Skip to main content

టీఎస్‌ టెన్త్ ఫలితాల్లో 5.21 లక్షల మందికి గ్రేడ్ల కేటాయింపు: సబితా ఇంద్రారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం శుక్రవారం ప్రకటించింది.
కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేసినట్లు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లను నిర్ణయించినట్లు తెలిపారు. ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1లో (ఎఫ్‌ఏ) ఒక్కో సబ్జెక్టులో 20 శాతం మార్కులకుగాను విద్యార్థులకు వచ్చిన మార్కులను 100 శాతానికి పెంచి గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లను నిర్ణయించి, మొత్తంగా గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌ (జీపీఏ) ప్రకటించినట్లు వివరించారు. మొత్తంగా పదో తరగతి పరీక్షలు రాసేందుకు రిజిస్టర్‌ చేసుకున్న 5,21,073 మంది విద్యార్థులను ఉత్తీర్ణులను చేసినట్లు మంత్రి ప్రకటించారు. వారిలో 5,16,578 మంది రెగ్యులర్‌ విద్యార్థులు కాగా 4,495 మంది గతంలో ఫెయిలై ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించినవారున్నారు.

Check Telangana Tenth Class 2021 Results here

ఉత్తీర్ణత సాధించిన రెగ్యులర్‌ విద్యార్థుల్లో 2,62,917 మంది బాలురు కాగా, 2,53,661 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. మొత్తం విద్యార్థుల్లో 2,10,647 మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 11,445 పాఠశాలలకు గాను 535 పాఠశాలల్లో విద్యార్థులందరికీ 10/10 వచ్చినట్లు వివరించారు. గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు, జీపీఏతో కూడిన మార్కుల జాబితాలను తమ వెబ్‌సైట్‌లలో అందుబాటు లో ఉంచామని, విద్యార్థులు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించారు. అలాగే విద్యార్థుల పాస్‌ మెమోలను సంబంధిత ప్రధానోపాధ్యాయులకు పరీక్షల విభాగం పంపిస్తుందని, అక్కడి నుంచి విద్యార్థులు తీసుకోవచ్చని మంత్రి సూచించారు. పాస్‌ మెమోల్లో ఏవైనా పొరపాట్లు తలెత్తితే సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా ప్రభుత్వ పరీక్షల విభాగానికి పంపిస్తే సరిదిద్దుతారన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు భవిష్య లో మంచి కోర్సులను ఎంపిక చేసుకొని తమ భవిష్యత్‌ను బంగారుమయం చేసుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

పదో తరగతి తర్వాత ఎంపిక చేసుకోవల్సిన కోర్సులు, ఉద్యోగావకాశాలు, ఎక్స్‌పర్ట్స్‌ కెరీర్‌ గైడెన్స్‌... ఇతర సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

టెన్త్ పరీక్షలు.. ఫలితాలు ఇలా...
పరీక్షలకు నమోదు చేసుకున్న మొత్తం విద్యార్థులు: 5,21,073
రెగ్యులర్‌ విద్యార్థులు: 5,16,578
గతంలో ఫెయిలైన ఇప్పుడు ఫీజు చెల్లించినవారు: 4,495
ఉత్తీర్ణులైన రెగ్యులర్‌ విద్యార్థుల్లో బాలురు: 2,62,917
ఉత్తీర్ణులైన రెగ్యులర్‌ విద్యార్థుల్లో బాలికలు: 2,53,661
జీపీఏ 10/10 వచ్చినవారు: 2,10,647
Published date : 22 May 2021 02:03PM

Photo Stories