AP TET Telugu Practice Test
1. చేతిలో అనువుగా ఒదిగి ఒక విషయానికి సంబంధించిన వివరణను ఇచ్చే కాగితం
a) వార్తాపత్రిక
b) దినపత్రిక
c) సంకలనం
d) కరపత్రం
- View Answer
- సమాధానం: d
2. కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. విభిన్న ఆకృతుల్లో, ఆకట్టుకునే రంగుల్లో, చూడముచ్చటగా ఉండే కొయ్యబొమ్మలకు తెలుగు రాష్ట్రాలు పెట్టింది పేరు. కృష్ణాజిల్లాలోని కొండపల్లి కొయ్యబొమ్మల ప్రత్యేకతే వేరు. ఆర్య క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కళాకారులు వంశపారంపర్యంగా ఈ బొమ్మలు తయారుచేస్తున్నారు. స్థానికంగా దొరికే కుమ్మరపొనికి చెక్కతో రూపొందించే ఈ బొమ్మల్లో సహజత్వం ఉట్టిపడుతుంది.
కొండపల్లి కొయ్య బొమ్మలు ఈ చెక్కతో తయారు చేస్తారు
a) తెల్ల పొనికి చెక్క
b) నల్ల పొనికి చెక్క
c) కుమ్మర పొనికి చెక్క
d) ఆళ్ళగడ్డ చెక్క
- View Answer
- సమాధానం: c
3. 'బౌద్ధభిక్షువులు అజంతా చిత్రాలను చిత్రించారు. దీనికి కర్మణి వాక్యం
a) అజంతా చిత్రాలు బౌద్ధభిక్షువులచే చిత్రించబడ్డాయి.
b) అజంతా చిత్రాలు బౌద్ధభిక్షువులు అద్భుతంగా చిత్రించారు.
c) బౌద్ధభిక్షువులచే అజంతా చిత్రాలు చిత్రించినారు.
d) అజంతా చిత్రాలు బౌద్ధభిక్షువులు చిత్రించెను.
- View Answer
- సమాధానం: a
4. తను సందర్శించిన అజంతా చిత్రాలను యాత్రారచనగా రచించిన రచయిత
a) నార్ల చిరంజీవి
b) శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
c) నండూరి సుబ్బారావు
d) నార్ల వెంకటేశ్వరరావు
- View Answer
- సమాధానం: d
5. ‘ముసలి అవ్వను చూడగానే గుండె కరిగింది’. ‘గుండె కరిగింది’ అనే జాతీయానికి అర్థం?
a) భయం కలగడం
b) జాలి కలగడం
c) దుఃఖం కలగడం
d) బాధ కలగడం
- View Answer
- సమాధానం: b
6. ఎల్లోరా 'కుడ్యం'పై ఎన్నో చిత్రాలు చిత్రించారు. గీతగీసిన పదానికి వికృతి
a) క్రీడ
b) కీడు
c) గుహ
d) గోడ
- View Answer
- సమాధానం: d
7. ఛందోనియమాల ప్రకారం 'రామునికిన్' అను పదం
a) యగణం
b) భగణం
c) తగణం
d) మగణం
- View Answer
- సమాధానం: b
8. “ఇది ఇలా జరిగింది” అని చెప్పే సాహిత్య ప్రక్రియ
a) పురాణం
b) శతకం
c) ఇతిహాసం
d) ప్రబంధం
- View Answer
- సమాధానం: c
9. 'నేను లైబ్రెరీనుంచి పుస్తకాన్ని తెచ్చాను.' అను వాక్యానికి కర్మణి రూపం
a) నాచే లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం
b) లైబ్రరీ నుంచి తేబడిన పుస్తకం
c) లైబ్రరీ నుంచి నాచే పుస్తకం తేబడింది.
d) నాచే లైబ్రరీ నుంచి పుస్తకం తేబడలేదు
- View Answer
- సమాధానం: c
10. కింది వాక్యాల్లోని సంక్లిష్ట వాక్యం
a) రామలక్ష్మణులు అన్నదమ్ములు.
b) ఎండ వచ్చింది కాని చలి ఇంకా పోలేదు.
c) అన్నయ్య ఇప్పుడే వచ్చివెళ్ళాడు.
d) పరీక్షా ఫలితాలు రేపే వచ్చేస్తాయేమో.
