సాక్షి, అమరావతి: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్టు పాఠశాల విద్యాశాఖ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు.
ఆన్‌లైన్‌లో ‘పది’ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు
అన్ని పాఠశాలల నామినల్ రోల్స్, హాల్‌టికెట్లను తమ పాఠశాల కోడ్, పాస్‌వర్డ్స్‌తో www.bse.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. హాల్‌టికెట్లపై ఏమైనా తప్పులు ఉంటే వాటిని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సరిచేయాలని ఆదేశించారు. కాగా, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 2 నుంచి 10 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల దాకా నిర్వహించనున్నారు.