AP TET 2021: Telugu Practice Test-5
1) కింది వాక్యాల్లో ఉత్ర్పేక్షాలంకారం గల వాక్యం
a) పిల్లలు కోతుల్లా గెంతుతున్నారు.
b) మా చెల్లాయి పాడుతుంటే సరస్వతీదేవి దిగివచ్చిందేమో అన్నట్టుంటుంది.
c) మా అన్నయ్య క్రికెట్ బ్యాట్ పట్టాడంటే సచినే!
d) మా అమ్మాయి నవ్వినప్పుడల్లా మాఇంట్లో వెలుతురు చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు
- View Answer
- సమాధానం: b
2) సి. నారాయణరెడ్డి గారికి జ్ఞానపీఠ పురస్కారం తెచ్చి పెట్టిన గ్రంథం
a) శ్రీమద్రామాయణ కల్పవృక్షం
b) మహా ప్రస్థానం
c) విశ్వంభర
d) పాకుడురాళ్ళు
- View Answer
- సమాధానం: c
3) ప్రజాచైతన్యంలో కీలకపాత్ర పోషించిన కళారూపం
a) ప్రబంధం
b) శాసనం
c) పురాణం
d) బుర్రకధ
- View Answer
- సమాధానం: d
4) ఈకింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
ఏ భాషలోనైనా ప్రశ్నార్థక వాక్యాలను రెండు రకాలుగా విభజించవచ్చు. అవి విషయా పేక్షక ప్రశ్నలు, విషయనిరర్థక ప్రశ్నలు. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎట్లా, ఏమిటి మొదలైన ప్రశ్నార్థక శబ్దాలతో వచ్చేవి విషయా పేక్షక ప్రశ్నలు. ఆ అనే శబ్దాంతంగా వచ్చేవి విషయనిరర్థక ప్రశ్నలు. మొదటిరకం ప్రశ్నలకు సమాధానంగా నూతన విషయ బోధక పదాలు, వాక్యాలు సమాధానాలుగా ఆపేక్షితాలు. రెండోరకం ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే అవును, కాదు అనే పదాలతో వ్యక్తం చెయ్యవచ్చు. శ్రోతకు సమాధానాలు తెలియనప్పుడు ఏ ప్రశ్నకైనా ఏమో అనే శబ్దం సమాధానంగా ఇయ్యవచ్చు. అంటే ఏమో అనే శబ్దాన్ని ఒక వ్యవహర్త సమాధానంగా వాడితే అడగబడిన ప్రశ్నకు సమాధానం తెలీదు అని చెప్పడం అతని ఉద్దేశంగా మనం గ్రహించవచ్చు.
కింది వానిలో విషయా పేక్షక ప్రశ్న
a) పరీక్ష ఎవరు రాస్తున్నారు?
b) నువ్వు అన్నం తిన్నావా?
c) మీది ఈ ఊరేనా?
d) నీవు ఈ పుస్తకం చదివావా?
- View Answer
- సమాధానం: a
5) వ్యాప్తి గావింపమనుటో యీ వసుధ పైన. ఈ వాక్యంలో “వసుధ' పదానికి పర్యాయపదాలు
a) పని, కార్యం
b) భూమి, ధరణి
c) పూవు, వీరి
d) చెట్టు, వృక్షం
- View Answer
- సమాధానం: b
6) కింది వాక్యానికి సరైన ప్రశ్నార్థక వాక్యాన్ని గుర్తించండి
“అవ్వ శిష్యులకు సూదిని ఇచ్చింది”
a) అవ్వకు శిష్యులు ఏమిచ్చారు?
b) అప్ప శిష్యులకు ఏమిచ్చింది?
c) అప్పకు సూదిని ఎవరిచ్చారు?
d) సూదిని అవ్వకు ఇచ్చిందెవరు?
- View Answer
- సమాధానం: b
7) కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
మాత్సర్య మొదవు సత్యము
హృత్సరసీజమున లేమి నెల్లప్పుడుఁదా
సత్సేవయందు దిరిగిన
మాత్సర్య మణంగు దెలిసి మనుము కుమారీ!
ద్వేష భావం నశించాలంటే
a) మాత్సర్యంతో మెలగాలి
b) అసత్యము పలకాలి.
c) మంచి గుణాలతో మెలగాలీ
d) సత్సేవ చేయరాదు
- View Answer
- సమాధానం: c
8) నరకంలో హరిశ్చంద్రుడు'' నాటక రచయిత
a) సి. నారాయణరెడ్డి
b) నండూరి రామమోహనరావు
c) నార్ల వేంకటేశ్వరరావు
d) యస్. టి. జ్ఞానానంద కవి
- View Answer
- సమాధానం: c
9) కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
శ్రీనాథుడు భీమఖండం గురించి ఆశ్వాసాంతగద్యాల్లో
‘భీమేశ్వరపురాణం'గా సూచించినా “ప్రబంధం”గానే పేర్కొన్నాడు. శ్రీ పింగళి
లక్ష్మీకాంతంగారు భీమఖండం గురించి పరామర్శిస్తూ “ప్రబంధమున నుండ
దగిన అష్టాదశవర్ణనలలో కొన్నింటికి అవకాశం కల్పించి, ఈ ఉపపురాణమును
ప్రబంధప్రాయకముగా సంతరించెనని తోచును” అని కృతి రచనా తత్త్యం
ఉటంకించారు.
అమ్మవారిని సిరిమాను పై ఊరేగిస్తూ సిరిమాను ఉత్సవం నిర్వహించే జిల్లాలు
a) కృష్ణా, గుంటూరు
b) ప్రకాశం, నెల్లూరు
c) నెల్లూరు, కడప
d) శ్రీకాకుళం, విజయనగరం
- View Answer
- సమాధానం: d
10) కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి
‘కందుకము వోలె సుజనుడు
క్రిందంబడి యడుగు మీదికిన్నెగయు జుమీ
మందుడు మృత్పిండమువలె
గ్రందంబడియుండు యడగి యుంచు గృపణత్వమునన్'
మందబుద్దిగలవానిని కవి దీనితో పోల్చాడు
a) వజ్రము
b) బంగారము
c) మట్టిముద్ద
d) రత్నము
- View Answer
- సమాధానం: c
11) వారిజాప్తుడు దూర్పు వంక గ్రుంకినను.
ఈ వాక్యంలో వారిజాప్తుడు అనగా
a) ప్రాణులకు ఆప్తుడు - యమధర్మరాజు
b) ఆకాశానికి ఆప్తుడు - పక్షి
c) నావికులచే తరింపజేయునది - చుక్క
d) పద్మములకు ఆప్తుడు - సూర్యుడు
- View Answer
- సమాధానం: d
12) బాలగంగాధర్ తిలక్ వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభించడానికి గల ప్రధాన ఆశయం
a) ఆధ్యాత్మిక ఐక్యత
b) జాతీయసమైక్యత
c) ఉత్సవాలకు భారీవిగ్రహాల ఏర్పాటు
d) సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు
- View Answer
- సమాధానం: b
13) బెంగాల్లో జరిగే దసరా ఉత్సవాలు
a) వినాయక నవరాత్రులు
b) సంవత్సరోత్సవాలు
c) శారదోత్సవాలు
d) వసంతోత్సవాలు
- View Answer
- సమాధానం: c
14) "ప్రత్యహం” పదాన్ని విడదీయగా వచ్చిన రూపం
a) ప్రత్య + అహం
b) ప్రత్ + యహం
c) ప్రత్య + హమ్
d) ప్రతి + అహం
- View Answer
- సమాధానం: d
15) భారతి, సుధాత్రి, అమ్మ, మామయ్య పాత్రలున్న పాఠ్యభాగం ఏది?
a) నిజం– నిజం
b) చారిత్రక వీర గాథలు
c) మన భాషలు
d) మేము సైతం
- View Answer
- సమాధానం: c
16) హరిశ్చంద్రోపాఖ్యానం రచించినది
a) గౌరన
b) మంచన
c) వేమన
d) తిమ్మన
- View Answer
- సమాధానం: a
17) దేవునికి పుష్పాలను అర్పిస్తాము.
ఈ వాక్యంలో “పుష్పాలు” అనే పదానికి పర్యాయపదాలు
a) విరులు, పత్రాలు
b) పత్రాలు, దళాలు
c) సుమాలు, వీరులు
d) నదులు, రురులు
- View Answer
- సమాధానం: c
18) కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ ఊల్లోకి వెళ్ళారు. గీత గీసిన పదం
a) క్యార్థకం
b) శత్రర్థకం
c) తుమున్నర్థకం
d) భావార్థకం
- View Answer
- సమాధానం: b
19) 'భృంగారం' అను మాటకు వికృతి
a) భారం
b) భంగారం
c) బొంగరం
d) బంగారం
- View Answer
- సమాధానం: d
20) కర్తరి వాక్యంలో కర్మకు చేరే విభక్తి ప్రత్యయం
a) ప్రధమా విభక్తి
b) ద్వితీయా విభక్తి
c) తృతీయా విభక్తి
d) చతుర్థి విభక్తి
- View Answer
- సమాధానం: b
21) కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
గురజాడ కన్యాశుల్కం తరువాత సాంఘిక రాజకీయ ప్రయోజనాలు ఉద్దేశించిన మహాగ్రంథం ఉన్నవ లక్ష్మీనారాయణ అనే జాతీయోద్యమ నాయకుడు రచించిన 'సంగవిజయం' నవల. వచనంలో వచ్చిన మొట్టమొదటి అభ్యుదయ రచన ఇది. ఆ నవలను ప్రజలు అభిమానించినందుకు బ్రిటీష్ ప్రభుత్వం దానిని నిషేధించింది. మాగ్జింగోర్కీ అమ్మకు ధీటైన నవల ఇది.
“సంగవిజయం', కన్యాశుల్కం గ్రంథాల మధ్యగల సామ్యం
a) ప్రభుత్వంచే నిషేదించబడడం
b) రెండూ నాటికలు
c) సామాజిక, రాజకీయ అభ్యుదయ రచనలు
d) రెండూ నవలలు
- View Answer
- సమాధానం: c
22) కింది ప్రకృతి - వికృతులను జతపర్చండి.
(అ) స్నేహం (య) రాతిరి
(ఆ) రాత్రి (ర) ఆకసం
(ఇ) ఆకాశం (ల) నెయ్యము
a) అ - య; ఆ - ర; ఇ – ల
b) అ - ల; ఆ - య; ఇ - ర
c) అ - ర; ఆ - య; ఇ - ల
d) ఆ - ర; అ - ల; ఇ – య
- View Answer
- సమాధానం: b
23) గురువు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టినందున రవి చెడిపోయాడు.
ఈవాక్యంలో “పెడచెవిన పెట్టు” జాతీయానికి అర్థం
a) విని ఆచరించడం
b) పూర్తిగా మునిగిపోవడం
c) చెప్పుచేతల్లో నడవడం
d) పట్టించుకోకపోవడం
- View Answer
- సమాధానం: d
24) “కష్టజీవులకు కర్మవీరులకు
నిత్యమంగళం నిర్దేశిస్తూ
స్వస్తివాక్యములు సంధానిస్తూ
స్వర్ణవాద్యములు సంరావిస్తూ
... జగత్తుకంతా చవులిస్తానోయ్”
పై గేయపాదాలు ఉన్న పుస్తకం
a) మహాప్రస్థానం
b) మరోప్రస్థానం
c) ఖడ్గసృష్టి
d) కార్టూను కవితలు
- View Answer
- సమాధానం: a
25) 'హరిశ్చంద్రుడు విద్యాధికుడు' ఈ వాక్యంలో గీతగీసిన పదం ఏ సమాసం
a) చతుర్థీ తత్పురుష సమాసం
b) ద్వితీయా తత్పురుష సమాసం
c) పంచమీ తత్పురుష సమాసం
d) తృతీయాతత్పురుష సమాసం
- View Answer
- సమాధానం: d
26) 'విజ్ఞానము' - వికృతి పదం
a) జ్ఞానం
b) జ్ఞప్తి
c) విన్నాణము
d) విజ్ఞత
- View Answer
- సమాధానం: c
27) రామయ్య “గొర్రెతోక” ఆదాయంతో జీవితాన్ని భారంగా గడిపేవాడు.
