Board Exams: 10వ విద్యార్థుల శిక్షణకు ప్రత్యేక ప్రణాళిక..
సాక్షి ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షలు త్వరలో జరగనున్న నేపథ్యంలో వంద శాతం ఉత్తీర్ణతపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ప్రత్యేక ప్రణాళికతో శిక్షణ తరగతులు నిర్వహిస్తూ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తోంది. జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది.
Navodaya Entrance Exam: సాఫీగా సాగిన నవోదయ ప్రవేశ పరీక్షలు..
ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ప్రారంభం కానుండగా, అప్పటి వరకూ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కొనసాగనుంది. అన్ని సబ్జెక్టులపై మంచి పట్టు సాధించేలా శిక్షణ ఇస్తున్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకూ రోజుకో సబ్జెక్టుపై విద్యార్థులకు ప్రత్యేక స్టడీ అవర్‌తో పాటు మరుసటి రోజు ఉదయం పరీక్ష నిర్వహిస్తున్నారు.
SCERT: డెప్యుటేషన్ విధానంలో బోధన చేసేందుకు దరఖాస్తులు.. వీరే అర్హులు..
పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాల కల్పనపై దృష్టి..
ఇప్పటికే ఎంపిక చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాల కల్పనపై విద్యాశాఖాధికారులు నిమగ్నమయ్యారు. ప్రతి కేంద్రంలోనూ మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలు, ఫర్నీచర్ తగినంతగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
AP SET 2024: విడుదలైన ఏపీ సెట్ నోటిఫికేషన్.. దరఖాస్తుకు ఇదే చివరి తేదీ..!
మానసిక ఒత్తిళ్లకు లోనుకాకుండా విద్యార్థులకు ఆత్మస్థైర్యం పెంచేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి విద్యార్ధిపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటూ, ప్రత్యేక శిక్షణను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షిస్తున్నారు.