Skip to main content

Haryana State Civil Service Officers: ఏపీ ప్రభుత్వ బడుల్లో పథకాలు భేష్‌

పెనమలూరు: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న పథకాలు సంతృప్తిక రంగా ఉన్నాయని హరియాణా రాష్ట్ర అధికారుల బృందం ప్రశంసించింది.
Haryana State Civil Service Officers
ఏపీ ప్రభుత్వ బడుల్లో పథకాలు భేష్‌

 పెనమలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను అక్టోబ‌ర్ 31న‌ 48 మందితో కూడిన హరియాణా రాష్ట్ర సివిల్‌ సర్వీస్‌ అధికారుల బృందం సందర్శించింది. పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పాఠశాల హెచ్‌ఎం వై.దుర్గాభవాని వివరించారు. జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, ఇంగ్లిష్‌ బోధన, మనబడి నాడు–నేడు పథకంతో పాఠశాలల అభివృద్ధి, ట్యాబ్‌లు, ఇతర సంక్షేమ పథకాల గురించి అధికారుల బృందం అడిగి తెలుసుకుంది.

చదవండి: Dr Nandyala Bhupal Reddy: సీనియర్ జర్నలిస్ట్, టిసాట్ ప్రోగ్రాం ప్రొడ్యూసర్ కి డాక్టరేట్

విద్యార్థులు రూపొందించిన పలు ప్రాజెక్టులను పరిశీలించిన హరియాణా అధికారులు వారితో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను హరియాణా అధికారులు ప్రశంసించారు. రాష్ట్ర అధికారులు రవీంద్ర(హెచ్‌ఆర్‌డీ), పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయం అధికారి రమేష్‌, డీఈఓ తాహేరా సుల్తానా పాల్గొన్నారు.

Published date : 01 Nov 2023 12:53PM

Photo Stories