Skip to main content

AP Tenth Class Result 2023 Direct links : ఏపీ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌.. ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి..(Click Here)

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ టెన్త్‌ ప‌బ్లిక్‌ ప‌రీక్ష‌ల ఫ‌లితాలను మే 6వ తేదీ ఉద‌యం 11:00 గంట‌ల‌కు విడుద‌ల చేశారు. ఈ ఫ‌లితాల‌ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు.
ap tenth class result 2023 released news telugu
ap tenth class result 2023

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జ‌రిగిన విష‌యం తెల్సిందే. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అత్యంత‌ తక్కువ వ్యవధిలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. ఈ ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌ ఫలితాలను https://results.sakshieducation.com/లో చూడొచ్చు.గత ఏడాది 28 రోజుల్లో విడుదల చేయగా, ఈ ఏడాది 18 రోజుల్లో ఫలితాలను విడుద‌ల చేశారు. 

How to check AP SSC 10th Class Results 2023?

  • Visit https://results.sakshieducation.com
  • Click on AP SSC 10th class results 2023 link available on the home page
  • Enter the roll no. and click on submit button
  • The results will be displayed
  • Download and save a copy for further use.

ఏపీ టెన్త్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు-2023 ఫ‌లితాల డైరెక్ట్ లింక్ ఇదే (Click Here)

ఈ సంద‌ర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎక్కడా ఏవిధమైన లీకేజీ లేకుండా పూర్తి పారదర్శకంగా ఈ పరీక్షలను నిర్వహించామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప‌ది ప‌రీక్ష‌ల‌కు మొత్తం 6,64,152 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారన్నారు. వీరిలో రెగ్యులర్‌ అభ్యర్థులు 6,09,070 మంది కాగా, మిగిలిన వారు ఓఎస్సెస్సీ రెగ్యులర్, సప్లిమెంటరీ అభ్యర్థులు. 3,349  కేంద్రాల్లో  పరీక్షలు నిర్వహించామ‌న్నారు. అలాగే ఈ ఏడాది ఎక్కువ మంది ఉత్తీర్ణ‌త సాధించామ‌న్నారు.

సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఇవే..

ts 10th class result 2023


☛ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానం(87.4 శాతం ఉత్తీర్ణత). 
☛ నంద్యాల జిల్లా చివరి స్థానంలో ఉంది. 
☛ ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో 95.25 శాతం మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. 
☛ జూన్‌ 2 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు. 
☛ మే 17వ తేదీలోపు సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తులకు ఆహ్వానం.

విద్యార్థుల‌కు మేలు చేసేలా మార్కులు ఇలా..
మరోవైపు పదో తరగతి విద్యార్థులకు మేలు జరిగేలా ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో ఎవరైనా విద్యార్థి నిర్ణీత ప్రశ్నల సంఖ్య కన్నా ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాసి ఉంటే.. వాటిలో ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ విద్యార్థి మొత్తం మార్కులను నిర్ణయించారు.

Published date : 06 May 2023 11:55AM

Photo Stories