AP POLYCET 2021 Results: పాలిసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
ఈ సందర్భంగా మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ... మంచి ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా శ్రీకాకుళం, అత్యధిక బాలికల ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా నెల్లూరు అని తెలిపారు. అత్యధిక బాలుర ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా ప్రకాశం అని వివరించారు. జగనన్న విద్యాదీవెన ద్వారా 81వేల మంది విద్యార్థులకి రూ.128 కోట్లు అందజేశామని పేర్కొన్నారు. 72 వేల మంది విద్యార్థులకి రూ.54 కోట్లు జగనన్న వసతి దీవెనగా అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ డైరెక్టర్ లావణ్యవేణి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ బంగారు రాజులు పాల్గొన్నారు.
ఏపీ పాలీసెట్(Andhra Pradesh POLYCET 2021) పరీక్షను సెప్టెంబర్ 1న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పాలిసెట్‌కు 74,884 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా.. అందులో 68,208 మంది పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలోని 72 వేల పాలిటెక్నిక్ సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించారు.