Skip to main content

AP Inter Exams: ఇంటర్మీడియట్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

All prepared for intermediate exams

విజయనగరం అర్బన్‌: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల సందడి శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ప్రాక్టికల్‌ పరీక్షలు ఈ నెల 11 నుంచి ప్రారంభమై 20వ తేదీ నాటికి ముగిశాయి. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు థియరీ పరీక్షలు జరగనున్నాయి. నిఘా నీడలో పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పరీక్ష కేంద్రంలోని ప్రతి గదిలోనూ సీసీ కెమెరాలు అమర్చారు. జిల్లాలో మొత్తం 45,755 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 20,630 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 25,125 మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం 73 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతలు కల్పనపై జిల్లా కన్వీనర్‌ మజ్జి ఆదినారాయణ, జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) సభ్యులు ప్రత్యేక దృష్టిసారించారు. జిల్లా కేంద్రానికి రెండు రోజుల కిందట వచ్చిన ప్రశ్నపత్రాలను స్థానిక ప్రాంతీయ ఇంటర్మీడియట్‌ పర్యవేక్షణ అధికారి కార్యాలయంలోని స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు. ఆర్మ్‌డ్‌ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. 26వ తేదీ నుంచి 24 స్టోరేజ్‌ పాయింట్లు (పోలీస్‌ స్టేషన్ల)కు తరలించనున్నారు. 73 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 73 మంది డిపార్డుమెంటల్‌ అధికారులు, రెగ్యులర్‌ అధ్యాపకులు, లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్లను నియమించారు. దాదాపు 1,200 మంది ప్రభుత్వ టీచర్లను ఇన్విజిలేటర్లుగా నియమించారు.

చదవండిIntermediate Exams 2024: ఇంటర్ పరీక్షలు... కంట్రోల్ రూం నంబర్ అదే

వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌...
విద్యార్థులు హాల్‌టికెట్ల కోసం ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా https://bieap.apcfss.in/ వెబ్‌సైట్‌లో ఉంచారు. వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా విద్యార్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రిన్సిపాల్‌ సంతకం అవసరం లేదు. హాల్‌టికెట్‌ తీసుకుని నేరుగా పరీక్ష కేంద్రాలకు వెళ్లొచ్చు.

ఏ చిన్న పొరపాటుకూ తావివ్వొద్దు
ఇంటర్‌ పరీక్షల నిర్వహణలో ఏ చిన్న పొరపాటుకూ తావివ్వొద్దని ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణ జిల్లా కన్వీనర్‌ మజ్జి ఆదినారాయణ అధికారులకు సూచించారు. చీఫ్‌ సూరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఎవరూ సెల్‌ఫోన్లు వినియోగించరాదన్నారు. సీఎస్‌, డీఈలు, ఇతర సిబ్బంది తమ సెల్‌ఫోన్లను సీఎస్‌ల వద్ద డిపాజిట్‌ చేయాలన్నారు. బోర్డు నుంచి ప్రతి సెంటర్‌కూ కీ ప్యాడ్‌ ఫోన్లు పంపుతారన్నారు. వాటి ద్వారా సీఎస్‌లు సమాచారం పంపాల్సి ఉంటుందన్నారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌ఐఓ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ (ఫోన్‌: 08922–237988)ను ఏర్పాటు చేశామన్నారు.

Published date : 29 Feb 2024 07:20PM

Photo Stories