Skip to main content

AP Polycet Results Link : నేడే పాలిసెట్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఏపీ పాలిసెట్-2022 ఫ‌లితాల‌ను జూన్ 18వ తేదీన ఉద‌యం 9:15 గంట‌ల‌కు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజ‌య‌వాడ‌లోని గేట్ వే హోట‌ల్‌లో విడుద‌ల చేయ‌నున్నారు.
ap polycet results
ap polycet results 2022

పాలిటెక్నిక్‌, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మే 29వ తేదీన‌ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాలీసెట్‌ను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. ఇప్ప‌టికే పాలిసెట్-2022 ఆన్సర్ కీని కూడా ఎస్‌బీటీఈటీ విడుద‌ల చేసింది. 

Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

విడుద‌ల‌ చేసిన రోజే
ఈ ఫ‌లితాలను విడుద‌ల‌ చేసిన రోజే ర్యాంక్ కార్డ్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని బోర్డ్ తెలిపింది. రిజిస్ట్రేషన్‌ వివరాలు, పుట్టిన తేదీని నమోదు చేసుకొని ఈ ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చును.  ఈ ఫ‌లితాల‌ను సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com )లో చూడొచ్చు.

How to Check AP POLYCET 2022 Results:

☛Visit results.sakshieducation.com or sakshieducation.com

☛ Click on AP Polycet 2022 Rsults link available in the home page

☛ In the next page, enter your hall ticket no. and submit

☛ Results will be displayed

☛ Download a copy of the marks for further reference.

Direct link for AP POLYCET 2022 Results

ఎవరికైనా సమానంగా మార్కులు వ‌స్తే..
ఒకవేళ అర్హత మార్కుల‌లో ఎవరికైనా సమానంగా మార్కులు వచ్చినట్లయితే మ్యాథమాటిక్స్, ఫిజిక్స్‌, పుట్టిన తేదీల వారీగా సరిచూసి ర్యాంకును కేటాయిస్తారు. మొత్తం 120 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో కనీసం 25 శాతం మార్కులు పొందిన వారికి ర్యాంకులు కేటాయిస్తామని బోర్డ్ తెలిపింది.  అభ్య‌ర్థులు త‌మ ర్యాంక్ కార్డును https://polycetap.nic.in/ లేదా http://sbtetap.gov.in/ వెబ్‌సైట్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

AP POLYCET 2022: ఏపీ పాలిసెట్ 2022 ఆన్సర్ కీ విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..

After 10th Class : `పది` తర్వాత ఉన్నత విద్యావకాశాలకు స‌రైన దారి...

1,37,371 మంది విద్యార్థులు
పాలీసెట్‌-2022 పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 404 పరీక్ష కేంద్రాలను, 52 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 1,37,371 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1.25 లక్షల మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. పరీక్ష పూర్తి అయిన కొద్ది రోజుల్లోనే ఈ ఫలితాలను విడుద‌ల‌ చేయ‌నున్నారు. పరీక్షలో వ‌చ్చిన‌ మార్కుల ఆధారంగానే ర్యాంక్‌ను కేటాయించడం జరుగుతుందని బోర్డ్ తెలిపింది.

TS POLYCET 2022: బహుళ అవకాశాల.. పాలిటెక్నిక్‌

Published date : 20 May 2023 09:49AM

Photo Stories