Tenth Class: పది అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఇవే..
జూన్ 6న టెన్త్ ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీవరకు గడువు ఉందని తెలిపారు. రూ.50 ఆలస్య రుసుంతో జూన్ 21వ తేదీ నుంచి ఆయా సబ్జెక్టుల పరీక్ష తేదీకి ఒక రోజుముందు వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు.
చదవండి: స్డడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
విద్యార్థులకు ఊరట కల్పిస్తూ..
కరోనా కారణంగా చదువులు సరిగా ముందుకు సా గక విద్యార్థులు కొంత నష్టపోయిన నేపథ్యంలో వారికి ఊరట కల్పించేలా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి బొత్స వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు ఎన్ని మార్కులు సాధించినా వారిని కంపార్టుమెంటల్ పాస్ కింద కాకుండా పరీక్షలో ఆయా విద్యార్థులు సాధించే మార్కులను యథాతథంగా పరిగణనలోకి తీసుకుని రెగ్యులర్ పరీక్షల మాదిరిగానే వారికి డివిజన్‌లను కేటాయించనున్నామని మంత్రి వివరించారు.