AP TET Telugu Practice Test
1. “నిష్ప్రయోజనం” అనే అర్థంలో ఉపయోగించే జాతీయం
a) బుద్ధిగడ్డితిను
b) అడవికాచిన వెన్నెల
c) వెన్నతో పెట్టిన విద్య
d) గుండె కరుగు
- View Answer
- సమాధానం: b
2. “వసుధ” అను పదానికి గల పర్యాయపదాలు
a) ధర, వెల
b) భూమి, పుడమి
c) మిన్ను, ఆకాశం
d) నది, ఝరి
- View Answer
- సమాధానం: b
3. ప్రతిమలు' - అను పదానికి గురులఘువులు గుర్తించగా ఏర్పడే గణం
a) నగ
b) నగణం
c) నల
d) సగణం
- View Answer
- సమాధానం: c
4. “పంజరం నాకేల? పసిడి నాకేల? ,
పచ్చపచ్చని చెట్లు - పండ్లు కావాలి'' అన్నది
a) బాలలు
b) చేట్లు
c) చిలుక
d) కొమ్మలు
- View Answer
- సమాధానం: c
5. “ముద్దుముద్దుగా మాట్లాడడం” అనే అర్థం కలిగిన జాతీయం
a) చిలుక పలుకులు
b) వాగుడుకాయ
c) మాటకారి
d) ఎగతాళి
- View Answer
- సమాధానం: a
Instruction: ఈకింది పద్యం చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
చదువు మట్టుపడును సంస్కృతి చెడిపోవు
సంపదలు తొలంగుసౌఖ్యముడుగు
గౌరవంబువోవు, గావున సోమరి
తనము కన్న హీన గుణము గలదే.
6) “గౌరవంబువోవు” అను పదానికి విడదీసిన రూపం
a) గౌరవంబు + వోవు
b) గౌరవము + పోవు
c) గౌరవంబు + పోవు
d) గౌరవంబు + పూవు
- View Answer
- సమాధానం: c
7. "భ్రమరం” అనగా అర్థం
a) నెమలి
b) తుమ్మెద
c) కోకిల
d) చక్రవాకం
- View Answer
- సమాధానం: b
8. “సంపద' అనే పదంలో గురు లఘువులు మరియు గణము
a) UUU - మగణము
b) IUI - జగణము
c) UIU - రగణము
d) UII – భగణము
- View Answer
- సమాధానం: d
9. అర్థవంతమైన రెండు పదాలు కలిసి, ఒకే పదంగా ఏర్పడితే అది
a) అలంకారం
b) ఛందస్సు
c) విమర్శ
d) సమాసం
- View Answer
- సమాధానం: d
Instruction: కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
ధనపతి సఖుడైయుండియు
నెనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్
తనవారికెంత గలిగిన
తన భాగ్యమె తనకుగాక తథ్యము సుమతీ!
10) పై పద్యంలో భిక్షమెత్తేవాడు
a) శివుడు
b) ధనపతి
c) స్నేహితుడు
d) సుమతి
- View Answer
- సమాధానం: a
Instruction: ఈకింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
ఏ భాషలోనైనా ప్రశ్నార్థక వాక్యాలను రెండు రకాలుగా విభజించవచ్చు. అవి విషయాపేక్షక ప్రశ్నలు, విషయనిరర్థక ప్రశ్నలు. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎట్లా, ఏమిటి మొదలైన ప్రశ్నార్థక శబ్దాలతో వచ్చేవి విషయాపేక్షక ప్రశ్నలు. ఆ అనే శబ్దాంతంగా వచ్చేవి విషయనిరర్థక ప్రశ్నలు. మొదటిరకం ప్రశ్నలకు సమాధానంగా నూతన విషయ బోధక పదాలు, వాక్యాలు సమాధానాలుగా ఆపేక్షితాలు. రెండోరకం ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే అవును, కాదు అనే పదాలతో వ్యక్తం చెయ్యవచ్చు. శ్రోతకు సమాధానాలు తెలియనప్పుడు ఏ ప్రశ్నకైనా ఏమో అనే శబ్దం సమాధానంగా ఇయ్యవచ్చు. అంటే ఏమో అనే శబ్దాన్ని ఒక వ్యవహర్త సమాధానంగా వాడితే అడగబడిన ప్రశ్నకు సమాధానం తెలీదు అని చెప్పడం అతని ఉద్దేశంగా మనం గ్రహించవచ్చు.
