సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కాలేజీలు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మాధ్యమిక విద్యాశాఖ 2023–24 విద్యా సంవత్సరం కేలండర్‌ను ఇప్పటికే విడుదల చేసింది.
ఇంటర్ తరగతులు ప్రారంభ తేదీ ఇదే..
యూనిట్–1 పరీక్షలు జూలై 26 నుంచి 28 వరకు, యూనిట్–2 పరీక్షలు ఆగస్టు 24 నుంచి నిర్వహించనున్నారు. అలాగే విద్యార్థులకు నిర్వహించే వివిధ పరీక్షలు, సెలవుల వివరాలను పేర్కొంటూ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ శేషగిరిబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో చేరేందుకు మొదటి దశ ప్రవేశాలకు జూన్ 14 వరకు అవకాశం కల్పించారు. ప్రస్తుత ప్రవేశాలకు ఎస్‌ఎస్‌సీ ఇంటర్నెట్ మార్కుల మెమో ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని ఆయా కాలేజీలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు