AP TET 2021: Telugu Practice Test-8
1) తిక్కన నిర్వచనత్తోర రామాయణ కృతిపతి ఎవరు?
a) హరిహర నాథుడు
b) భాస్కర మంత్రి
c) మనుమసిద్ధి
d) గణపతి దేవచక్రవర్తి
- View Answer
- సమాధానం: c
2) ‘పత్రికొకటియున్న పదివేల సైన్యము/ పత్రికొక్కటున్న మిత్రకోటి’ తర్వాత వచ్చే పద్య పాదం ఏది?
a) పేదవానియింట పెండ్లైనయెరుగరు
b) చెప్పుతినెడికుక్క చెరుకుతీపెరుగునా!
c) ప్రజలకురక్ష లేదు పత్రిక లేకున్న
d) వార్తయందు జగము వర్థిల్లుచుండును
- View Answer
- సమాధానం: c
3) 'వృషభం' అనగా అర్థం.
a) సింహం
b) ఆవు
c) దున్నపోతు
d) ఎద్దు
- View Answer
- సమాధానం: d
4) “స్నేహం” అను పదానికి వికృతి
a) నేస్తం
b) సాయం
c) నెయ్యం
d) నేయి
- View Answer
- సమాధానం: c
5) రాయప్రోలు రచించిన ఖండకావ్యం
a) తృణకంకణం
b) స్నేహలత
c) ఆంధ్రావని
d) స్వప్నకుమార
- View Answer
- సమాధానం: a, c
6) 'వనజాక్షుడు” అను పదంలోని సంధి
a) అత్వ సంధి
b) సవర్ణదీర్ఘ సంధి
c) గుణసంధి
d) అకారసంధి
- View Answer
- సమాధానం: b
7) కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి
కలనాటి ధనము లక్కఱ
గలనాటికి దాచ గమలగర్భుని వశమా?
నెల నడిమినాటి వెన్నెల
యలవడునే గాదెఁబోయ నమవసనిశికిన్
కమల గర్భుడు అనగా
a) శివుడు
b) ఇంద్రుడు
c) బ్రహ్మ
d) రావణుడు
- View Answer
- సమాధానం: c
8) “నాలో కదిలే నవ్యకవిత్వము
కార్మికలోకపు కళ్యాణానికి
శ్రామికలోకపు సౌభాగ్యానికీ” అన్న అభ్యుదయకవి
a) శ్రీశ్రీ
b) ఆరుద్ర
c) నండూరి రామమోహనరావు
d) నన్నయ
- View Answer
- సమాధానం: a
9) కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.
అరుణ గభస్తి బింబము దయాద్రి పయింబొడతేర గిన్నెలోఁ
బెరుగును వంటకంబు వడ పిందియలుం గుడువంగ బెట్టు ది.
ర్భరకరుణా ధురీణయగు ప్రాణము ప్రాణము తల్లి యున్నదే?
హరహర! యెవ్వరిక గడుపారగ బెట్టెదరీప్సితాన్నముల్.
పై పద్యంలో ‘గభస్తి' అంటే అర్థం
a) చంద్రుడు
b) సూర్యుడు
c) భోజనం
d) కంచం
- View Answer
- సమాధానం: b
10) ‘ఆలోచనం’ పాఠ్యభాగం దాశరథి రచించిన ఏ గ్రంథంలోనిది?
a) రుద్రవీణ
b) అగ్నిధార
c) మహాంధ్రోదయం
d) అమృతాభిషేకం
- View Answer
- సమాధానం: b
11) బొగ్గును మండించడం ద్వారా వెలువడే శక్తితో నీటిని ఆవిరిగా మార్చి ఆ నీటి ఆవిరితో టర్బయిన్లను తిప్పడం వలన ఉత్పత్తి అయ్యే విద్యుత్తు
a) హైడ్రో విద్యుత్తు
b) ధర్మల్ విద్యుత్తు
c) అణు విద్యుత్తు
d) పవన విద్యుత్తు
- View Answer
- సమాధానం: b
12) కాయమునకు ధూళి దులిపి
గాయమునకు కట్టు కట్టి
మాటరాని ముసలి అవ్వ
నోట నీరు పోసినారు
ఈ గేయపంక్తులు తెలియజేసే విలువలు
a) ఆధ్యాత్మిక విలువలు
b) భాషా విలువలు
c) మానవత్వపు విలువలు
d) వ్యాకరణ విలువలు
- View Answer
- సమాధానం: c
13) తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్నమాణిక్యాలు.
