Polycet: పాలిటెక్నిక్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలిసెట్ ప్రవేశ పరీక్షకు 68,137 మంది విద్యార్థులు హాజరు కాగా.. 64,187 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. రాష్ట్రంలోని 257 పాలిటెక్నిక్ కళాశాలల్లో 70,427 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యార్థులు అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని సూచించారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన, సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసి అక్టోబర్ 18 నుంచి తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆన్ లైన్ లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన సమయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 31 కళాశాలల్లో హెల్ప్‌లైన్ సెంటర్లు, సందేహాలు నివృత్తి చేసేందుకు ప్రతి కాలేజీలో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. తొలి దశ సీట్ల భర్తీ అనంతరం రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. అక్టోబర్ నెలాఖరు నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేసి నవంబర్ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో తరగతులు ప్రారంభిస్తామన్నారు.
వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఇలా..
- అక్టోబర్ 1నుంచి 6వ తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
- 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన
- 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు విద్యార్థుల ఆప్షన్ల ఎంపిక
- 9వ తేదీ ఆప్షన్ల ఎంపికలో తప్పుల సవరణకు అవకాశం
- 11న సీట్ల కేటాయింపు
- 12నుంచి 18లోగా విద్యార్థులు సీట్లు పొందిన కళాశాలల్లో నేరుగా లేదా ఆన్ లైన్ లో రిపోర్టు చేయాలి.
- 18 నుంచి బోధన ప్రక్రియ ప్రారంభం.
సీట్ల సంఖ్య ఇలా..
యాజమాన్యం |
కాలేజీల సంఖ్య |
కన్వీనర్ కోటా |
ఈబ్ల్యూఎస్ కోటా |
మొత్తం సీట్లు |
ప్రభుత్వ |
84 |
15,609 |
1,395 |
17,004 |
ఎయిడెడ్ |
2 |
247 |
24 |
271 |
ప్రైవేటు |
171 |
48,447 |
4,705 |
53,152 |
మొత్తం |
257 |
64,303 |
6124 |
70,427 |
సాంకేతిక విద్యలో సంస్కరణలు
సాంకేతిక విద్య అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని భాస్కర్ తెలిపారు. రాష్ట్రంలోని 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లోని విద్యార్థులకు మూడేళ్ల డిప్లొమా కోర్సులతో పాటు ఉపాధి నైపుణ్యాల శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. డిప్లొమా పూర్తి చేసిన వెంటనే ఉద్యోగ అవకాశాలు దక్కేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. మైక్రోసాఫ్ట్, సిస్కో, ఐఐటీ ముంబై సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు వివరించారు. విద్యార్థులు రెగ్యులర్ సబ్జెక్టులతో పాటు ఈ కోర్సులను ఆప్షన్లుగా ఎంచుకోవచ్చన్నారు. రెండో ఏడాది చివరి నుంచి సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ అందిస్తామన్నారు. ఇండస్ట్రీ కనెక్ట్ పేరుతో విద్యార్థులకు పరిశ్రమల్లో నేరుగా ప్రాక్టికల్ ట్రైనింగ్ అందించనున్నట్టు చెప్పారు. త్వరలోనే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 400 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. మరో 635 పోస్టుల మంజూరుకు ప్రతిపాదనలు పంపామన్నారు. గిరిజన ప్రాంతాల్లో 7 ప్రభుత్వ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాలలను ప్రత్యేక యూనిట్గా తీసుకుని సిబ్బంది నియామకం, మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించి మెరుగైన విద్య అందిస్తామని భరోసా ఇచ్చారు. అవసరమైన చోట్ల అతిథి అధ్యాపకుల సేవలను ఉపయోగించుకుంటామన్నారు.
చదవండి:
Polytechnic Admissions: నోటిఫికేషన్ విడుదల..వీరికే ఎక్కువగా ఉద్యోగావకాశాలు