ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్స్ (సీవోబీఎస్‌ఈ) 50వ వార్షిక సదస్సును విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నవంబర్ 25న విజయవాడలో ప్రారంభించారు.
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ ప్రారంభ సందేశం ఇచ్చారు. రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి శేషగిరిబాబు, సీవోబీఎస్‌ఈ ప్రెసిడెంట్ అసనో సెఖోస్ మాట్లాడారు. దేశంలోని 36 సెకండరీ బోర్డులకు సంబంధించిన 61 మంది అధికారులు దీనికి హాజరయ్యారు. సెకండరీ విద్యలో వినూత్న చర్యలు, బోర్డుల ద్వారా ఉత్తమ పద్ధతులు, జాతీయ విద్యా విధానం అమలుపై సదస్సులో చర్చ జరుగుతుంది.