వారం రోజులలో పదవ తరగతి ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ సెకండియర్ ఫలితాలను జూలై 23వ తేదీన సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...పదవ తరగతి ఫలితాలపై కూడా స్ఫష్టత ఇచ్చారు.పదవ తరగతి ఫలితాలను వారం రోజులలో ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. ఇంటర్, డిగ్రీ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. అడ్మిషన్లలో అవకతవకలకి పాల్పడే కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని మంత్రి సురేష్ హెచ్చరించారు.
Published date : 23 Jul 2021 07:18PM