- View Answer
- సమాధానం: c
11. “వనచరులు” అనగా
a) వనమునందు చరించువారు
b) వనమునందు చరించనివారు
c) దట్టమైన అడవిగలవారు
d) గ్రహముల యందు తిరుగువారు
- View Answer
- సమాధానం: a
12. గాంధీజీ జీవితంతో సంబంధం కలిగినవి
a) చంపారన్, వాషింగ్టన్, గోదావరి నది
b) పోర్ బందర్, మండలే జైలు, శ్రవణకుమారుని కథ
c) సబర్మతి, సత్యహరిశ్చంద్ర, పుత్లీబాయి
d) సత్యాగ్రహం, సర్దార్ సరోవర్ ప్రాజెక్టు, రంగులరాట్నం
- View Answer
- సమాధానం: c
13. కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
ఈ నదీ తీరమే యాంధ్రుల ఆర్థిక రాజకీయ సాంఘిక జీవనమునకు జీవగడ్డ. ఆంధ్రుల దృష్టిని నందికొండ నుండి హంసలదీవి వరకు సాగించి వారి చరిత్రకొక విశిష్టత నెలకొల్పినది. పరరాజన్యుల సేనావాహినికి చెలియలికట్టయై తన ప్రభావము ప్రకటించుకున్నదీ నదీమతల్లి. బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనంద గోత్రజులు, వెలనాటికోట సామంత రాజులు ఈ నదీతట రాజవల్లభులు.
పై గద్యంలో గల నదీ ప్రస్తావన
a) గోదావరి
b) పెన్న
c) తుంగభద్ర
d) కృష్ణ
- View Answer
- సమాధానం: d
14. మంచివారి హృదయంలో భగవంతుడుంటాడు.
‘హృదయం' అను పదానికి వికృతి
a) ఎద
b) ఎదిరి
c) ఎదుగు
d) ఎదురాడు
- View Answer
- సమాధానం: a
15. 'ఖ, ఛ, థ, ధ, ఫ' అనే అక్షరాలను మహాప్రాణాక్షరాలు అంటారు. మహాప్రాణాక్షరాలకు మరో వ్యాకరణ పరిభాష్యం
a) ఉభయాక్షరాలు
b) ఊష్మాలు
c) అంతస్థాలు
d) వర్గయుక్కులు
- View Answer
- సమాధానం: d
16. కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
పగలు ఎక్కువగా నిద్రపోవడం కూడా ఉపవాసంలోని ఒక అంశమే. ఉపవాసం వల్ల ఆకలిదప్పుల అనుభూతి ఏమిటో తెలుస్తుంది. శక్తిసామర్థ్యాలు క్షీణించడం తెలుస్తుంది. హృదయాన్ని పరిశుద్ధ పరచడమే దీని పరమావధి.
ఉపవాస ప్రధానలక్ష్యం
a) ఎక్కువగా నిద్రపోవడం
b) ఆకలిదప్పుల అనుభూతి
c) హృదయం పరిశుద్ధమవడం
d) శక్తిసామర్థ్యాలు క్షీణించడం
- View Answer
- సమాధానం: c
17. కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
ఆర్య, ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన మరికొన్ని భారతీయ భాషల్లో కూడా సాహిత్యం వెలసింది. ముండారీ భాషకు నాగరీ లిపిలో, సంతాలీ, ఖాసీ భాషలకు బెంగాలీ లిపిలో సాహిత్యం ఏర్పడింది. సవర భాషకు గిడుగు వెంకట రామ్మూర్తిగారు రోమన్ లిపిలో కొంత సాహిత్యం సృష్టించారు. లేప్చా భాషలో టిబెటన్ లిపి భేదంతో వస్తున్న సాహిత్యం ఏనాడు మొదలయిందో తెలీదు.
సవర భాషకు ఈ లిపిలో సాహిత్యం సృష్టించబడింది.
a) నాగరీ లిపి
b) బెంగాలీ లిపి
c) రోమన్ లిపి
d) టిబెటన్ లిపి
- View Answer
- సమాధానం: c
18. నన్నయ బిరుదములు
a) కవిబ్రహ్మ, ఉభయకవి మిత్రుడు
b) శంభుదాసుడు, కవికోకిల
c) శబ్దశాసనుడు, కళాప్రపూర్ణ
d) ఆదికవి, వాగనుశాసనుడు
- View Answer
- సమాధానం: d
19. ఆయుధపూజు ఈ పండుగరోజు నిర్వహిస్తారు
a) విజయదశమి
b) దీపావళి
c) సంక్రాంతి
d) శ్రీరామనవమి
- View Answer
- సమాధానం: a
20. క్రింది వాక్యాల్లో కర్మణి వాక్యం
a) సీతా స్వయంవరంలో శివధనువు విరిగింది.
b) విద్యార్థులు అనేక విషయాలను నేర్చుకున్నారు.
c) గాంధీజీచే అనేక బోధనలు చేయబడ్డాయి.
d) తన చేతకాని పనిని చేయ బూనకూడదు.
- View Answer
- సమాధానం: c
21. 'జల నిద్రించు ప్రతిమల మేలుకొలిపి' - గీత గీసిన పదం గణం
a) భగణం
b) తగణం
c) రగణం
d) నగణం
- View Answer
- సమాధానం: b
Instruction: కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
ధనమును, విద్యయు, వంశం
బును దుర్మతులకు, మదంబు బొనరించును స
జ్జనులైన వారి కడకువ
యును వినయము నివియ దెచ్చు నుర్వీనాథా!
22) సజ్జనులకు అణుకువ, వినయం కలిగించేవి
a) ధనం, మదం, అణుకువ
b) అణుకువ, ఉర్వీనాధ, మదం
c) ధనం, వంశం, దుర్మదం
d) విద్య, వంశం, ధనం
- View Answer
- సమాధానం: d
23. ‘గుండెలో శూలమ్ము
గొంతులో శల్యమ్ము
కూళతో స్నేహమ్ము' పై గేయ పంక్తులు తెలియజేసే విలువలు
a) ఆధ్యాత్మిక విలువలు
b) నైతిక విలువలు
c) రాజకీయ విలువలు
d) దేశభక్తి విలువలు
- View Answer
- సమాధానం: b
24. సి. నారాయణరెడ్డిగారికి జ్ఞానపీఠ అవార్డు తెచ్చి పెట్టిన గ్రంథం
a) విశ్వంభర
b) ఆంధ్రప్రశస్తి
c) వేయి పడగలు
d) కాలరేఖలు
- View Answer
- సమాధానం: a
25. గబ్బిలము, ఫిరదౌసి గ్రంథకర్త
a) దువ్వూరి రామిరెడ్డి
b) గుర్రం జాషువా
c) దేవరకొండ బాలగంగాధర తిలక్
d) సి. నారాయణరెడ్డి
- View Answer
- సమాధానం: b
26. కాలికి బుద్ధిచెప్పారు. ఈ వాక్యంలోని ఉపవిభక్తి
a) కి
b) చె
c) రు
d) ఇ
- View Answer
- సమాధానం: d
27. మన రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టింది
a) స్వామి దయానంద సరస్వతి
b) సుందర్ లాల్ బహుగుణ
c) గాడిచర్ల హరి సర్వోత్తమరావు
d) నంబూద్రిపాద్
- View Answer
- సమాధానం: c
28. శార్దూలం పద్యానికి యతిస్థానం ఎన్నో అక్షరం?
a) 11
b) 13
c) 14
d) 12
- View Answer
- సమాధానం: b
29. వినాయక చవితిని జాతి సమైక్యత కోసం వినియోగించినవారు
a) బాలగంగాధర తిలక్
b) నెహ్రూ
c) గాంధీ
d) వల్లభాయ్ పటేల్
- View Answer
- సమాధానం: a
30. పశువులను శుభ్రపరచి వాటి కొమ్ములను అలంకరించు పండుగరోజు
a) సంక్రాంతి
b) భోగి
c) కనుమ
d) శివరాత్రి
- View Answer
- సమాధానం: c
31. “సాగరం” ఈ పదం ఈ గణానికి చెందుతుంది.
a) యగణం
b) రగణం
c) తగణం
d) నగణం
- View Answer
- సమాధానం: b
32. 'పాపంబు' పదం ఈ గణానికి చెందింది.
a) భగణము
b) జగణము
c) మగణము
d) తగణము
- View Answer
- సమాధానం: d
33. 'ఆసక్తి' అనే పదానికి అర్థం
a) కష్టం
b) ఇష్టం
c) నష్టం
d) స్పష్టం
- View Answer
- సమాధానం: b
34. “దళం” అనే పదానికి నానార్థాలు
a) గుర్తు, ప్రభావం
b) గుడి, దేవాలయం
c) గుంపు, ఆకు
d) ఫలం, గుర్తు
- View Answer
- సమాధానం: c
రోషావేశము జనులకు
దోషము తలపోయ విపుల దుఃఖకరమునౌ
రోషము విడిచిన యెడ సం
తోషింతురు బుధులు హితము దోప కుమారా!
35) బుధులు సంతోషించునది.
a) రోషం విడిచిన వారిని చూసి
b) రోషం పొందిన వారిని చూసి
c) దుఃఖిస్తున్న వారిని చూసి
d) జనులను చూసి
- View Answer
- సమాధానం: a
36. 'పారిపోవు' అనే పదానికి సరైన జాతీయం
a) కాలికి బుద్ధిచెప్పు
b) బుద్ధి గడ్డితిను
c) అడవి కాచిన వెన్నెల
d) అందెవేసిన చెయ్యి
- View Answer
- సమాధానం: a
37. సహకారం గేయ కథలో
“పరామర్శ ఏమోకాని
ప్రాణాలే పోయాయని
గిలగిల కొట్టుకొని
వలవల ఏడ్చింది”
a) కోతి
b) కుందేలు
c) నక్క
d) ఎద్దు
- View Answer
- సమాధానం: b
38. “తలపండిన” అనే జాతీయానికి వివరణ
a) అనుభవంగడించిన
b) కనీస జ్ఞానంలేని
c) అనుభవం లేని
d) నిర్మించిన
- View Answer
- సమాధానం: a
39. ‘పండితులు చతుర్వేదాలు చదివారు’ ‘చతుర్వేదాలు’ అనేది ఏ సమాసం?
a) ద్వంద్వ సమాసం
b) ద్విగు సమాసం
c) సంభావన పూర్వపద కర్మధారాయం
d) బహువ్రీహి సమాసం
- View Answer
- సమాధానం: b
కలనాటి ధనము లక్కఱ
గలనాటికి దాచ గమలగర్భుని వశమా?
నెల నడిమినాటి వెన్నెల
యలవడునే గాదెఁబోయ నమవసనిశికిన్
40) వెన్నెల కనిపించని రోజు
a) పున్నమి
b) విదియ
c) అమావాస్య
d) అష్టమి
- View Answer
- సమాధానం: c
41. “అప్పుడప్పుడు” పదాన్ని విడదీయగా వచ్చిన రూపం
a) అప్పుడు + డప్పుడు
b) అప్పు + అప్పుడు
c) అప్పుడు + అప్పుడు
d) అప్పడ + అప్పడు
- View Answer
- సమాధానం: c
42. రచయిత ఆత్మాశ్రయ శైలిలో, తాను చూసిన ప్రదేశాన్ని గురించి వర్ణించే రచన
a) జీవయాత్ర
b) యాత్రారచన
c) జీవితచరిత్ర
d) వ్యాసం
- View Answer
- సమాధానం: b
43. ‘తెల్లపావురాల్ని సరదాగా ఎగరేస్తుంది/ చల్లని తల్లి చక్కని చెల్లి ఆమె పేరు శాంతి’ ఈ గేయ పంక్తులు ఏ పాఠ్య భాగంలోనివి?
a) మ్రోగిన గంటలు
b) ప్రకటన
c) ఆలోచనం
d) జీవన భాష్యం
- View Answer
- సమాధానం: b
44. కళాశాల విద్యార్థులు మువ్వన్నెల పతాకం చేతబూని ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. ఈ వాక్యంలో కర్మను తెలిపేది
a) కళాశాల విద్యార్థులు
b) చేతబూని
c) మువ్వన్నెల పతాకం
d) నిర్వహిస్తున్నారు
- View Answer
- సమాధానం: c
45. ‘మనజెండా మనదే వీరుల నెత్తురు పంట’ దీనిలో వీరులంటే?
a) ధైర్య వంతులు
b) భారతీయులు
c) స్వాతంత్య్ర సమరయోధులు
d) కత్తి యుద్ధం చేసేవారు
- View Answer
- సమాధానం: c
46. “చిన్నతనంలోనే మాట విననివాడు, పెద్దయ్యాక అసలే వినడు” దీనికి సరైన సామెత
a) చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు
b) దురాశ దుఃఖానికి చేటు
c) ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు
d) మొక్కై వంగనిది మ్రానై వంగునా!
- View Answer
- సమాధానం: d
47. "శ్రీరామా'' పదం యొక్క గణం.
a) మగణము
b) భగణము
c) నగణము
d) జగణము
- View Answer
- సమాధానం: a
48. కింది వాక్యాలలో హేత్వర్థక వాక్యాన్ని గుర్తించండి.
a) రవి పని చేస్తాడో చెయ్యడో!
b) మా ఇంట్లో అమ్మ పూజలు చేస్తుంది
c) వర్షాలు లేక పంటలు పండలేదు
d) దయచేసి మాట్లాడకండి
- View Answer
- సమాధానం: c
49. “శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించడం, కష్టపడే వారిపట్ల గౌరవం కనపర్చడం” అనే ఉద్దేశ్యం గల పాఠం.
a) ప్రతిజ్ఞ
b) జీవనభాష్యం
c) హరిశ్చంద్రుడు
d) ఆలోచనం
- View Answer
- సమాధానం: a
50. “చిలుక సందేశం” అనే పాఠం ప్రక్రియ
a) లేఖ
b) వ్యాసం
c) గేయరూపంలో హరికథ
d) నాటిక
- View Answer
- సమాధానం: c