Dussehra Holidays: సెలవుల్లో కాలేజీలు తెరిస్తే గుర్తింపు రద్దు
Sakshi Education
విశాఖ విద్య: దసరా సెలవుల్లో జూనియర్ కాలేజీలు తెరిస్తే గుర్తింపు రద్దుకు ప్రభుత్వానికి సిఫార్స్ చేస్తామని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు జి. సీతారాం, ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి రాయల సత్యనారాయణ హెచ్చరించారు.
ఆర్‌ఐవో కార్యాలయం నుంచి అధికారులు, కాలేజీల ప్రిన్సిపాళ్లతో బుధవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గురువారం నుంచి అక్టోబర్ 25 వరకు జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటించినట్లు వెల్లడించారు.
చదవండి: Dussehra Holidays: జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు.. తేదీలు ఇవే..
ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే కాలేజీల గుర్తింపు రద్దు చేయడంతో పాటు, యాజమాన్యానికి రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తామని ఆర్‌ఐవో స్పష్టం చేశారు. సమస్యలుంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు 9392911802, 0891– 2552854కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.
Published date : 19 Oct 2023 04:10PM