Video Conference: ప్రశాంత వాతావరణంలో పరీక్షలను నిర్వహించాలి..
గుంటూరు వెస్ట్: ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని, తదనుగుణంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 1 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 57,538 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. 92 పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ నెల 28లోపు కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న మౌలిక సదుపాయాలను చీఫ్ సూపరింటెండెంట్లు పరిశీలించాలని చెప్పారు.
Library for Readers: పాఠకుల చెంతకే గ్రంథాలయం
వేసవి దృష్ట్యా మంచినీటితోపాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా చూసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూయించాలన్నారు. పరీక్షలకు సంబంధించి కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి స్టోరేజ్ పాయింట్లు అక్కడి నుంచి పరీక్ష కేంద్రాలకు చేర్చేందుకు పోలీస్ ఎస్కార్ట్ తీసుకోవాలన్నారు. పరీక్షలు ముగిసే వరకు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఇబ్బందులను తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
Exam Arrangements: టెన్త్, ఇంటర్ పరీక్షల ఏర్పాట్ల గురించి కలెక్టర్ ఆదేశాలు..
విద్యాశాఖ మంత్రితో వీడియో సమావేశం..
ప్రస్తుతం 10వ తరగతి, ఇంటర్, డీఎస్సీ, టెట్ పరీక్షల సమయం కావడంతో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి సమన్వయంతో ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గురువారం తాడేపల్లి విద్యాశాఖ కార్యాలయం నుంచి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిర్వహించిన వీడియో సమావేశానికి స్థానిక కలెక్టరేట్ నుంచి వర్చువల్ విధానంలో కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి