Sakshi Media Group: ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్ బీ’ పరీక్షలు
ఈ పరీక్షలకు ప్రజెంటింగ్ స్పాన్సర్‌గా డ్యూక్స్ వ్యాపి, అసోసియేట్ స్పాన్సర్‌గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహరిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఆయా పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. ఈ పరీక్షలను మ్యాథ్య్, ఇంగ్లిష్ సబ్జెక్టులపై నిర్వహించారు.
చదవండి: స్పెల్లింగ్ బీ పోటీల్లో తొలిస్థానం దక్కించుకున్న మొదటి ఆఫ్రికన్ అమెరికన్?
1వ కేటగిరీ 1, 2వ తరగతులు, 2వ కేటగిరీ 3,4 తరగతులు, 3వ కేటగిరీ 5,6,7 తరగతులు, 4వ కేటగిరీ 8,9,10 తరగతుల విద్యార్థులకు నిర్వహించారు. తాడేపల్లిగూడెంతోపాటు నరసాపురం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల నుంచి విద్యార్థులు తరలివచ్చారు. ఈ పరీక్షలకు హాజరవ్వడం సంతోషంగా ఉందని, ఆయా సబ్జెక్టులకు సంబంధించి పట్టు సాధించాల్సిన విషయాలపై అవగాహన పెరిగిందన్నారు.
టీచర్ల ప్రత్యేక తర్ఫీదుతో..
సాక్షి స్పెల్ బీ పరీక్షలు రా యడం బాగుంది. సబ్జెక్టును మరింత మెరుగుచేసుకునేందు కు ఈ పరీక్షలు దోహదపడతాయి. మా టీచర్లు ప్రత్యేక తర్ఫీదు ఇచ్చారు.
– కె.డింపుల్, 8వ తరగతి, ప్రతిభ ఇంగ్లిష్ మీడియం స్కూల్, జంగారెడ్డిగూడెం.