Village and Ward Secretariat Employees ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంధించిన ఉత్తర్వులు జూన్ 24న లేదా 27న వెలువడే అవకాశముందని ఉన్నతాధికారులు చెప్పారు.
ప్రొబేషన్ డిక్లరేషన్ ఉత్తర్వులకు రంగం సిద్ధం
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి.. కేవలం 4 నెలల్లోనే వాటి భర్తీ ప్రక్రియను పూర్తి చేశారు. ఉద్యోగాలు పొందిన వారిలో నిబంధనల ప్రకారం అర్హులైన వారికి జూన్ నెలాఖరు కల్లా ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ పూర్తి చేసి, జూలై నెల(ఆగస్టు 1న చెల్లించే)కు పెరిగిన జీతాలు అమలు చేయాలని సీఎం జగన్ ఈ ఏడాది జనవరిలోనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆత్మకూరు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడటంతో గత నెల రోజులుగా నెల్లూరు జిల్లా అంతటా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ నెల్లూరు జిల్లాతో సహా రాష్ట్రం మొత్తం అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల జారీ కాస్త ఆలస్యమైందని అధికారులు చెప్పారు.