APBIE: సర్టిఫికెట్లు సమర్పించకపోతే గుర్తింపు రద్దు
Sakshi Education
రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు గుర్తింపు పునరుద్ధరణ కోసం ప్రభుత్వం నిర్దేశించిన ధ్రువీకరణపత్రాలు తప్పనిసరిగా సమర్పించాలని Andhra Pradesh Intermediate Board కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు సెప్టెంబర్ 6న ఒక ప్రకటనలో తెలిపారు.
ధ్రువీకరణపత్రాలు సమర్పించని కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని స్పష్టంచేశారు. కళాశాల భవనానికి సంబంధించిన ఆర్‌ఎస్‌డీ, ఆర్‌ఎల్‌డీ పత్రాలు, బిల్డింగ్ ప్లాన్, ఎఫ్‌డీఆర్, అగ్నిమాపక శాఖ, స్థానిక సంస్థలు, ట్రాఫిక్ పోలీసుల నుంచి నిరభ్యంతర పత్రాలు, భవన దృఢ ధ్రువీకరణపత్రం, శానిటరీ సర్టిఫికెట్, క్రీడా మైదానం వివరాలతో కూడిన సర్టిఫికెట్లను విధిగా ఇంటర్మీడియెట్ బోర్డుకు సమర్పించాలని పేర్కొన్నారు. దరఖాస్తులు, సర్టిఫికెట్లను కూలంకషంగా పరిశీలించిన తర్వాతే 2022–23 విద్యా సంవత్సరానికి గుర్తింపును రెన్యువల్ చేస్తామని పేర్కొన్నారు. మిగిలిన ఆరు ధ్రువీకరణపత్రాలను సమర్పించడానికి ఆయా కళాశాలల యాజమాన్యాలకు వారి సొంత బాధ్యతపై ప్రభుత్వం మూడు నెలలు గడువు ఇచ్చిందని తెలిపారు. ఈ గడువులోపు సర్టిఫికెట్లు సమర్పించని కళాశాలల గుర్తింపు రద్దు అవుతుందని పేర్కొన్నారు.
చదవండి:
Published date : 07 Sep 2022 05:08PM