి
d) సోకు
- View Answer
- సమాధానం: b
20) ‘ఎలుక విందు’ గేయ రచయిత ఎవరు?
a) గిడుగు రాజేశ్వరరావు
b) దాశరథి కృష్ణమాచార్యులు
c) వానమామలై వరదాచార్యులు
d) నార్ల వెంకటేశ్వరరావు
- View Answer
- సమాధానం: b
21) కింది వానిలో ఆరవగణం 'య' గణంగా గల పద్యం
a) చంపకమాల
b) శార్దూలం
c) ఉత్పలమాల
d) మత్తేభం
- View Answer
- సమాధానం: d
22) కర్షకులు, కార్మికులు, పీడితులు, పేదలు అనుభవించే కష్టసుఖాలను కవితా వస్తువులుగా తీసుకొని ఖడ్గసృష్టి చేసింది.
a) సి. నారాయణరెడ్డి
b) శ్రీరంగం శ్రీనివాసరావు
c) నండూరి రామమోహనరావు
d) నార్ల వేంకటేశ్వరరావు
- View Answer
- సమాధానం: b
23) అమృతం తెచ్చి తన తల్లి దాస్యాన్ని తొలగించినవాడు
a) వైనతేయుడు
b) అనూరుడు
c) కశ్యపుడు
d) కాద్రవేయుడు
- View Answer
- సమాధానం: a
24) 'మహాలయ అమావాస్య' అను మాటకు మరో వ్యవహారం
a) పితృ అమావాస్య
b) మాతృ అమావాస్య
c) బతుకమ్మ పండుగ
d) చిట్టిబొట్టు నోము
- View Answer
- సమాధానం: a
25) కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
నియత తపమును నింద్రియ నిగ్రహంబు
భూరి విద్యయు శాంతికి గారణములు
వాటీయన్నిటి కంటే మేలైన శాంతి
కారణము లోభముడుగుట కౌరవేంద్ర!
నియమం గల తపస్సు, ఇంద్రియ నిగ్రహం, మంచి విద్య అనునవి దీనికి కారణాలు
a) భూరి విద్యకు
b) శాంతికి
c) కౌరవేంద్రునకు
d) లోభానికి
- View Answer
- సమాధానం: b
26) “చిలుక సందేశం” అనే పాఠం ప్రక్రియ
a) పాట
b) సంభాషణ
c) పద్యం
d) గేయరూపంలో నాటిక
- View Answer
- సమాధానం: d
27) కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి
“కమలములు నీటబాసిన కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
దమ మిత్రులు శత్రులౌట తధ్యము సుమతీ!
కమలాపుడు అంటే
a) మిత్రుడు
b) సరస్సు
c) చంద్రుడు
d) సూర్యుడు
- View Answer
- సమాధానం: a, d
28) “నేను మీకు మాట ఇస్తున్నాను. ప్లాస్టిక్ వినియోగం తగ్గించి కాగితంతో తయారయిన వస్తువులనే ఎక్కువ వినియోగిస్తాను” అని ప్రజ్ఞ అన్నది.
పై వాక్యంలో కనబడే స్పృహ
a) భాషా స్పృహ
b) పురాణ స్పృహ
c) పర్యావరణ స్పృహ
d) అధిభాషా స్పృహ
- View Answer
- సమాధానం: c
29) చాలా బాధ కలిగిన సందర్భంలో ఉపయోగించే జాతీయం
a) భగీరధ ప్రయత్నం
b) గుండెలు బరువెక్కడం
c) సుగ్రీవాజ్ఞ
d) కాలధర్మం చెందడం
- View Answer
- సమాధానం: b
30) డాక్టర్ సి. నారాయణరెడ్డికి జ్ఞానపీఠ బహుమతి లభించిన గ్రంథం?
a) కర్పూర వసంతరాయలు
b) నాగార్జున సాగరం
c) విశ్వంభర
d) విశ్వనాథ నాయకుడు
- View Answer
- సమాధానం: c
31) మిత్రసాహస్తి శతకాన్ని రచించినది
a) నీలకంఠ దీక్షితులు
b) ఏలూరిపాటి అనంతరామయ్య
c) కొండూరు వీరరాఘవాచార్యులు
d) కంచర్ల గోపన్న
- View Answer
- సమాధానం: c
32) జాతీయజెండాలో తెలుపు రంగు వీటికి చిహ్నం
a) ధైర్యం, త్యాగం
b) శాంతి, సత్యం
c) నమ్మకం, సమృద్ధి
d) భూమి, సమృద్ధి
- View Answer
- సమాధానం: b
33) "శశాంక్, షర్మిల, హరీష్‌లు సర్కస్ కు వెళ్ళారు' ఈ వాక్యంలోని ఊష్మాక్షరాలు
a) శ, ల, ర
b) క్, ల, ష్ స్
c) శ, ష, స, హ
d) శాం, ర్మి, రీ
- View Answer
- సమాధానం: c
34) “దమ్మం ” అను పదానికి ప్రకృతి
a) ధర్మం
b) ధార్మికం
c) దారవం
d) దమ్ము
- View Answer
- సమాధానం: a
35) 'అనగననగ రాగమతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు” .....
