Skip to main content

APOSS Open 10th and Inter Admissions 2023: దరఖాస్తుల ఆహ్వానం

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఓపెన్‌ 10వ తరగతి, ఇంటర్‌ ( సైన్స్‌, ఆర్ట్స్‌ గ్రూపులు) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారి శ్రీరాం పురుషోత్తం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
APOSS Open 10th and Inter Admissions 2023
APOSS Open 10th and Inter Admissions 2023

ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ( ఏపీఓఎస్‌ఎస్‌) ద్వారా 2023–2024 సంవత్సరానికి గాను 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. జులై 26వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 25వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుం చెల్లించకుండా దరఖాస్తులు చేసుకోవచ్చునని తెలియచేశారు. రూ.200 అపరాధ రుసుంతో అక్టోబర్‌ 5వ తేదీలోగా చెల్లించవచ్చునని వివరించారు.

Scholarships: డిగ్రీకి రూ.2 లక్షలు, పీజీకి రూ.6 లక్షలు... ఇలా చేస్తే యూజీ, పీజీ ఫ్రీ

10వ తరగతిలో చేరేందుకు 14 సంవత్సరాలు పూర్తిగా నిండి ఉండాలని, ఇంటర్‌లో చేరేందుకు 10వ తరగతి పాస్‌ అయి ఉండటంతో పాటు 15 సంవత్సరాలు నిండి ఉండాలని సూచించారు.

Published date : 26 Jul 2023 12:15PM

Photo Stories