AP TET 2021: Telugu Practice Test-6
1) ఇంద్రధనువులై ఎగిరే చిలుకలు
పూలరంగులై ఎగిరే తరగలు....
ఈ కీటకం గురించి రాయబడిన గేయం
a) రామచిలుక
b) తుమ్మెద
c) సీతాకోకచిలుక
d) తేనెటీగ
- View Answer
- సమాధానం: c
2) బాలికల విద్యే ప్రధాన ఇతివృత్తంగా రాయబడిన పాఠం
a) శ్రీలు పొంగిన జీవగడ్డ
b) తెలుగు వెలుగు
c) జానపద కళలు
d) సీత ఇష్టాలు
- View Answer
- సమాధానం: d
3) ‘హరిశ్చంద్రుడు’ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు సంబంధించింది?
a) పద్యం
b) గేయం
c) ద్విపద
d) గద్యం
- View Answer
- సమాధానం: c
4) “రక్తము” - నానార్థాలు
a) ఎఱ్ఱనిది, రుధిరం
b) అగ్ని, కాయడం
c) రక్తం, శరీరం
d) పౌరుషం, పంతం
- View Answer
- సమాధానం: a
5) కింది వాటిలో ఉపమాలంకారం కలిగిన వాక్యం
a) అతని మాట సింహగర్జనేమో.
b) లలిత పాడితే కోకిల పాట పాడినట్టే.
c) ఆమె కంఠస్వరం కోకిల పాటలా ఉంది.
d) పిల్లల అల్లరి ముందు కోతి అల్లరి కూడా తక్కువే.
- View Answer
- సమాధానం: c
6) ఒక హల్లుకు, అదే హల్లు ఒత్తుగా చేరితే ఆ అక్షరం
a) సంయుక్తం
b) ద్విత్వం
c) అల్పప్రాణం
d) పరుషం
- View Answer
- సమాధానం: b
7) తనకు కావలసిన విషయం అందుబాటులోనే ఉన్నా గమనించకపోవడం' అనే భావనను స్పురింపజేసే సామెత
a) కుక్కకాటుకు చెప్పుదెబ్బ
b) కాకపిల్ల కాకికి ముద్దు
c) ఇంట్లో ఈగలమోత, బయట పల్లకీ మోత
d) ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకొని, ఊరంతా వెదకినట్లు
- View Answer
- సమాధానం: d
8) ఒక వ్యక్తికి గానీ, వ్యవస్థకుగానీ లేదా యంత్రానికిగాని ఉన్న సమర్థతను సూచించే వాక్యం
a) ఆశ్చర్యార్థకం
b) సందేహర్థకం
c) అనుమత్యర్థకం
d) సామర్ద్యార్థకం
- View Answer
- సమాధానం: d
9) కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
ధనపతి సఖుడైయుండియు
నెనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్
తనవారికెంత గలిగిన
తన భాగ్యమె తనకుగాక తథ్యము సుమతీ!
శివుని స్నేహితుడు
a) ధనవంతుడు
b) కుబేరుడు
c) ఇంద్రుడు
d) విష్ణువు
- View Answer
- సమాధానం: d
10) ‘ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాస పరిమళాలు/ సంస్కారపు కేశపాశంలో తురిమిన గులాబీ శాంతి’ అని వర్ణించిన కవి?
a) దేవులపల్లి కృష్ణశాస్త్రి
b) కందుర్తి
c) దేవరకొండ బాలగంగాధర తిలక్
d) అనిశెట్టి ప్రభాకర్
- View Answer
- సమాధానం: c
11) “దుస్తులు” అనే పదానికి పర్యాయపదాలు
a) అంబరం, ఆకాశం
b) వస్త్రాలు, బట్టలు
c) గిన్నెలు, పాత్రలు
d) లేఖ, ఉత్తరం
- View Answer
- సమాధానం: b
12) 'కంఠీరవం' అను పదానికి వ్యుత్పత్తి
a) లోకమునకు జీవనాధారమైనది
b) పొట్టతో పాకేది
c) కంఠంలో ధ్వని కలది
d) సంతోషముతో నిండి ఉండునది
- View Answer
- సమాధానం: c
13) అమిత్ తల అడ్డంగా ఊపుతూ “నేను కూడా మిగతా పిల్లలందరూ చేసే పనులన్నీ చేయగలను. కానీ నేను వాళ్ళకు భిన్నంగా పొట్టిగా ఉంటాను” అని అన్నాడు పై వాక్యం వలన మనకు తెలుస్తున్నది.
a) దివ్యాంగుల ఆత్మస్థైర్యం
b) సృజనాత్మక శక్తి
c) ప్రశ్నించే స్వభావం
d) నైతిక విలువలు
- View Answer
- సమాధానం: a
14) “భూషణవికాస! శ్రీధర్మపుర నివాస దుష్టసంహార! నరసింహ దురిత దూర” అనే మకుటంతో శతకాన్ని రచించిన కవి.
a) ఏనుగు లక్ష్మణకవి
b) కాకుత్సం శేషప్పకవి
c) ధూర్జటి
d) పక్కి అప్పల నరసయ్య
- View Answer
- సమాధానం: b
15) ‘శ్రీకాంత్ ఇప్పుడే వచ్చి వెళ్లాడు’ అనేది ఏ వాక్యం?
a) సామాన్య వాక్యం
b) సంశ్లిష్ట వాక్యం
c) సంయుక్త వాక్యం
d) ప్రేరణార్థక వాక్యం
- View Answer
- సమాధానం: b
16) కింది వాటిని జతపర్చండి
(అ) కళ్ళు (క) చిట్లించు
(ఆ) ముఖం (గ) రిక్కించు
(ఇ) చెవులు (చ) చికిలించు
a) అ - క; ఆ - గ; ఇ - చ
b) అ - గ; ఆ - చ; ఇ - క
c) అ - చ; ఆ - క; ఇ - గ
d) అ - గ; ఆ - క; ఇ – చ
- View Answer
- సమాధానం: c
17) 'ఈ గ్రంథాన్ని ఆద్యంతం చదివాను' - ఈ వాక్యంలో ఆద్యంతం అను మాటలోని సంధి
a) గుణసంధి
b) యడాగమసంధి
c) సవర్ణదీర్ఘ సంధి
d) యణాదేశసంధి
- View Answer
- సమాధానం: d
18) కింది వాటిని జతపర్చండి
(అ) కోపంతో (క) తేలిపోవడం
(ఆ) బాధతో (గ) ఊగిపోవడం
(ఇ) ఊహల్లో (చ) కుంగిపోవడం
a) అ - క; ఆ - గ; ఇ - చ
b) అ - గ; ఆ - చ; ఇ - క
c) అ - చ; ఆ - గ; ఇ - క
d) అ - గ; ఆ - క; ఇ - చ
- View Answer
- సమాధానం: b
19) “భాండం” అనగా....
a) బండ
b) కుండ
c) తీరం
d) కొండ
- View Answer
- సమాధానం: b
20) కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
ఆ కాలంలో జాతీయోత్సవాన్ని “ఫాల్గుణోత్సవం” అనే వారు. హలపూజ చేసిన రైతులు ఆనందించే రోజు అదీ. వ్యావసాయిక దేశమైన ఆంధ్రలో ఇది ముఖ్యమైన పండుగ. ఎఱ్ఱగుడ్డలు కట్టి హాలికమహోత్సవం జరపడం కూడా నాడు ముఖ్యమైనదే! 'గులాము' అనే వర్ల చూర్ణాన్ని వాడటమూ “గుడయంత్రము' అనే చెరుకురసం పిండే కర్రయంత్రాన్ని వినియోగించడం ఈ పండుగలో ముఖ్యమైనది.
గులాం అంటే
a) ఉప్పు
b) వర్ణ చూర్ణం
c) బెల్లం
d) యంత్రం
- View Answer
- సమాధానం: b
21) సమ ప్రాధాన్యంగల వాక్యాలు ఏక వాక్యంగా ఏర్పడటం
a) సామాన్య వాక్యం
b) సంయుక్త వాక్యం
c) సంక్లిష్ట వాక్యం
d) అసంపూర్ణ వాక్యం
- View Answer
- సమాధానం: b
22) ‘తామరసం’ పదానికి నానార్థాలు?
a) మంచినీరు, చర్మరోగం
b) పద్మం, బ్రహ్మ
c) పద్మ, బంగారం
d) పండు, బ్రహ్మ
- View Answer
- సమాధానం: c
23) 'మీ సత్కారం, అన్నదానం నాకు తృప్తిని కలిగించాయి. ఈ వాక్యంలో గల విలువలు
a) అతిధి మర్యాద
b) ఆనందం
c) ఆలోచన
d) వేడుక
- View Answer
- సమాధానం: a
24) “గుర్వాజ్ఞ” పదాన్ని విడదీయగా వచ్చిన రూపం
a) గుర్వ + ఆజ్ఞ
b) గుర + ఆజ్ఞ
c) గురు + ఆజ్ఞ
d) గుః + ఆజ్ఞ
- View Answer
- సమాధానం: c
25) "ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంతగా మాత్రమే ఉన్నాయి తప్ప వృథా చేసేంతగా లేవు” అన్నవారు
a) మహాత్మాగాంధీ
b) వినోబా భావే
c) బాలగంగాధర తిలక్
d) వల్లభాయ్ పటేల్
- View Answer
- సమాధానం: a
26) శరదృతువులో వచ్చే పండుగ
a) ఉగాది
b) సంక్రాంతి
c) శ్రీరామనవమి
d) దసరా
- View Answer
- సమాధానం: d
27) “ఎవరూ పట్టించుకోని దుఃఖం' అనే అర్థం వచ్చే జాతీయం
a) అరణ్య రోదన
b) గుండెలు బాదుకొను
c) గుండెలు బరువెక్కు
d) పెడచెవిన పెట్టు
- View Answer
- సమాధానం: a
28) “అక్షరాలు స్పష్టంగా రాస్తే విషయం అర్థమవుతుంది.” ఈ వాక్యం
a) సామాన్య వాక్యం
b) చేదర్థక వాక్యం
c) ప్రశ్నార్థక వాక్యం
d) తుమున్నర్థక వాక్యం
- View Answer
- సమాధానం: b
29) కింది వాటిని జతపరచండి.
(అ) ఎక్కువగా మాట్లాడేవాడు (క) మితభాషి
(ఆ) అనర్గళంగా మాట్లాడేవాడు (ఖ) వాగుడుకాయ
(ఇ) తక్కువగా మాట్లాడేవాడు (గ) వక్త
a) అ - క: ఆ - ఖ; ఇ – గ
b) ఆ - క: ఇ - గ; అ – ఖ
c) ఇ - క: ఆ - గ; అ - ఖ
d) ఇ - క: ఆ – క; అ-గ
- View Answer
- సమాధానం: c
30) “సాగరం” అనే పదం ఈ గణానికి చెందినది.
a) భగణము
b) జగణము
c) రగణము
d) మగణము
- View Answer
- సమాధానం: c
31) “ఇనుడు” అను మాటకు పర్యాయపదాలు
a) రవి, ఇంద్రుడు
b) రవి, చంద్రుడు
c) రవి, భానుడు
d) భానుడు, ఇంద్రుడు
- View Answer
- సమాధానం: c
32) లయకు ప్రాధాన్యం ఇస్తూ మాత్రా ఛందస్సులో సాగే సాహితీ ప్రక్రియ
a) సంగీతం
b) గీతం
c) పద్యం
d) కథాకావ్యం
- View Answer
- సమాధానం: b
33) మన జాతీయ జెండాలో తెలుపు రంగు దీనికి సంకేతం
a) ధైర్యం, త్యాగం
b) దేశభక్తి, నమ్మకం
c) సమృద్ధి, త్యాగం
d) శాంతి, సత్యం
- View Answer
- సమాధానం: d
34) కింది గద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.
అర్థాలంకారాలను రెండు వర్గాలుగా విభజించవచ్చు. ఒక వర్గం ఉపమాన ప్రమేయం ఉన్నవి. మరొక వర్గం ఉపమాన ప్రమేయం లేనివి. ఉపమ, రూపకం మొదలైన అలంకారాలలో ఉపమాన ప్రమేయం ఉంటుంది. అతిశయోక్తి, అర్థాంతరన్యాసం మొదలైన అలంకారాలలో ఉపమాన ప్రమేయం ఉండదు.
కింది వాక్యాలలో సరియైనది.
a) ఉపమానం అనేది రూపకాలంకారంలో ఉంటుంది.
b) ఉపమానం అనేది అతిశయోక్తిలో ప్రధానాంశం
c) అర్థాంతరన్యాసంలో ఉపమానం ఉంటుంది.
d) ఏ అలంకారానికైనా ఉపమానం ముఖ్యం
- View Answer
- సమాధానం: a
35) కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
తిమ్మనకు ఒక ప్రత్యేక శైలి ఉంది. లలితలలితములైన పదముల కూర్పులో ఒక శ్రావ్యతను సాధించాడు. ఉపమా, ఉత్ర్పేక్ష అలంకారాలు రెండూ తిమ్మనకు ఇష్టం. స్వభావోక్తి తిమ్మన వాక్కులో మనోహర నృత్యం చేస్తుందంటే అతిశయోక్తికాదు. ఛందస్సును గమనిస్తే వృత్తాలు, జాత్యుపజాతులు సర్వసాధారణమైనవే కథా గమనానికి వాడారు.
'వృత్తాలు, జాత్యుపజాతులు' అనునవి
a) కావ్యశాస్త్ర భావనలు
b) అలంకారశాస్త్ర భావనలు
c) వ్యాకరణశాస్త్ర భావనలు
d) ఛందశ్శాస్త్ర భావనలు
- View Answer
- సమాధానం: d
36) “విహగము”అనగా
a) అవకాశాన్ని గమనించునది
b) ఆకాశంలో పోవునది
c) నీటిలో సంచరించేది
d) బొరియలో నివశించునది
- View Answer
- సమాధానం: b
37) "అరణ్యం' అనే పదానికి పర్యాయపదాలు
a) ధరణి, గడ్డ
b) చిరస్థాయి, ఎల్లప్పుడూ
c) అడవి, విపినం
d) అడవి, కనుక
- View Answer
- సమాధానం: c
38) శతకంలోని పద్యాలు ముక్తకాలు. ముక్తకాలు అనగా...
a) ఒకే ఛందస్సులో ఉండడం
b) నూరు పద్యాలు కలిగి ఉండడం
c) ఏ పద్యానికదే స్వతంత్రభావం కలిగి ఉండడం
d) ప్రతి పద్యానికి ఒకే మకుటం ఉండడం
- View Answer
- సమాధానం: c
39) కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి
“కమలములు నీటబాసిన కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
దమ మిత్రులు శత్రులౌట తధ్యము సుమతీ!
మిత్రులు శత్రువులయ్యేది
a) నీటిని వదిలినప్పుడు
b) తమస్థానాలు మారినప్పుడు
c) డబ్బులు ఇవ్వనప్పుడు
d) యుద్ధంలో
- View Answer
- సమాధానం: b
40) 'మ్రోగిన గంటలు' పాఠ్యభాగం ఈ గ్రంధం నుండి గ్రహింపబడింది
a) కరుణశ్రీ
b) రాజశ్రీ
c) ఉదయశ్రీ
d) విజయశ్రీ
- View Answer
- సమాధానం: c
41) కింది వాటిలో గుర్రం జాషువాకు గల బిరుదములు
(అ) కవికోకిల (ఆ) గద్య తిక్కన (ఇ) కళాప్రపూర్ణ (ఈ) ఆంధ్రా షెల్లీ
a) అ, ఇ
b) ఆ, ఈ
c) ఇ, ఈ
d) అ, ఈ
- View Answer
- సమాధానం: a
42) ‘దిగిరాను దిగిరాను దివి నుంచి భువికి/ నవ్విపోదురుగుగాక! నాకేటి సిగ్గు’ ఈ వాక్యాలు కృష్ణశాస్త్రిగారి ఏ గ్రంథంలోనివి?
a) ఊర్వశి
b) ప్రవాసం
c) కృష్ణపక్షం
d) కృష్ణశాస్త్రి గేయ సంపుటి
- View Answer
- సమాధానం: c
43) కార్యకారణ సంబంధాన్ని సూచించే క్రియలు
a) క్యార్థకాలు
b) చేదర్థకాలు
c) శత్రర్థకాలు
d) యుష్మదర్థకాలు
- View Answer
- సమాధానం: b
44) సూర్యచంద్రులు - సమాసం
a) ద్విగు సమాసం
b) ద్వంద్వ సమాసం
c) బహువ్రీహి సమాసం
d) తత్పురుష సమాసం
- View Answer
- సమాధానం: b
45) ఒక సమాపక క్రియ, ఒకటిగాని అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలతో ఏర్పడే వాక్యం
a) సామాన్య వాక్యం
b) సంశ్లిష్ట వాక్యం
c) ఆశ్చర్యార్థక వాక్యం
d) సంయుక్త వాక్యం
- View Answer
- సమాధానం: b
46) మన రాష్ట్రంలో పెద్ద మర్రిచెట్టు ఇక్కడ ఉంది
a) అనంతపురం జిల్లా కదిరి సమీపంలో
b) గుంటూరు జిల్లా బెల్లంకొండ సమీపంలో
c) చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలో
d) విశాఖజిల్లా తగరపు పలస సమీపంలో
- View Answer
- సమాధానం: a
47) కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
సృష్టికర్త అయిన బ్రహ్మకు హంసను వాహనంగా చెబుతాయి పురాణాలు. పరమహంస అంటే అత్యున్నతమైన హంస అని అర్థం. పవిత్రమైన ఈ హంసకు నీళ్ళు కలిసిన పాలలోంచి నీళ్ళను వేరు చేసేశక్తి ఉందని చెబుతారు. అంచేత అది ఆధ్యాత్మిక వివేకానికి ప్రతీక అయింది. అహం-స అంటే 'నేనే ఆయన' అని అర్థం. శక్తివంతమైన ఈ సంస్కృత శబ్దాలకు శ్వాస నిశ్వాసలతో స్పందక సంబంధముంది. ఆ విధంగా మానవుడు ప్రతిశ్వాసతోనూ 'నేనే ఆయన్ని' అన్న తన ఉనికిని గురించిన సత్యాన్ని అనుకోకుండా నొక్కి చెబుతుంటాడు.
"శ్వాస నిశ్వాసలు” ఈ సమాసపదానికి విగ్రహవాక్యం
a) శ్వాసయొక్క నిశ్వాస
b) శ్వాస తర్వాత నిశ్వాస
c) శ్వాసయును, నిశ్వాసయును
d) శ్వాసయందు విశ్వాస
- View Answer
- సమాధానం: c
48) ‘కాకి, ఎలుక, తాబేలు చెట్టుపైకి, బిలంలోకి, మడుగులోకి జారుకున్నాయి’ ఈ వాక్యంలో అలంకారం?
a) ఉత్ప్రేక్షాలంకారం
b) సందేహాలంకారం
c) మాలోపమాలంకారం
d) క్రమాలంకారం
- View Answer
- సమాధానం: d
49)కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
లభించినంతలో భీమకవి పద్యాల్ని నిశితంగా పరిశీలిస్తే, తరువాతి కాలంలో శాఖోపశాఖలుగా విస్తరిల్లి తెలుగు దేశమంతటినీ ఆలింగనం చేసుకొన్న శ్రీనాథకవి సార్వభౌముడి వ్యక్తిత్వానికి ఒరవడి భీమకవిలో మనం గుర్తించగలం.
పై పేరాలో కవిసార్వభౌముడనే బిరుదుగల కవి
a) భీమకవి
b) శ్రీనాధుడు
c) బమ్మెర పోతన
d) చక్రవర్తి
- View Answer
- సమాధానం: b
50) “సమైక్య భారతి” అను కవితా సంకలనంలో
“పరమ తపోనివేశనము బంగరు పంటలకు నివాస మ
బ్బురమగు శాంతి చంద్రికల భూమి’’
అని భరతమాతను స్తుతించినవారు
a) జ్ఞానానందకవి
b) గుర్రం జాషువా
c) రాయప్రోలు సుబ్బారావు
d) సి. నారాయణరెడ్డి
- View Answer
- సమాధానం: a