తరువాత వచ్చే మూడవ పద్యపాదం
a) దమ్ముల బిలువని నోరును
b) సాధనమున పనులు సమకూరుధరలోన
c) కూరిమి విరసంబైనను
d) ఇమ్ముగ చదవని నోరును
- View Answer
- సమాధానం: b
36) సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంగా పత్రికా సంపాదకులు రాస్తే అది
a) సమర్థనీయం
b) సంపాదకీయం
c) రచనా సౌలభ్యం
d) జీవిత చరిత్ర
- View Answer
- సమాధానం: b
37) “నరుడు మెచ్చెనేని నారాయణుడు మెచ్చు”
ఈ పద్యపాదం తర్వాత పాదాన్ని గుర్తించండి.
a) లలిత సుగుణజాల తెలుగు బాల
b) పాలనిచ్చు, చెట్లు పూలు పూచు
c) కాలమూరకెపుడు గడుపబోకు
d) దీనులందు దేవదేవుడుండు
- View Answer
- సమాధానం: d
38) 'భోజరాజీయము' కావ్యంలో ‘మును మును బుట్టెనాకు నొక ముద్దుల పట్టీ' అని అన్నది.
a) పులి
b) ఆవు
c) దూడ
d) జింక
- View Answer
- సమాధానం: b
39) కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
సాహిత్యం అంటే అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన మహాకావ్యాలలో గాథా సప్తశతి ఒకటి. హాలసిరి శాతకర్ణి అనే శాతవాహనరాజు, అనేక ప్రాకృత కవులు రచించిన పద్యాలను సేకరించి, సంకలించి ఈ పేరుతో క్రీ.శ. మొదటి శతాబ్దం ప్రధమ దశకంలో ఈ మహాకావ్యాన్ని లోకానికి అందించాడు.
'గాథా సప్తశతి' ప్రత్యేకత
a) శాతవాహన రాజుచే విక్రయించబడడం
b) శాతవాహనుల గూర్చి తెలియజేయడం
c) ఆధునిక రచయితలకు అవకాశం దక్కడం
d) ప్రాకృత కవుల రచనలు తిరిగి గ్రంధస్థం కావడం
- View Answer
- సమాధానం: d
40) మత్తేభం పద్యపాదానికి యతిస్థానం పాటించే అక్షరం.
a) 10వ అక్షరం
b) 13వ అక్షరం
c) 14వ అక్షరం
d) 11వ అక్షరం
- View Answer
- సమాధానం: c
41) పోస్టల్ ఇండెక్స్ నంబర్లోని రెండవ, మూడవ అంకెలు దీనిని సూచిస్తాయి
a) రాష్ట్రం
b) జిల్లా
c) గ్రామం
d) తపాలా కార్యాలయం
- View Answer
- సమాధానం: b
42) “ఖగము” అను మాటకు నానార్థాలు
a) పక్షి, బాణం
b) బాణం, శరం
c) బాణం, నీరు
d) యజ్ఞం, యాగం
- View Answer
- సమాధానం: a
43) “ఆకలితో చచ్చే పేదల - శోకంలో కోపం యెంతో” అనే గేయపంక్తులు గల పాఠం దాశరథి రచించిన ఈ గ్రంథం లోనిది.
a) రుద్రవీణ
b) పునర్నవం
c) అగ్నిధార
d) అమృతాభిషేకం
- View Answer
- సమాధానం: c
44) ముసలి అవ్వను చూడగానే నా గుండె కరిగింది. గుండె కరిగింది జాతీయానికి అర్థం
a) గుండెజబ్బు కలుగు
b) జాలి కలుగు
c) దానం ఇచ్చు
d) భోజనం పెట్టు
- View Answer
- సమాధానం: b
45) “పరుల కొరకె నదులు ప్రవహించు, గోవులు
పాలనిచ్చు, చెట్లు పూలు పూచు”
తరువాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి.
a) మానవార్చనంబే మాధవార్చనమురా
b) దీను లందు దేవ దేవుడుండు
c) పరహితమ్ము కంటే పరమార్థమున్నదా
d) పుష్పజాతివేరు పూజ ఒకటి
- View Answer
- సమాధానం: c
46) కింది వాక్యాల్లో ఆశ్చర్యార్థకం కాని వాక్యం
a) ఆహా! సూర్యోదయం ఎంత బాగుంది.
b) ఒక్కరోజు పాట నేర్చుకొని! బాగా పాడుతుంది.
c) అబ్బ! ఈ వెచ్చని గాలి చాలా బాగుంది.
d) అబ్బా! నన్ను కొడతావేం.
- View Answer
- సమాధానం: b
47) ఈకింది పద్యం చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
చదువు మట్టుపడును సంస్కృతి చెడిపోవు
సంపదలు తొలంగు సౌఖ్యముడుగు
గౌరవంబు వోవు, గావున సోమరి
తనము కన్న హీన గుణము గలదే.
పైపద్యంలో అన్ని అనర్థాలకు మూలమని చెప్పిన చెడుగుణం.
a) సౌఖ్యము కలగటం
b) మంచిగుణం
c) సోమరితనం
d) సంపదలు తొలగిపోవడం
- View Answer
- సమాధానం: c
48) "ప్రత్యక్షం" పదాన్ని విడదీసిన రూపం
a) ప్రత్య + అక్షం
b) ప్రతి + యక్షం
c) ప్రగతి + అక్షం
d) ప్రతి + అక్షం
- View Answer
- సమాధానం: d
49) ‘స్వాగతం’ పదంలోని సంధి?
a) గుణసంధి
b) యణాదేశసంధి
c) సవర్ణదీర్ఘసంధి
d) వృద్ధిసంధి
- View Answer
- సమాధానం: b
50) "పాకాల చెరువులో పది గుంజలు
ఊపితే ఊగుతాయి. పీకితే రావు”.
పై పొడుపుకు సంబంధించిన వీడుపు
a) చేతివేళ్ళు
b) పోస్ట్ కార్డు
c) పెదవులు
d) కనురెప్పలు
- View Answer
- సమాధానం: a