“గొర్రెతోక” జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు
a) అమితంగా పెరిగేది
b) అసలు లేనిది
c) ఎక్కువగా పెరిగేది
d) ఎదుగుదల లేనిది
- View Answer
- సమాధానం: d
28) ‘హరించి ఇచ్చునది’ అనే వ్యుత్పత్తి ఉన్న పదం?
a) ఎద
b) హరిణి
c) హృదయం
d) హర్మ్యం
- View Answer
- సమాధానం: c
29) “కర్ణం” అను పదానికి ప్రకృతి
a) కారణం
b) కార్యం
c) క్షామం
d) కరణం
- View Answer
- సమాధానం: b
30) ‘కొలనుదేవరకు గొబ్బియల్లో
యదుకులస్వామికి గొబ్బియల్లో
కొండ గొడుగుగా గోవులు కాచిన
కొండొక శిశువుకు గొబ్బియల్లో'' అంటూ గొబ్బిప్రస్తావన తెచ్చిన వాగ్గేయకారుడు.
a) దేవులపల్లి కృష్ణశాస్త్రి
b) గద్దర్
c) అన్నమయ్య
d) వేదుల సత్యనారాయణమూర్తి
- View Answer
- సమాధానం: c
31) వేరు పురుగు వేరును తొలుస్తుంది.
ఈ వాక్యంలో ద్వితీయా విభక్తి ప్రత్యయం.
a) గు
b) లు
c) ది
d) ను
- View Answer
- సమాధానం: d
32) కుంతీదేవి చేతి నుండి పిల్లవాడు నేలమీద పడగానే ఆమె “అయ్యో!” అని అరచింది. ఈ వాక్యంలో అయ్యో అనేది ఈ భాషాభాగం
a) సర్వనామం
b) విశేషణం
c) క్రియ
d) అవ్యయం
- View Answer
- సమాధానం: d
33) సాయంకాలం వేళ చిన్నపిల్లల్ని బాగా సింగారించి వారినెత్తి మీద రేగుపండ్లు పోసి వేడుకగా నిర్వహించే పండుగ రోజు
a) సంక్రాంతి
b) కనుమ
c) భోగి
d) ముక్కనుమ
- View Answer
- సమాధానం: c
34) గాంధీగారి జీవితం పై చెరగని ముద్రవేసిన నాటకాలు
a) చింతామణి, వరవిక్రయం
b) చింతామణి, పాండవోద్యోగ విజయాలు
c) సత్యహరిశ్చంద్ర, శ్రవణకుమార చరిత్ర
d) లవకుశ, కన్యాశుల్కం
- View Answer
- సమాధానం: c
35) నిలిచి నీళ్ళు త్రాగ నీరుకాలు బ్రతుకు పరుగులెత్తవోయి పాలు త్రాగ.' ఈ పద్యపాదంలో ఉన్న జాతీయం
a) పరుగెత్తి పాలుతాగాలి
b) పరుగెత్తి పాలుతాగరాదు
c) పరిగెత్తాలంటే పాలుతాగాలి
d) నీరు తాగాలంటే పరుగెత్తాలి
- View Answer
- సమాధానం: b
36) “నూర్పిడి, కలుపు, ధాన్యం, నాట్లు” పదాలను వరుసక్రమంగా అమర్చిన వాటిలో సరైనది గుర్తించండి
a) కలుపు, నూర్పిడి, ధాన్యం, నాట్లు
b) నాట్లు, కలుపు, నూర్పిడి, ధాన్యం
c) నాట్లు, ధాన్యం, కలుపు, నూర్పిడి,
d) నాట్లు, నూర్పిడి, ధాన్యం, కలుపు
- View Answer
- సమాధానం: b
37) “అన్నం దేవుడన్నమాట. మరి నువ్వేమో రోజూ అన్నాన్ని వదిలేస్తూ పారేస్తూ నిర్లక్ష్యం చేశావు” అని అన్నది
a) తండ్రి
b) ఉపాధ్యాయుడు
c) అమ్మ
d) రైతు
- View Answer
- సమాధానం: c
38) 'ఊరూరు' - సంధి నామం
a) గుణసంధి
b) ఇకారసంధి
c) సవర్ణదీర్ఘ సంధి
d) ఆమేడితసంధి
- View Answer
- సమాధానం: d
39) “చిటారు కొమ్మన మిఠాయి పొట్లం' అనే పొడుపుకు విడుపు
a) పండు
b) తేనెపట్టు
c) గాలిపటం
d) పక్షి
- View Answer
- సమాధానం: b
40) బుద్ధిహీనుడు - అను సమాసమునకు విగ్రహవాక్యం
a) బుద్ధి నందు హీనుడు
b) బుద్ది కొరకు హీనుడు
c) బుద్ది యొక్క హీనుడు
d) బుద్ది చేత హీనుడు
- View Answer
- సమాధానం: d
41) 'బాల్యక్రీడలు' పాఠం ఆంధ్రమహాభాగవతంలోని ఈ స్కంధంలోనిది
a) అష్టమి
b) నవమ
c) దశమ
d) ఏకాదశ
- View Answer
- సమాధానం: c
42) 'తలుపు గొళ్ళెం
హారతి పళ్ళెం
గుజ్జపు కళ్ళెం' - ఈ వాక్యంలోని అలంకారం
a) అంత్యానుప్రాసము
b) ఛేకానుప్రాసము
c) వృత్త్యనుప్రాసము
d) లాటానుప్రాసము
- View Answer
- సమాధానం: a
43) ‘కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు’ అనే బిరుదులున్న కవి?
a) తిక్కన
b) పోతన
c) నన్నయ
d) శ్రీనాథుడు
- View Answer
- సమాధానం: a
44) 'విద్యార్థి సమాజానికి మేలుచేసి కీర్తి సంపాదించుకోవాలి
పై వాక్యంలోని “కీర్తి” అనే పదానికి వికృతి పదం
a) హారతి
b) కృతి
c) ఖ్యాతి
d) కీరితి
- View Answer
- సమాధానం: d
45) లయకు ప్రాధాన్యమిస్తూ మాత్రాఛందస్సులో సాగే రచన.
a) ప్రబంధం
b) వ్యాసం
c) నాటిక
d) గీతం
- View Answer
- సమాధానం: d
46) కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడదది యెట్లన్నన్
సప్పంబు పడగ నీడను
గప్పవసించిన విధంబు గదరా సుమతీ!
సప్పంబు అనగా
a) పాము
b) ముంగిస
c) పులి
d) ఉడుము
- View Answer
- సమాధానం: a
47) “వర్షం” అను పదానికి నానార్థాలు
a) వాన, జల్లు
b) చేయి, వాన
c) సోన, జడి
d) సంవత్సరం, వాన
- View Answer
- సమాధానం: d
48) కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
ఖండితంబయ్యు భూజంబు వెండి మొలచు
క్షీణుడయ్యును నభివృద్ధి జెందుసోము
డివ్విధమున విచారించి యెడల దెగిన
జనములకు దాపమొందరు సాధుజనులు
క్షీణించినా తిరిగి పుంజుకొనేది
a) సూర్యుడు
b) చంద్రుడు
c) ఆకాశం
d) నక్షత్రం
- View Answer
- సమాధానం: b
49) కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
సాహిత్యం అంటే అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన మహాకావ్యాలలో గాథా సప్తశతి ఒకటి. హాలసిరి శాతకర్ణి అనే శాతవాహనరాజు, అనేక ప్రాకృత కవులు రచించిన పద్యాలను సేకరించి, సంకలించి ఈ పేరుతో క్రీ.శ. మొదటి శతాబ్దం ప్రధమ దశకంలో ఈ మహాకావ్యాన్ని లోకానికి అందించాడు.
మహాకావ్యం అనే పదానికి విగ్రహవాక్యం
a) గొప్పదైన కావ్యం
b) కావ్యముచేత గొప్ప
c) మహాయును, కావ్యమును
d) గొప్పదనము వంటి కావ్యము
- View Answer
- సమాధానం: a
50) కింది వాటిలో హేత్వర్థక వాక్యం ఏది?
a) నీవు పరీక్ష రాయవద్దు
b) దయ చేసి మాట్లాడకండి
c) పుజారి గుళ్లో పూజలు చేస్తాడు
d) వర్షాలు లేక పంటలు పండటం లేదు
- View Answer
- సమాధానం: d