AP TET 2024 New Schedule Released: అలర్ట్.. ఏపీ టెట్ షెడ్యూల్‌లో మార్పులు.. కొత్త తేదీలు ఇవే
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) షెడ్యూల్‌లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. డీఎస్సీ, టెట్ పరీక్షలకు సమయం ఇవ్వాలన్న అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు.. మార్పులు చేస్తూ తాజాగా కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది.
TSPSC Group 1 Prelims Results 2024: గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన తండ్రీ,కొడుకులు
ఈనెల 2న ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం.. ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉండగా, తాజాగా ఆ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ తెలిపింది.
Vacancies In Andhra Pradesh: ఏపీలో 400కు పైగా ఉద్యోగాలు.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో కొలువులు
ఈ మేరకు సవరణ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సెషన్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెషన్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక నవంబర్ 2న టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు.