Forest Department Jobs 2024: అటవీశాఖలో 689 ఉద్యోగాలు.. దీంతో పాటు భర్తీ చేయనున్న వివిధ పోస్టులు ఇవే..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్‌లో జనవరి 31వ తేదీన మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ ఏపీ కేబినెట్ సమావేశంలో మహిళలు, రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగుల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునున్నారు. ఈ కేబినెట్ భేటీలో ఉద్యోగాల భర్తీతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఏపీ డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్‌ల విడుదలపై చర్చించారు. 6100 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల (AP DSC Notification) భర్తీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అటవీశాఖ(Forest Department)లో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదించింది. ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్లు సహా వివిధ పోస్టుల భర్తీ చేయనున్నారు.
అలాగే.. వైద్యారోగ్య శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. రైతు భరోసా, సున్నా వడ్డీ, ఇన్ ఫుట్ సబ్సిడీ, పంట బీమా కలిపి నాలుగు వేల కోట్ల బకాయిలు అక్టోబర్ నెలల్లో చెల్లిస్తామని ప్రకటించారు. ‘ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వచ్చే లోపు ఐఆర్ అంశం. డీఎస్సీ నోటిఫికేషన్. అసెంబ్లీ సమావేశాలు, జగనన్న కాలనీలు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం’ తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5 వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు.
ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఎస్‌ఈఆర్‌టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినెట్ ఆమోదం. యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచినట్లు తెలిపారు.