Skip to main content

SSC: ప్రీ ఫైనల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

రాష్ట్రంలో అన్ని యాజమాన్యాల పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి ప్రీ ఫైనల్‌ పరీక్షలు జరగనున్నాయి.
SSC:
ఎస్సెస్సీ ప్రీ ఫైనల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) తాత్కాలిక షెడ్యూల్‌ ప్రకటించింది. తుది షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. పబ్లిక్‌ పరీక్షల మాదిరిగానే ప్రీఫైనల్‌ నిర్వహణకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. దీంతోపాటు ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించిన ఫార్మేటివ్, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షల మార్కులను కూడా పాఠశాల విద్యాశాఖ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రైవేటు పాఠశాలలు తమ విద్యార్థులకు ఇష్టానుసారం మార్కులు నమోదు చేయకుండా జాగ్రత్తలు చేపట్టింది. ఏప్రిల్‌ 30వ తేదీ వరకు పాఠశాలలు పనిచేస్తాయి.

చదవండి: స్డడీ మెటీరియల్‌ | బిట్ బ్యాంక్ | సిలబస్

ఫార్మేటివ్‌ అసెస్‌మెంటు–4 రద్దు

ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలను ఈ విద్యా సంవత్సరంలో మూడింటికే పరిమితం చేశారు. నాలుగో ఫార్మేటివ్‌ టెస్టును రద్దు చేశారు. కరోనా కారణంగా 2021–22 విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. దీనివల్ల పని దినాలు తగ్గిపోవడంతో సిలబస్‌ను కుదించారు. ఈ కారణంగా ఫార్మేటివ్‌ టెస్టు–4ను రద్దు చేస్తున్నట్లు ఎస్సీఈఆర్టీ పేర్కొంది. ఈ విద్యా సంవత్సరం వరకు మాత్రమే ఈ రద్దు వర్తించనుంది. విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరపు మార్కుల వెయిటేజిని 3 ఎఫ్‌ఏ టెస్టులకే తీసుకోవాలని ఆదేశించింది. ఫార్మేటివ్‌–3 (ఎఫ్‌ఏ–3) పరీక్షలు మార్చి 14 నుంచి జరుగుతాయి. సమ్మేటివ్‌ పరీక్షలు ఎప్పటిలానే ఈ విద్యా సంవత్సరంలోనూ రెండే ఉంటాయి. ఇప్పటికే సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1 పూర్తయినందున ఏప్రిల్‌ 22 నుంచి ఎస్‌ఏ–2 పరీక్షలు నిర్వహించనున్నారు. టెన్త్ విద్యార్థులకు ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నందున ఒకటో తరగతి నుంచి 9 వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఎస్‌ఏ–2 పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షల అనంతరం వాటిలో వచ్చిన మార్కుల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారికి రెమిడియల్‌ క్లాసులు నిర్వహిస్తారు.

చదవండి: మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

ఎఫ్‌ఏ – 3 షెడ్యూల్‌ ఇలా

  • ప్రైమరీ (1 – 5) తరగతులకు 14న తెలుగు, మేథమెటిక్స్, 15న ఇంగ్లిష్, పర్యావరణ శాస్త్రం పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం ఉంటాయి.
  • సెకండరీ (6–10) తరగతులు ఉదయం 8, 9, 10 తరగతుల వారికి, మధ్యాహ్నం 6, 7 తరగతుల వారికి ఎఫ్‌ఏ–3 పరీక్షలు ఉంటాయి.
  • 14న ఉదయం తెలుగు, మేథమెటిక్స్, మధ్యాహ్నం తెలుగు, మేథమెటిక్స్‌
  • 15న ఉదయం హిందీ, ఫిజికల్‌ సైన్సు, బయోలాజికల్‌ సైన్సు, మధ్యాహ్నం హిందీ, జనరల్‌ సైన్సు
  • 16న ఉదయం ఇంగ్లిష్, సోషల్, మధ్యాహ్నం ఇంగ్లిష్, సోషల్‌ పరీక్షలుంటాయి.
Published date : 05 Mar 2022 12:17PM

Photo Stories