11) విషయ నిరర్థక ప్రశ్నకు సంబంధించిన సత్యాలు
(అ) ఈ ప్రశ్నలకు అవును, కాదు అనేవి సమాధానాలుగా చెప్పవచ్చు.
(ఆ)ఈ ప్రశ్నలకు నూతన బోధక పదాలు, వాక్యాలు సమాధానాలుగా ఆపేక్షితాలు.
(ఇ) ఆ శబ్దాంతంగా ఈ ప్రశ్నలు వస్తాయి
a) అ, ఆ, ఇ
b) అ, ఆ
c) అ, ఇ
d) ఆ, ఇ
- View Answer
- సమాధానం: c
12. “చినుకు నేల రాలకుండా
మబ్బులోనే దాగివుంటే
ఎలా ఉంటుందో చెప్పండి
ఏమవుతుందో చెప్పండి....'
ఈ గేయ పంక్తులు గల నాళం కృష్ణారావుగారి రచన
a) మహాత్ముడు
b) గోరుముద్దలు
c) వెన్నెల కుప్పలు
d) మా ఆటలు
- View Answer
- సమాధానం: b
13. తెలుగు కవయిత్రులలో మొదటగా రామాయణం రాసిందీ
a) తాళ్ళపాక తిమ్మక్క
b) ఆతుకూరి మొల్ల
c) ముద్దు పళని
d) పసుపులేటి రంగాజమ్మ
- View Answer
- సమాధానం: b
కొడవటిగంటి కుటుంబరావు “చదువు” నవల 1952లో పుస్తక రూపంలో వచ్చింది. అంతకుముందు ఆంధ్రజ్యోతి మాసపత్రికలో ధారావాహికగా వచ్చింది. ఈ నవలలో రచయిత “విద్య అంటే జ్ఞానం సంపాదించడం. జ్ఞానం రెండు రకాలు. పుస్తక జ్ఞానమూ, అనుభవ జ్ఞానమూ, ఈ రెండు రకాల జ్ఞానాలూ విద్య ద్వారా లభ్యంకావాలి” అన్నారు.
14) పుస్తక రూపంలో రాకముందు 'చదువు' నవల మొదటగా ధారావాహికంగా ప్రచురితమైన పత్రిక
a) ఆంధ్రజ్యోతి దినపత్రిక
b) ఆంధ్రజ్యోతి మాసపత్రిక
c) ఆంధ్రజ్యోతి వారపత్రిక
d) ఆంధ్రప్రభ మాసపత్రిక
- View Answer
- సమాధానం: b
15. కింది వాటిలో శబ్ద పల్లవానికి ఉదాహరణ
a) మేలుకొను
b) అర్చన
c) అన్నం తిన్నాడు
d) ధర్మం పాటించాడు
- View Answer
- సమాధానం: a
16. నిఖిల్ వాళ్ళ పెద్దమ్మతో ఊరికి వెళ్ళాడు.
పై వాక్యంలో తృతీయా విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి.
a) ళ్ళ
b) తో
c) కి
d) డు
- View Answer
- సమాధానం: b
17. 'ఆయుధపూజు' ఈ పండుగరోజు చేస్తారు
a) సంక్రాంతి
b) ఉగాది
c) విజయదశమి
d) వినాయకచవితి
- View Answer
- సమాధానం: c
18. ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ అనేవి
a) మహా ప్రాణాలు
b) అల్పప్రాణాలు
c) సరళాలు
d) పరుషాలు
- View Answer
- సమాధానం: a
19. “మొసలి కన్నీరు' జాతీయాన్ని ఈ అర్థంలో ప్రయోగిస్తారు
a) ప్రయోజనం గలది.
