Skip to main content

AP EAPCET 2022: కౌన్సెలింగ్‌ ప్రక్రియ తేదీలు ఇవే..

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన AP EAPCET–2022 అడ్మిషన్ల తొలివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆగస్టు 22 నుంచి ప్రారంభం కానుంది.
AP EAPCET 2022
ఏపీఈఏపీ సెట్‌–2022 కౌన్సెలింగ్‌ ప్రక్రియ తేదీలు ఇవే..

సెప్టెంబర్‌ 6న సీట్ల కేటాయింపు జరుగుతుంది. 2022 మొత్తం 1,94,752 మంది విద్యార్థులు APEAP CETకు హాజరుకాగా.. 1,73,572 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరికి కాలేజీల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించి కౌన్సెలింగ్‌ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 22 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపునకు అవకాశమిచ్చారు. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ అడ్రస్‌: https://sche.ap.gov.in/APSCHEHome.aspx కాగా, ఇక ఆగస్టు 23 నుంచి 31 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేపట్టనున్నారు. 28 నుంచి సెప్టెంబర్‌ 2 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 3న ఆప్షన్లలో మార్పులకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్‌ 6న సీట్ల కేటాయింపు చేస్తారు. అదే రోజు నుంచి 12లోగా సంబంధిత కళాశాలల్లో విద్యార్థులు రిపోర్టు చేయాలి. 12వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని అడ్మిషన్ల కన్వీనర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. వెబ్‌ కౌన్సెలింగ్‌కు రాష్ట్రవ్యాప్తంగా 25 హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. విద్యార్థులకు సమస్యలు తలెత్తితే కన్వీనర్‌ కార్యాలయాన్ని ‘కన్వీనర్‌ APEAPCET 2022 ఎట్‌ ద రేట్‌ జీమెయిల్‌.కామ్‌’ ద్వారా సంప్రదించవచ్చు. లేదా 7995681678, 7995865456 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

చదవండి: 

Published date : 22 Aug 2022 01:35PM

Photo Stories