Good News for Inter students: ఇంటర్ విద్యార్థులకు తీపి కబురు
మదనపల్లె సిటీ : రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో ప లు సంస్కరణలు తీసుకువస్తోంది. విద్యార్థులందరూ చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నది లక్ష్యంతో విద్యా శాఖ పని చేస్తోంది. విద్యార్థుఽల అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నూతన విధానాలు అమలు చేస్తున్నారు. తాజాగా మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడయట్‌లో ఫెయిలైన విద్యార్థులను రెగ్యులర్ విద్యార్థులుగా గుర్తించే విధానాన్ని అమలుకు శ్రీకారం చుట్టారు. ఇది ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు మంచి అవకాశం.
Also Read : Anganwadi Jobs: అంగన్‌వాడీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఈ ఏడాది నుంచి నూతన విధానం
ప్రతి విద్యార్థికి ఇంటర్ చదువు ఒక మైలురాయి. ఇంటర్ పూర్తి చేస్తే ఉన్నత స్థితిలో స్థిరపడడానికి అనువైన విద్యను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యమున్న ఇంటర్‌లో సరిగా చదవలేకనో.. అనారోగ్య సమస్యల వల్లనో.. ఇంట్లో కారణాల వల్ల గానీ దాదాపు 30 నుంచి 40 శాతం సానుకూల ఫలితాలు సాధించలేకపోతున్నారు. అటువంటి వారి కోసం ప్రభుత్వం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నా, వారిలో కొంత మంది తప్పి వచ్చే ఏడాది వరకూ వేచి చూడాల్సి వస్తోంది. అటు వంటి వారి కోసం ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ద్వితీయ సంవత్సరం పరీక్షలు తప్పిన విద్యార్థులు మరోసారి కళాశాలలో చేరవచ్చు. తరగతులకు హాజరుకావచ్చు. రెగ్యులర్ విద్యార్థులుగా మారిపోవచ్చు.
Also Read : Free training in Spoken English
2021–22, 22–23 విద్యార్థులకు అవకాశం
నూతనంగా తీసుకొచ్చిన ఈ విధానంతో 2021–22 ,22–23 విద్యా సంవత్సరాల్లో ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఉమ్మడి కడప జిల్లాలో 21–22లో 10,630, 22– 23లో 6,826 మంది ప్రయోజనం పొందనున్నారు.
అమ్మ ఒడి పథకానికి అర్హత
నూతన విధానంలో రెగ్యులర్ విద్యార్థులుగా ఫీజులు చెల్లించి తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం అమ్మ ఒడి పథకం లబ్ధిని అందిస్తోంది. అయితే వారు గతంలో కూడా అమ్మఒడి పథకాన్ని అందుకున్నవారై, ప్రస్తుత సంవత్సరంలో కూడా ఈ పథకానికి అర్హతలు కలిగి ఉండాలి.