b) అనుభవం సంపాదించు
c) తెలివితక్కువ
d) లేని బాధను నటించడం
- View Answer
- సమాధానం: d
20. వలీలు చనిపోయిన రోజున ప్రతి సంవత్సరం జరుపుకునే ఉత్సవం
a) ఉరుసు
b) మిలాడినబి
c) బక్రీద్
d) రంజాన్
- View Answer
- సమాధానం: a
21. ఆ పండితులు చతుర్వేదాలు చదివారు
పై వాక్యంలో "చతుర్వేదాలు” సమాసం పేరు
a) ద్విగుసమాసం
b) ద్వంద్వసమాసం
c) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
d) విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
- View Answer
- సమాధానం: a
22. కూరిమి గల దినములలో
నేరము లెన్నడునుగలుగనేరవు, మఱియా
........ తరువాత వచ్చే పద్యపాదం గుర్తించండి.
a) కూరిమి విరసంబైనను
b) తెప్పలుగ చెరువు నిండిన
c) బాధ వెనుక సుఖము బహుళమై చెలగురా
d) బొగ్గు పాల కడుగపోవునామలినంబు
- View Answer
- సమాధానం: a
23. “పరుల తెగడుటవల్ల
బలిమి పొగడుటవల్ల
కీర్తివచ్చుట కల్ల"
అను కూనలమ్మ పదాలు తెలుపు విలువలు
a) దేశభక్తి విలువలు
b) సంస్కృతీ విలువలు
c) నైతిక విలువలు
d) సృజనాత్మక విలువలు
- View Answer
- సమాధానం: c
24. శార్దూలం పద్య పాదానికి గణాలు ఏవి?
a) భ, ర, న, భ, భ, ర, వ
b) స, భ, ర, న, మ, య, వ
c) మ, స, జ, స, త, త, గ
d) న, జ, భ, జ, జ, జ, ర
- View Answer
- సమాధానం: c
25. భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు ఉండే పద్యం
a) ఉత్పలమాల
b) ఆటవెలది
c) చంపకమాల
d) మత్తేభం
- View Answer
- సమాధానం: a
26. “మాతృణం” అను పదాన్ని విడదీసిన రూపం
a) మాత్రు + రుణం
b) మాతృ + బుణం
c) మాతృ + రుణం
d) మాతృ + ఋణం
- View Answer
- సమాధానం: d
Instruction: కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
ఖండితంబయ్యుభూజంబు వెండి మొలచు
క్షీణుడయ్యునునభివృద్ధిజెందుసోము
డివ్విధమున విచారించి యెడలదెగిన
జనములకు దాపమొందరుసాధుజనులు
27) భూజంబుఅనగా...
a) భవనం
b) భుజనం
c) చెట్టు
d) భజన
- View Answer
- సమాధానం: c
28. Instruction: కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
ఆర్య, ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన మరికొన్ని భారతీయ భాషల్లో కూడా సాహిత్యం వెలసింది. ముండారీ భాషకు నాగరీ లిపిలో, సంతాలీ, ఖాసీ భాషలకు బెంగాలీ లిపిలో సాహిత్యం ఏర్పడింది. సవర భాషకు గిడుగు వెంకట రామ్మూర్తిగారు రోమన్ లిపిలో కొంత సాహిత్యం సృష్టించారు. లేప్చా భాషలో టిబెటన్ లిపి భేదంతో వస్తున్న సాహిత్యం ఏనాడు మొదలయిందో తెలీదు.
సాహిత్యం వెలసింది. 'వెలయుట ' అనగా
a) ముగించుట
b) పుట్టుట
c) వచ్చుట
d) నిలుచుట
- View Answer
- సమాధానం: d
Instruction: కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
ఎంత చదువు చదివి ఎన్ని విన్ననుగాని
హీనుడవగుణంబు మానలేడు
బొగ్గుపాలగడుగబోవునామలినంబు
విశ్వదాభి రామ వినురవేమ!
29) పై పద్యంలో కవి హీనుని దేనితో పోల్చాడు
a) పాలతో
b) సద్గుణరాశితో
c) బొగ్గుతో
d) మణితో
- View Answer
- సమాధానం: c
Instruction: కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి
రోషావేశము జనులకు
దోషము తలపోయ విపుల దుఃఖకరమునౌ
రోషము విడిచిన యెడ సం
తోషింతురు బుధులు హితము దోప కుమారా!
30) జనులకు పాపాన్ని కలిగించేవి
a) విపుల దుఃఖకరములు
b) బుధులు, హితులు
c) రోషావేశాలు
d) రోష దుఃఖాలు
- View Answer
- సమాధానం: c
31. ‘పరుల తెగుడుట వల్ల/ బలిమి పొగుడుట వల్ల కీర్తివచ్చుట కల్ల’ అనే ఆరుద్ర ‘కూనలమ్మ పదాలు’ తెలియజేసే విలువలు?
a) సంస్కృతి విలువలు
b) దేశభక్తి విలువలు
c) నైతిక విలువలు
d) సృజనాత్మక విలువలు
- View Answer
- సమాధానం: c
32. ఏపనినైనా ప్రారంభించిన వెంటనే ఆటంకాలు ఎదురైతే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు,
a) మొసలి కన్నీరు
b) పాపంపండు
c) కాలు కాలినపిల్లి
d) ఆదిలోనే హంసపాదు
- View Answer
- సమాధానం: d
33. “దెబ్బతీసే అవకాశం కోసం ఎదురుచూడటం” అనే అర్థం వచ్చే జాతీయం
a) కాలుగాలిన పిల్లి
b) కడుపులో నీరు కదలకుండా
c) ఆటకట్టు చేయు
d) గోతికాడ నక్క
- View Answer
- సమాధానం: d
34. "భాషాన్నత్యం” పదాన్ని విడదీయగా వచ్చిన రూపం
a) భాష + ఉన్నత్యం
b) భాష + ఔన్నత్యం
c) భాష్ + ఉన్నత్యం
d) భాషాన్ + అత్యం
- View Answer
- సమాధానం: b
35. దాంపత్య జీవితాన్ని ఆహ్లాదకరంగా, చమత్కార సంపన్నంగా చిత్రించిన 'కాంతం' పాత్ర సృష్టికర్త
a) నండూరి సుబ్బారావు
b) కొడవటిగంటి కుటుంబరావు
c) మునిమాణిక్యం నరసింహారావు
d) గల్లా చలపతి
- View Answer
- సమాధానం: c
తిమ్మనకు ఒక ప్రత్యేక శైలి ఉంది. లలితలలితములైన పదముల కూర్పులో ఒక శ్రావ్యతను సాధించాడు. ఉపమా, ఉత్ర్పేక్ష అలంకారాలు రెండూ తిమ్మనకు ఇష్టం. స్వభావోక్తి తిమ్మన వాక్కులో మనోహర నృత్యం చేస్తుందంటే అతిశయోక్తికాదు. ఛందస్సును గమనిస్తే వృత్తాలు, జాత్యుపజాతులుసర్వసాధారణమైనవే కథా గమనానికి వాడారు.
a) స్వభావోక్తి, అతిశయోక్తి
b) ఉపమా, ఉత్ర్పేక్ష
c) స్వభావోక్తి, ఉపజాతి
d) అతిశయోక్తి, వృత్తం
- View Answer
- సమాధానం: b
37. మన జాతీయ పతాకంలోని అశోకుని ధర్మచక్రం ఈ స్తూపం నుండి స్వీకరించబడింది
a) సాంచీ స్థూపం
b) సారనాథ్ స్థూపం
c) కనోజ్ స్థూపం
d) అమరావతి స్థూపం
- View Answer
- సమాధానం: b
38. కింది పదాలను సరైన అర్థాన్నిచ్చే పదాలతో జతపర్చండి.
(అ) పరామర్శ (క) ప్రేమ
(ఆ) నేస్తాలు. (గ) పలకరించడం
(ఇ) మమకారం (చ) స్నేహితులు
a) అ - గ; ఆ - చ; ఇ – క
b) అ - క; ఆ - గ; ఇ - చ
c) అ - చ; ఆ - క; ఇ - గ
d) అ - గ; ఆ - క; ఇ-చ
- View Answer
- సమాధానం: a
39. ఆరుద్ర అసలు పేరు
a) పెనుమర్తి విశ్వనాధ శర్మ
b) కిళంబి వెంకట నరసింహాచార్యులు
c) జంధ్యాల పాపయ్యశాస్త్రి
d) భాగవతుల సదాశివ శంకరశా
- View Answer
- సమాధానం: d
40. అమృతం తెచ్చి తల్లి దాస్యాన్ని తొలగించిన వారు ఎవరు?
a) అనూరుడు
b) గరుత్మంతుడు
c) కశ్యపుడు
d) కాద్రవేయుడు
- View Answer
- సమాధానం: b
Instruction: కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
లభించినంతలో భీమకవి పద్యాల్ని నిశితంగా పరిశీలిస్తే, తరువాతి కాలంలో శాఖోపశాఖలుగా విస్తరిల్లి తెలుగు దేశమంతటినీ ఆలింగనం చేసుకొన్న శ్రీనాథకవి సార్వభౌముడి వ్యక్తిత్వానికి ఒరవడి భీమకవిలో మనం గుర్తించగలం.
41) శాఖోపశాఖలు అనేది
a) జాతీయం
b) సామెత
c) పొడుపుకథ
d) అలంకారం
- View Answer
- సమాధానం: a
42. 'తెలుగు భాష' అను సమాసానికి విగ్రహవాక్యం
a) తెలుగు అనే పేరు గల భాష
b) తెలుగు యొక్క భాష
c) తెలుగు నందలి భాష
d) తెలుగైన భాష
- View Answer
- సమాధానం: a
43. “పిపీలికాది సూక్ష్మజీవులకు ఆహారం కావాలనే ఉద్దేశ్యంతో సంక్రాంతి ముగ్గులు బియ్యపు పిండితో వేసేవారు” ఈ వాక్యం నుండి గ్రహించాల్సింది
a) కళాతృష్ణ
b) ముగ్గు చెరిగిపోకుండా కాపాడాలని
c) దైవభక్తి
d) భూతదయ
- View Answer
- సమాధానం: d
44. ‘బంగారం’ పదానికి ప్రకృతి రూపం?
a) సువర్ణం
b) స్వర్ణం
c) భృంగారం
d) బృందారం
- View Answer
- సమాధానం: c
45. ‘బడి బయట తిరిగే పిల్లల్ని బడిలో చేర్పించటం, నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయడం, మొక్కలు నాటడం” వంటి అంశాలు
a) వీరగాధలనుచెప్పేవి
b) సంస్కృతికి చెందినవి
c) స్నేహం విలువను చెప్పేవి
d) సామాజిక స్పృహను కలిగించేవి
- View Answer
- సమాధానం: d
46. “గోపి చిటపటలాడాడు. చెవులు రిక్కించాడు. కళ్ళు చికిలించాడు. ముఖం చిట్టించాడు.”
పై వాక్యాల వల్ల తెలియవచ్చేది.
a) పిల్లల స్వభావం
b) నైతిక విలువలు
c) ఆధ్యాత్మిక విలువలు
d) సామాజిక స్పృహ
- View Answer
- సమాధానం: c
47. 'మధువనం' అనే వనానికి యజమాని
a) సుగ్రీవుడు
b) దధిముఖుడు
c) వాలి
d) హనుమంతుడు
- View Answer
- సమాధానం:a
48. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మన కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని తెలిపే ఉద్దేశంగల పాఠ్యాంశం
a) అమ్మకోసం
b) అజంతా చిత్రాలు
c) ఇల్లు - ఆనందాల హరివిల్లు
d) సందేశం
- View Answer
- సమాధానం: c
49. 'కార్యము' అను పదానికి వికృతి
a) కర్జము
b) కార్టం
c) కార్యక్రమం
d) కాళీ
- View Answer
- సమాధానం: a
50. 'కరీంద్రం' పదాన్ని విడదీయగా వచ్చిన రూపం
a) కరి + ఈంద్రం
b) కరిన్ + ఇంద్రుడు
c) కరి + ఇంద్రం
d) కరీంద్ర + అము
- View Answer
- సమాధానం: c