APBIE: ఇంటర్ విద్యా క్యాలెండర్‌ను విడుదల చేసిన విద్యాశాఖ
ఈ మేరకు మాధ్యమిక విద్యా శాఖ 2023–24 విద్యాసంవత్సరం క్యాలెండర్‌ను ఏప్రిల్ 28న విడుదల చేసింది. యూనిట్–1 పరీక్షలు జూలై 26–28 వరకు, యూనిట్–2 పరీక్షలు ఆగస్ట్ 24–26 వరకు నిర్వహించనున్నారు. క్వార్టర్లీ పరీక్షలు సెప్టెంబర్ 16–23 వరకు, యూనిట్–3 అక్టోబర్ 16–18 వరకు నిర్వహించనున్నారు. అక్టోబర్ 19–25 వరకు దసరా సెలవులు. యూనిట్–4ను నవంబర్ 23– 25 వరకు, హాఫ్ ఇయర్లీ పరీక్షలను డిసెంబర్ 18–23 వరకు నిర్వహిస్తారు. 2024 జనవరి 11–17 వరకు సంక్రాంతి సెలవులు.
చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్ పేపర్స్ | న్యూస్
ప్రీఫైనల్ ఎగ్జామ్స్‌ను జనవరి 19–25 వరకు, వార్షిక ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి రెండో వారంలో, వార్షిక పరీక్షలను మార్చి మొదటి వారంలో నిర్వహిస్తారు. 2023–24 విద్యా సంవత్సరంలో చివరి పనిదినాన్ని మార్చి 28గా పేర్కొన్నారు. మార్చి 29–మే 31 వరకు వేసవి సెలవులు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను మే చివరి వారంలో ఉంటాయి. 2024–25 విద్యా సంవత్సరంలో కాలేజీలను జూన్ 1 పునర్ ప్రారంభించనున్నట్లు ఇంటర్ బోర్డు కమిషనర్ శేషగిరిబాబు ఉత్తర్వులిచ్చారు.