Open inter admissions : ఓపెన్ ఇంటర్ రెండో విడత అడ్మిషన్లు ప్రారంభం
Sakshi Education
Open inter admissions : ఓపెన్ ఇంటర్ రెండో విడత అడ్మిషన్లు ప్రారంభం
కడప ఎడ్యుకేషన్: కడప బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపెన్ ఇంటర్ రెండవ విడత అడ్మిషన్లు జరుగుతున్నాయని ఆ కళాశాల ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ చెప్పలి రాజారావు తెలిపారు. 15 ఏళ్లు నిండిన విద్యార్థి, విద్యార్థులు ఓపెన్ ఇంటర్ చదవడానికి అర్హులని ఆయన పేర్కొన్నారు. రెండేళ్లకు కలిపి ఒకేసారి పరీక్షలు జరుగుతాయన్నారు. అడ్మిషన్లు కావాల్సిన వారు పదో తరగతి ఒరిజినల్ మార్కులిస్టు, ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాస్‌బుక్, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు తీసుకుని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలోని ఓపెన్ అడ్మిషన్ సెంటర్‌ను కలవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ : 9182099672ను సంప్రదించాలని వివరించారు.
Also Read : 1528-2024 వరకు రామ మందిరం కోసం జరిగిన సంఘటనలు ఇవే!!
Published date : 27 Jan 2024 09:51AM