ఈ పొడుపు కథకు విడుపు
a) కొబ్బరికాయ
b) మామిడిపండు
c) పనసపండు
d) సీతాఫలం
- View Answer
- సమాధానం: c
14) “కంఠీరవం”అనే పదానికి అర్థం
a) హంస
b) సూర్యుడు
c) సింహం
d) తామర
- View Answer
- సమాధానం: c
15) పిన్ కోడ్ నెంబర్లలో ఉండే మొదటి అంకె సూచించేది
a) జిల్లా సంఖ్యను
b) రాష్ట్ర సంఖ్యను
c) మండల సంఖ్యను
d) స్థానిక గ్రామ సంఖ్యను
- View Answer
- సమాధానం: b
16) సౌజన్య “నమస్కారమండీ! రండి కూర్చోండి. ఏం పనిమీద వచ్చారు? మంచినీళ్ళు తాగుతారా?” అని ఆప్యాయంగా అడిగింది.
పై వాక్యాలలో వ్యక్తమవుతున్న భావన
a) మానవ సంబంధాలు
b) పర్యావరణ సంబంధాలు
c) సాహిత్య సంబంధాలు
d) ఆధ్యాత్మిక సంబంధాలు
- View Answer
- సమాధానం: a
17) “నేను మీ ప్రియనేస్తాన్ని” అన్న ఆత్మకథ
a) పాముది
b) పుస్తకానిది
c) సముద్రానిది
d) కొండది
- View Answer
- సమాధానం: b
18) “ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారట” అనేది
a) సామెత
b) జాతీయం
c) సంస్కృతన్యాయం
d) పొడుపు కథ
- View Answer
- సమాధానం: a
19) కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
శ్రీనాథుడు భీమఖండం గురించి ఆశ్వాసాంతగద్యాల్లో
‘భీమేశ్వరపురాణం'గా సూచించినా “ప్రబంధం”గానే పేర్కొన్నాడు. శ్రీ పింగళి
లక్ష్మీకాంతంగారు భీమఖండం గురించి పరామర్శిస్తూ “ప్రబంధమున నుండ
దగిన అష్టాదశవర్ణనలలో కొన్నింటికి అవకాశం కల్పించి, ఈ ఉపపురాణమును
ప్రబంధప్రాయకముగా సంతరించెనని తోచును” అని కృతి రచనా తత్త్యం ఉటంకించారు.
శ్రీనాథుడు తన భీమఖండాన్ని, భీమేశ్వర పురాణంగా పేర్కొన్నది
a) అశ్వాసాంత గద్యాల్లో
b) అష్టాదశ వర్ణనల్లో
c) ప్రబంధాల్లో
d) ఉప పురాణాల్లో
- View Answer
- సమాధానం: a
20) రాతిని శిల్పంగా చెక్కాడు. ఈ వాక్యంలో ఔపవిభక్తి ప్రత్యయం
a) ని
b) తి
c) గా
d) డు
- View Answer
- సమాధానం: b
21) మాంజా అనగా
a) గాలిపటం తోకపేరు
b) గాలిపటానికి ఉపయోగించే కాగితపు రకం
c) గాలిపటాలకు ఉపయోగించే ప్రత్యేక దారం పేరు
d) గాలిపటాలకు ఉపయోగించే బద్ద పేరు
- View Answer
- సమాధానం: c
22) “స్తంభం” అను పదానికి వికృతి
a) కంబం
b) ఖంబము
c) ఖంభం
d) తంభం
- View Answer
- సమాధానం: a
23) 'కవితలల్లిన క్రాంతహృదయుల గారవింపవే చెల్లెలా' అని అన్నది
a) రాయప్రోలు సుబ్బారావు
b) గురజాడ అప్పారావు
c) శ్రీశ్రీ
d) దేవులపల్లి కృష్ణశాస్త్రి
- View Answer
- సమాధానం: a
24) దేశము…కాపాడిన వీరులు.
ఖాళీలో సరిపడు విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి.
a) యొక్క
b) వలన
c) కంటే
d) ను
- View Answer
- సమాధానం: d
25) కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
ఎంత చదువు చదివి ఎన్ని విన్ననుగాని
హీనుడవ గుణంబు మానలేడు
బొగ్గుపాల గడుగ బోవునా మలినంబు
విశ్వదాభి రామ వినుర వేమ!
ఈ పద్యంలో వేమన చెప్పదలచినది
a) బొగ్గు పాలను శుభ్రపరుస్తుంది
b) హీనుడికి చదువు రాదు
c) అవగుణాలున్న వాడు ఎన్నటికీ మారడు
d) చదువుకు గుణానికి సంబంధం ఉంది
- View Answer
- సమాధానం: c
26) పంచారామాలలో ఒకటైన క్షీరారామానికి గల ఇంకొక పేరు
a) గునుపూడి
b) పాలకొల్లు
c) విజయవాడ
d) అమరావతి
- View Answer
- సమాధానం: b
27) ‘కమలాసనుడు’ అనే బిరుదున్న శతక రచయిత?
a) పాల్కురికి సోమన
b) వేమన
c) బద్దెన
d) ధూర్జటి
- View Answer
- సమాధానం: c
28) ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ వాక్యంలో అలంకారం
a) ఉపమాలంకారం
b) ఉత్ప్రేక్షాలంకారం
c) అర్థాంతరన్యాసాలంకారం
d) అతిశయోక్తి అలంకారం
- View Answer
- సమాధానం: d
29) తెలివితేటలకు పెద్దవాళ్ళూ, చిన్నవాళ్ళూ అనే తేడా లేదని నిరూపించిన కథ బాలతిమ్మరుసు. ఈ కథా రచయిత
a) వానమామలై వరదాచార్యులు
b) జంధ్యాల పాపయ్యశాస్త్రి
c) శిష్టా నరసింహం
d) దాశరథి కృష్ణమాచార్య
- View Answer
- సమాధానం: b
30) జానపద కళారూపాల్లో ఎంతో ప్రాచుర్యం పొందినది.
a) ప్రబంధం
b) నాటకం
c) బుర్రకథ
d) వేదాలు
- View Answer
- సమాధానం: c
31) జతపర్చండి.
(అ) వల వల (క) నడిచింది
(ఆ) గిలగిల (ఖ) ఏడ్చింది
(ఇ) చకచకా (గ) కొట్టుకుంది
a) అ - ఖ; ఆ - గ; ఇ - క
b) అ - గ; ఆ - ఖ; ఇ - క
c) అ - గ; ఆ - క; ఇ - క
d) అ - ఖ; ఆ - క; ఇ - గ
- View Answer
- సమాధానం: a
32) కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడదది యెట్లన్నన్
సప్పంబు పడగ నీడను
గప్పవసించిన విధంబు గదరా సుమతీ!
ఎటువంటి యజమాని దగ్గర పని చేయడం ప్రమాదకరం
a) మంచివాడు
b) ఎప్పుడూ తప్పులు వెదికేవాడు
c) ఆదరించేవాడు
d) తక్కువ జీతం ఇచ్చేవాడు
- View Answer
- సమాధానం: b
33) గానయోగ్యమై, రెండు పాదాలే కలిగి ఉండే జాతి పద్యం
a) ఉత్పలమాల
b) చంపకమాల
c) ఆటవెలది
d) ద్విపద
- View Answer
- సమాధానం: d
34) ‘స్వాతంత్య్రపు జెండా గేయం’లో ఉన్న ఇతి వృత్తం?
a) నైతిక విలువలు
b) దేశభక్తి
c) త్యాగ తత్వరత
d) మానవతా విలువలు
- View Answer
- సమాధానం: b
35) కింది వాటిలో మధురాంతకం రాజారాం రచన ఏది?
a) ఇక్కడ మేమంతా క్షేమం
b) ఇక్కడ మేమంతా క్షామం
c) కమ్మని తెమ్మరలు వీస్తున్నాయి
d) రేపటి ప్రపంచంలో సమస్యలు
- View Answer
- సమాధానం: b
36) కింది వానిలో సంభావనా పూర్వపద కర్మధారయ సమాసపదం
a) ఉరువజము
b) శిరీషపుష్పములు
c) తల్లిదండ్రులు
d) దశావతారాలు
- View Answer
- సమాధానం: b
37) ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో? ...
ఇటువంటి ప్రశ్నల రూపంలో కొనసాగుతూ అసంఖ్యాకమైన ఆలోచనలు రేకెత్తించిన గేయం పేరు
a) ప్రకటన
b) సీత ఇష్టాలు
c) ఆలోచనం
d) కూనలమ్మ పదాలు
- View Answer
- సమాధానం: c
38) అద్రీనదీ మహీజ లతికావలి. ఈ వాక్యంలో ‘మహీజము’ అనగా
a) ధనవంతుల యెడ ఉండునది - డబ్బు
b) అన్నాదులు దొంగిలించునది - ఎలుక
c) భూమి నుంచి పుట్టునది - చెట్టు
d) ఆకాశంలో సంచరించేది - గ్రద్ద
- View Answer
- సమాధానం: c
39) “వెచ్చని” పదం ఈ గణానికి చెందింది.
a) నగణము
b) సగణము
c) జగణము
d) భగణము
- View Answer
- సమాధానం: d
40) “తేనె జుంటీగలియ్యవా తెరువరులకు” అను పద్యపాదంలో 'తెరువరులు'
a) బాటసారులు
b) రైతులు
c) ఆటవికులు
d) దొంగలు
- View Answer
- సమాధానం: a
41) కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి
‘కందుకము వోలె సుజనుడు
క్రిందంబడి యడుగు మీదికిన్నెగయు జుమీ
మందుడు మృత్పిండమువలె
గ్రందంబడియుండు యడగి యుంచు గృపణత్వమునన్'
కిందపడినా పైకి ఎగసిపడేది.
a) మట్టిముద్ద
b) బంతి
c) గాజుగోళం
d) రాయి
- View Answer
- సమాధానం: b
42) 'నాన్న కాఫీ తాగుతూ పేపరు చదువుతున్నాడు. ఈ వాక్యం
a) శత్రర్థక వాక్యం
b) చేదర్థక వాక్యం
c) క్త్వార్థక వాక్యం
d) తుమున్నర్థక వాక్యం
- View Answer
- సమాధానం: a
43) ‘నేను ఆ గ్రంథాన్ని ఆద్యంతం చదివాను’ ‘ఆద్యంతం’ అనే పదంలో ఉన్న సం«ధి?
a) గుణసంధి
b) యణాదేశ సంధి
c) త్రిక సంధి
d) వృద్ధి సంధి
- View Answer
- సమాధానం: b
44) మన చరిత్ర, సంస్కృతులను ప్రతిబింబించే ప్రాచీన కట్టడాల ప్రాధాన్యతను గుర్తించి పరిరక్షించుకోల్సిన ఆవశ్యకతను తెలియజేసే నేపథ్యం గల పాఠ్యాంశం.
a) సందేశం
b) అజంతా చిత్రాలు
c) అమ్మకోసం
d) హరిశ్చంద్రుడు
- View Answer
- సమాధానం: b
45) 'ధర' కు సరైన వ్యుత్పత్యర్థం
a) వెలకలది
b) సమస్తమును ధరించేది.
c) ధరణియైనది
d) భూమిని ధరించేది
- View Answer
- సమాధానం: b
46) “ఆ ఏనుగు నడిచే కొండా! అన్నట్టు ఉంది' - ఈ వాక్యంలోని అలంకారం
a) ఉపమాలంకారం
b) ఉత్ప్రేక్షాలంకారం
c) స్వభావోక్తి అలంకారం
d) అర్థాంతరన్యాస అలంకారం
- View Answer
- సమాధానం: b
47) ‘ప్రకటన’ పాఠ్యభాగంలో ఇతివృత్తం ఏమిటి?
a) ప్రచారం
b) ఆధ్యాత్మిక విలువలు
c) శాంతి
d) దేశభక్తి
- View Answer
- సమాధానం: c
48) వినోబాభావే భూదాన ఉద్యమాన్ని చేపట్టడానికి కారణం
a) భూమిని అందరికీ పంచాలనే సదాశయం
b) భూమి ప్రకృతి భాగం దాన్ని పూజించాలని
c) భూమిని కాలుష్య రహితం చేయడానికి
d) భూములు సంపాదించి ఆంగ్ల ప్రభుత్వానికి ఇవ్వడంకోసం
- View Answer
- సమాధానం: a
49) తెలుగుతల్లి తోటలోని
వెలుగులీను పువ్వులం
జగమంతా పరిమళాలు
ఎగజిమ్మే పువ్వులం... ఈ గేయ ఖండికలు ఈ పాఠ్య భాగం లోనివి
a) వర్షాలు
b) మా తెలుగు తల్లికి
c) తొలకరి చిరుజల్లులు
d) ఏమవుతుందో
- View Answer
- సమాధానం: c
50) “చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా”. అను పై పద్యపాదంలో ఛందోనియమాల ప్రకారం 'చదువు' అనేది
a) నగణం
b) మగణం
c) సగణం
d) భగణం
- View Answer
- సమాధానం: c