TET Exam Begins: నేటి నుంచి 9 కేంద్రాల్లో టెట్ పరీక్షల నిర్వాహణ..
Sakshi Education
ఈరోజు ప్రారంభం అవుతున్న టెట్ పరీక్ష గురించి డీఈఓ వెల్లడించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు తగిన సూచనలిచ్చారు..
విశాఖ: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్–2024) పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో ఎల్.చంద్రకళ తెలిపారు. జిల్లాలో 9 కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షలకు 37,556 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డు ఒరిజినల్, జెరాక్స్ పత్రం, ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకొని రావాలన్నారు.
Online Course: విదేశీ చదువు కోసం సువర్ణ అవకాశం..!
ప్రతీ రోజు మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. పరీక్ష సమయానికి గంట ముందు అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
Job Mela at Degree College: విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశం..
Published date : 27 Feb 2024 12:36PM