Job Mela at Degree College: విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశం..

అనంతపురం ఎడ్యుకేషన్: యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్‌కుమార్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు 75 కంపెనీలతో అనంతపురంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల వేదికగా ఈ నెల 28న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఫౌండేషన్ అధ్యక్షుడు హరీష్‌కుమార్ యాదవ్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఐటీ, నాన్ ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, ఆటోమొబైల్, సెక్యూరిటీస్, మాన్యుఫాక్చరింగ్, ఇన్సూరెన్స్, హెల్త్ సెక్టార్, ఈ–కామర్స్ రంగంలోని దిగ్గజ కంపెనీలైన క్యాప్ జెమిని, వెట్రోటెక్, ఎడ్యుబ్రిడ్జ్, బీట్సల్, సెవెంటెక్ టెక్నాలజీస్, కోజెంట్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పేటియం, అమర్ రాజ, కియా మోటర్స్, అపోలో ఫార్మా, హెటెరో ఫార్మా, ముత్తూట్, ఎయిర్‌టెల్, టీవీఎస్ తదితర కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్ఫూర్తితో ప్రతి పేద నిరుద్యోగికి అండగా ఉండటమే తమ లక్ష్యమని హరీష్‌కుమార్ యాదవ్ తెలిపారు. జాబ్‌మేళాలో ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందజేస్తారన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
TS Intermediate Exams 2024: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు..ఈ విషయాలు మర్చిపోవద్దు