Students Talent in Board Exams: వార్షిక పరీక్షల్లో సత్తా చాటిన టెన్త్ విద్యార్థులు.. రాష్ట్రస్థాయిలో విజయనగరం జిల్లా!
విజయనగరం అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో ఈ ఏడాది కూడా బాలికలదే పైచేయి సాధించారు. బాలుర కంటే 3.82 శాతం అధికంగా బాలికలు ఉత్తీర్ణులయ్యారు. 91.82 శాతం ఉత్తీర్ణతతో విజయనగరం జిల్లా రాష్ట్రస్థాయిలో 5వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 23,690 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 91.82 శాతంతో 21,752 మంది ఉత్తర్ణులయ్యారు. వీరిలో బాలికలు 11,822 మంది పరీక్షకు హాజరుకాగా 93.73 శాతంతో 11,081 మంది పాసయ్యారు. అలాగే, బాలురు 11,868 మందిలో 89.91 శాతంతో 10,671 మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది పరీక్ష రాసిన 24,040 మందిలో 76.66 శాతంతో 18,430 మంది మాత్రమే ఉత్తీర్ణులై రాష్ట్రస్థాయిలో 7వ స్థానంలో జిల్లా నిలిచింది. 2021–22 ఏడాదిలో 77.50 శాతం ఉత్తీర్ణత తెచ్చుకొని జిల్లాకి రాష్ట్రస్థాయిలో 3వ స్థానం వచ్చింది.
అదరగొట్టిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన పాఠశాలల విద్యార్థులు ఏడుగురు అత్యధికంగా 590 పైగా మార్కులు సాధించారు. వీరిలో ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు నలుగురు, ఏపీ గురుకుల సొసైటీ స్కూల్ విద్యార్ధులు ముగ్గురు ఉన్నారు. 580–589 మధ్య మార్కులు తెచ్చుకున్న వారు 79 మంది ఉన్నారు. వీరిలో జెడ్పీహెచ్ స్కూల్ విద్యార్థులు అత్యధికంగా 29 మంది, తరువాత వరుసలో ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు 27 మంది నమోదయ్యారు.
Tenth Students Ability: పది పరీక్షల్లో వసతి గ్రుహాల విద్యార్థుల ప్రతిభ..
సత్తా చాటిన ఆదర్శన పాఠశాల విద్యార్థులు
నెల్లిమర్ల రూరల్‌లో పదో తరగతి ఫలితాల్లో కొండవెలగాడ, మొయిద, పారసాం, సతివాడ ఆదర్శ పాఠశాల విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. సతివాడ ఆదర్శ పాఠశాలలో 93 మందిలో 590 పైగా మార్కులను ఇద్దరు, 560కు పైగా మార్కులను 20 మంది, 500కు పైగా మార్కులను 59 మంది విద్యార్థులు సాధించారు. విద్యార్థులకు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఇందిరా ప్రియదర్శిని, సిబ్బంది అభినందనలు తెలిపారు.
సత్తాచాటిన బొబ్బిలి గురుకుల విద్యార్థులు
పదోతరగతి ఫలితాల్లో బొబ్బిలి గురుకుల విద్యార్థులు సత్తాచాటారు. 77 మంది పరీక్షలకు హాజరు కాగా అందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 65 మంది విద్యార్థులు 550 దాటి మార్కులు సాధించారు. మిలినవారు 500–550 మధ్య మార్కులు సాధించారు. కె.వరుణ్–592, ఎ.హర్షవర్ధన్–591, కె.రాకేష్–590 మార్కులతో రాణించారు.
Degree Semester Exams: ఎస్కేయూ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు.. ఎప్పటి వరకు?
Tags
- tenth annual exams
- board results
- ap tenth board results 2024
- students talent
- ability and talent of students
- AP Tenth results
- top scorers in tenth board
- gurukul school students talent in tenth board
- gurukul students scores
- toppers in tenth board
- Education News
- Sakshi Education News
- vizianagaram at fifth position