Intermediate: పరీక్షల కొత్త షెడ్యూల్ ఇదే.. జూన్ లో ఫలితాలు..
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మార్చి 3న సచివాలయంలో మారిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, జేఈఈ మెయిన్ –2022 మొదటి విడత పరీక్షలను ఏప్రిల్ 16–21 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటన వచ్చింది. దీంతో ఇంటర్ పరీక్షల మధ్యలో జేఈఈ పరీక్షల షెడ్యూల్ ఉండడంతో విద్యార్థులకు నష్టం కలిగేలా పరిస్థితులు మారాయి. దీనిపై ఇంటర్మీడియెట్ బోర్డు మార్చి 2న అత్యవసర సమావేశం నిర్వహించి పరీక్షల షెడ్యూల్‌పై చర్చించింది. చివరకు జేఈఈ మెయిన్ పరీక్షలు ముగిసిన అనంతరం ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని బోర్డు నిర్ణయించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీన్ని ఆమోదించిన అనంతరం గురువారం మంత్రి కొత్త షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆదివారాలు, సెలవు రోజులతో పాటు మధ్యలో రంజాన్ పర్వదినం ఉండడంతో మే 3, 4 తేదీల్లో పరీక్షలు లేకుండా కొత్త షెడ్యూల్‌ను రూపొందించారు. ఈ ప్రకారం ఏప్రిల్ 22న ప్రారంభమై మే 12తో ఇంటర్ పరీక్షలను పూర్తిచేస్తామని మంత్రి సురేష్ వెల్లడించారు. నైతిక విలువలు, పర్యావరణ విద్య సబ్జెక్టుల పరీక్షలు ఇంతకుముందు ప్రకటించిన విధంగానే మార్చి 7, 9 తేదీల్లోనే జరుగుతాయన్నారు. అలాగే, ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 11 నుంచి 31వరకు యథాతథంగా కొనసాగుతాయన్నారు. ఇక బెటర్‌మెంటు కోసం 2,500 మంది అభ్యర్థులు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయనున్నారని, అందుకే సెకండియర్ పరీక్షలతో పాటు ఫస్టియర్ పరీక్షలను కూడా ఇదే షెడ్యూల్‌తోపాటు నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు.
చదవండి: ఇంటర్మీడియెట్ స్టడీ మెటీరియల్
ప్రాక్టికల్స్‌కు జంబ్లింగ్ విధానం
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ఫిజిక్సు, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులలో ఈనెల 11 నుంచి 31 వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నామని, ఇందుకు జంబ్లింగ్ విధానాన్ని అనుసరిస్తున్నామని సమావేశంలో పాల్గొన్న ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు వివరించారు. ఇంటర్ థియరీ పరీక్షలకు పది లక్షల మంది వరకు విద్యార్థులు హాజరుకానున్నారని.. ఇందుకోసం 1,456 కేంద్రాలను, ప్రాక్టికల్ పరీక్షల కోసం 975 కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన చెప్పారు. అవసరమైన పక్షంలో పరీక్షా కేంద్రాలను పెంచుతామన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
చదవండి:
ఇంటర్మీడియెట్ ప్రివియస్ పేపర్స్
కొత్త షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షల తేదీలు ఇలా..
తేదీ |
ఫస్టియర్ |
తేదీ |
సెకండియర్ |
22–04–2022 |
ద్వితీయ భాష పేపరు–1 |
23–04–2022 |
ద్వితీయ భాష పేపరు–2 |
25–04–2022 |
ఇంగ్లిషు పేపరు–1 |
26–04–2022 |
ఇంగ్లిషు పేపరు–2 |
27–04–2022 |
28–04–2022 |
||
సివిక్స్ పేపరు–1 |
సివిక్స్ పేపరు–2 |
||
29–04–2022 |
30–04–2022 |
||
హిస్టరీ పేపరు–1 |
హిస్టరీ పేపరు–2 |
||
02–05–2022 |
05–05–2022 |
||
ఎకనామిక్స్ పేపరు–1 |
ఎకనామిక్స్ పేపరు–2 |
||
06–05–2022 |
07–05–2022 |
||
కామర్స్ పేపరు–1 |
కామర్స్ పేపరు–2 |
||
సో షియాలజీ పేపరు–1 |
సో షియాలజీ పేపరు–2 |
||
ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపరు–1 |
ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపరు–2 |
||
09–05–2022 |
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ |
10–05–2022 |
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ |
పేపరు–1 |
పేపరు–2 |
||
లాజిక్ పేపరు–1 |
లాజిక్ పేపరు–2 |
||
బ్రిడ్జికోర్సు మ్యాథ్స్ పేపరు–1 (బైపీసీ వారికి) |
బ్రిడ్జికోర్సు మ్యాథ్స్ పేపరు–2 (బైపీసీ) |
||
11–05–2022 |
మోడర్న్ లాంగ్వేజ్ |
12–05–2022 |
మోడర్న్ లాంగ్వేజ్ |
పేపరు–1 |
పేపరు–2 |
||
జియోగ్రఫీ పేపరు–1 |
జియోగ్రఫీ పేపరు–2 |